Fifth ODI
-
ఆఖరి పోరాటం
సొంతగడ్డపై 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్ విజయం కోసం చివరి మ్యాచ్ దాకా పోరాడాల్సి ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆస్ట్రేలియా స్ఫూర్తిదాయక ఆటతో పోరులో నిలిచింది. ఇప్పటి వరకు అత్యంత పటిష్టమైనదిగా భావిస్తూ వచ్చిన మన బౌలింగ్ బలగాన్ని కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఊచకోత కోయగలరని మొహాలీ వన్డే నిరూపిస్తే... పరిష్కారమైపోయిందనుకున్న ‘నంబర్ 4’ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రాబోయే ఐపీఎల్ టి20 ప్రాక్టీస్‌ను పక్కన పెడితే వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా చివరి సారిగా వన్డే బరిలోకి దిగబోతోంది. ఇదే కూర్పు విశ్వ వేదికపై కొనసాగడం ఖాయం కాకపోయినా, తమ సత్తాను పరీక్షించుకునేందుకు టీమ్‌కు...జట్టులో మిగిలిన ఒకటి, రెండు స్థానాల కోసం పోటీ పడుతున్న ఆటగాళ్లకు ఇదే ఆఖరి అవకాశం. అటు ఆసీస్ కూడా అనూహ్యంగా పుంజుకోవడంతో చివరి మ్యాచ్‌లో రసవత్తర పోరు ఖాయమనిపిస్తోంది. న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్ ఇదే చివరిది కానుంది. మారిన ఐసీసీ నిబంధనల ప్రకారం 2020 మే నుంచి ఏ రెండు జట్ల మధ్య కూడా మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగదు. ఆసీస్‌తో స్వదేశంలో వరుసగా మూడు వన్డే సిరీస్‌లను నెగ్గిన టీమిండియా అదే రికార్డును కొనసాగిస్తూ మరో సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంటే... గత మ్యాచ్‌లో విజయం తర్వాత ఆసీస్‌లో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఫిరోజ్ షా కోట్లా వేదికగా నేడు జరిగే ఐదో వన్డేలో తలపడేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. మార్పుల్లేకుండానే... సిరీస్‌లో మూడు వన్డేల తర్వాత గత మ్యాచ్‌లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. కాబట్టి వెంటనే మార్పు చేయకుండా అదే జట్టు కొనసాగించవచ్చు. వికెట్ కీపింగ్‌లో ఇబ్బంది పడ్డా, రిషభ్ పంత్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. భువనేశ్వర్, చహల్ కూడా భారీగా పరుగులిచ్చినా వారిపై మేనేజ్మెంట్కు నమ్మకముంది. అయితే నాలుగో స్థానంలో ఆడిన లోకేశ్ రాహుల్ విషయంలో మాత్రం చర్చ ఖాయం. అంబటి రాయుడుకు బదులుగా వచ్చిన రాహుల్ పెద్దగా రాణించలేదు. ఇన్నింగ్స్ ఆసాంతం ఆత్మవిశ్వాసం లోపించినట్లు తడబడుతూనే ఆడాడు. అయితే వరల్డ్ కప్ ప్రాబబుల్స్‌లో ఒకడిగా ఉన్న అతడిని ఒకే మ్యాచ్ తర్వాత తప్పించే అవకాశం తక్కువ. ఈసారైనా అతను అంచనాలను అందుకుంటాడా చూడాలి. మరోవైపు మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగవుతున్న విజయ్ శంకర్‌ను నాలుగో స్థానంలో ప్రయత్నించే అవకాశాలు కూడా తీసిపారేయలేం. ఇక నాగపూర్ వన్డే మినహా మిగిలిన మూడు మ్యాచుల్లో 60, 53, 63 పరుగుల చొప్పున ఇచ్చిన బుమ్రా ఆట కూడా పదునెక్కాల్సి ఉంది. 358 పరుగులు చేసిన జట్టు బ్యాటింగ్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఓపెనర్లతో పాటు కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోగా... ఆ తర్వాత వచ్చే పంత్, కేదార్ జాదవ్ కూడా అదనపు పరుగులు జోడించాల్సి ఉంది. చాలా కాలం తర్వాత జంటగా విఫలమైన కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ చెలరేగితే మ్యాచ్ మన వైపు మొగ్గుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. ఆస్ట్రేలియా: ఫించ్, ఖాజా, మార్‡్ష, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్, టర్నర్, కారీ, రిచర్డ్సన్, కమిన్స్, జంపా, బెహ్రన్‌డార్ఫ్/లయన్. పిచ్, వాతావరణం ఫిరోజ్ షా కోట్లా వికెట్ నెమ్మదిగానే ఉంటుంది. ఇక్కడ జరిగిన గత రెండు వన్డేల్లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. టాస్ కీలకం కానుంది. మ్యాచ్ రోజు ఢిల్లీలో మేఘావృతంగా ఉండబోతున్నా వర్షం తో ఆటకు అంతరాయం కలిగే అవకాశం తక్కువ. జోరు మీదున్న కంగారూలు చాలా రోజులుగా తమ బ్యాటింగ్‌పై తీవ్రంగా ఆందోళన చెందిన ఆస్ట్రేలియాకు మొహాలీ మ్యాచ్ తర్వాత కొంత ఊరట లభించిందనేది వాస్తవం. రేపు వార్నర్, స్మిత్ వస్తే జట్టులోంచి చోటు కోల్పోయే అవకాశం ఉన్న ఖాజా, హ్యాండ్స్కోంబ్ ఈ సిరీస్‌లో సెంచరీలతో తమ సత్తా చాటడం విశేషం. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ ఎలాగూ ఉన్నాడు. ఇదే మైదానంలో ఐపీఎల్ అనుభవం ఎక్కువగా ఉన్న మ్యాక్సీ మళ్లీ బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోగలడు. మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌ను బట్టి చూస్తే స్టొయినిస్ గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించాడు. అయితే అతని స్థానంలో వచ్చి నాలుగో వన్డేలో అద్భుత ఆటతో గెలిపించిన టర్నర్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. అతను మళ్లీ చెలరేగగలడా చూడాలి. కానీ స్టొయినిస్ లేకపోవడంతో గత మ్యాచ్‌లో ఆసీస్ ఐదో బౌలర్ కొరతను ఎదుర్కొని భారీగా పరుగులు సమర్పించుకుంది. చివరకు ఫించ్ కూడా బౌలింగ్ వేయాల్సి వచ్చింది. ఈ సమస్యను జట్టు ఎలా అధిగమిస్తుందనేది కీలకం. రాంచీలో చక్కటి ప్రదర్శన తర్వాత డకౌట్ అయిన ఫించ్, వరుసగా మూడు మ్యాచుల్లోనూ విఫలమైన షాన్ మార్‡్ష కూడా రాణించాలని జట్టు కోరుకుంటోంది. చివరి మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో ఆడిన కంగారూలు పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ►25 1982లో తొలి వన్డేకు ఆతిథ్యం ఇచ్చిన ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఇది 25వ వన్డే. ఈ మైదానంలో భారత్ 12 మ్యాచ్‌లు గెలిచి, 6 ఓడింది. వీటిలో ఆస్ట్రేలియాపై 3 గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడింది. ఈ సిరీస్‌లో ఉన్న విధంగానే ప్రపంచ కప్‌లో కూడా జట్టు కూర్పు ఉండాలని లేదు. మేం వేర్వేరు సందర్భాల్లో ఆటగాళ్లు ఎలా ఆడగలరో ప్రయత్నిస్తున్నామంతే. మెగా టోర్నీకి ముందు అన్ని విధాలా పక్కాగా ఉండాలనేదే మా ఆలోచన. గత మ్యాచ్‌లో ఓటమి కూడా మంచికే జరిగింది. వరల్డ్ కప్‌లోగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా లోపాలు సరిదిద్దుకునే అవకాశం కలిగింది. ధోనిలాంటి దిగ్గజంతో పంత్‌ను పోల్చడం తప్పు. ఏ స్థానంలోనైనా బాగా బ్యాటింగ్ చేస్తున్న విజయ్ శంకర్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అతని బౌలింగ్ కూడా మెరుగవడం జట్టుపరంగా సానుకూల పరిణామం. రాంచీ మ్యాచ్‌లో క్యాప్‌లు ధరించడంలో మా ఉద్దేశం మన ఆర్మీకి సంఘీభావం ప్రకటించడమే. మేం ఐసీసీ అనుమతి తీసుకున్నాం కాబట్టి పాక్ బోర్డు ఏం చెప్పినా మాకు సంబంధం లేదు. – భరత్ అరుణ్, భారత బౌలింగ్ కోచ్ -
పంచ్ పడుతుందా.. పంచుకుంటారా..!
భారత్ జోరైన ఆటతో ఏక పక్షంగా ప్రారంభమై... వెస్టిండీస్ పోరాటంతో అటుఇటు మలుపులు తిరిగిన వన్డే సిరీస్ తుది అంకానికి చేరింది. రెండు జట్ల మధ్య నాలుగో మ్యాచ్ మాత్రమే సాదాసీదాగా సాగింది. ముంబైలో సరైన కూర్పుతో బరిలో దిగి ప్రత్యర్థిని చుట్టేసింది టీమిండియా. ఇప్పుడిక ఆఖరి వన్డే! మరి... కోహ్లి సేన అదే జోరుతో విండీస్‌ను ఓడిస్తుందా? లేక... అంత తేలిగ్గా తలొగ్గని హోల్డర్ బృందం సిరీస్‌ను సమం చేస్తుందా? తిరువనంతపురం: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు కోహ్లి సేన అడుగు దూరంలో ఉంది. స్వదేశంలో దాదాపు మూడేళ్లుగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఎదురైన ప్రతి ప్రత్యర్థిని మట్టి కరిపించి సిరీస్ మీద సిరీస్ గెలుస్తోంది టీమిండియా. ఈ క్రమంలో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో గురువారం జరుగనున్న ఐదో వన్డేలో వెస్టిండీస్‌ను ఓడిస్తే ఈ ఖాతాలో ఇంకోటి చేరుతుంది. పూర్తి స్థాయి సత్తా మేరకు ఆడితే ఇదేమంత కష్టమూ కాబోదు. అయితే, తొలుత చేతులెత్తేస్తుందనిపించిన పర్యాటక జట్టు... తర్వాత ప్రతిఘటించింది. ఓ మ్యాచ్ గెలిచి తమను తక్కువ అంచనా వేయొద్దని చాటింది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను సమం చేసే అవకాశాన్ని అంత సులువుగా వదులుకుంటుందని భావించలేం. ఇదే కూర్పుతో కొట్టేయాలి బ్యాటింగ్‌ను పటిష్ట పర్చుకుని, బౌలింగ్‌లో వైవిధ్యంతో ముంబై వన్డేలో దిగిన టీమిండియా ఘన విజయం సాధించింది. వాస్తవానికి ఇదే సరైన కూర్పు. దీంతో చివరి మ్యాచ్‌లో కోహ్లి సేన మార్పుల్లేకుండానే ఆడొచ్చు. ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం, మాజీ కెప్టెన్ ధోని తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోవడం తప్ప బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యల్లేవనే చెప్పాలి. రెండు శతకాలతో రోహిత్‌శర్మ, మూడు సెంచరీలతో కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండగా, అర్ధ శతకం, శతకంతో నాలుగో స్థానానికి నిఖార్సైన బ్యాట్స్‌మన్‌నని అంబటి తిరుపతి రాయుడు చాటుకున్నాడు. కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్ లోతును పెంచారు. ప్రారంభంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలను ఎదుర్కొనడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు తలకుమించిన భారం అవుతోంది. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ ఆకట్టుకుంటుండగా, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో విండీస్‌ను కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చహల్‌కు చోటు దక్కకపోవచ్చు. భువీ పరుగులు ఇస్తుండటమే కొంత ఆందోళన కలిగిస్తోంది. అతడిలాంటి బౌలర్ మ్యాచ్ ఏ దశలోనైనా ఉపయోగకరమే. ముంబైలోలా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విరుచుకుపడితే సిరీస్ 3–1తో టీమిండియా వశం కావడం ఖాయం. విండీస్ రెండు మార్పులతో... బౌలర్లు నిరాశపర్చినా, అత్యంత సీనియర్ శామ్యూల్స్ పేలవ ఫామ్‌లో ఉన్నా, సిరీస్ చేజారకుండా విండీస్ ఐదో మ్యాచ్ ఆడుతోందంటే ఇద్దరు బ్యాట్స్‌మెనే కారణం. వారు షై హోప్, హెట్‌మైర్. వీరికి ఓపెనర్ కీరన్ పావెల్, కెప్టెన్ హోల్డర్ సహకారం అందించడంతో ఆ జట్టు టీమిండియా ముందు నిలవగలిగింది. నాలుగో వన్డేలో హోల్డర్ మినహా మిగతా ముగ్గురూ విఫలమవడంతో భారీ తేడాతో ఓడింది. దీంతో కీలకమైన చివరి మ్యాచ్‌కు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఒక్కో మార్పుతో దిగనుంది. ఇప్పటివరకు కనీస స్కోర్లు చేయని ఓపెనర్ హేమ్రాజ్ స్థానంలో సునీల్ ఆంబ్రిస్‌ను, ఏమాత్రం ప్రభావం చూపని ఫాబియాన్ అలెన్ బదులుగా దేవేంద్ర బిషూలను తుది జట్టులోకి తీసుకోనుంది. పేసర్లు కీమర్ రోచ్, కీమో పాల్ పేరుకే అన్నట్లుండటం, స్పిన్నర్లు నర్స్, బిషూ అంతగా ప్రతిభావంతులు కాకపోవడంతో... ముందుగా బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరు చేస్తేనే విండీస్‌కు టీమిండియాపై నెగ్గే అవకాశాలు కాస్తయినా ఉంటాయి. హెట్‌మైర్, హోప్‌తో పాటు శామ్యూల్స్, రావ్‌మాన్ పావెల్ రాణిస్తేనే ఇది జరిగేందుకు వీలుంటుంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోని, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్, బుమ్రా వెస్టిండీస్: హేమ్రాజ్/ఆంబ్రిస్, కీరన్ పావెల్, హోప్, శామ్యూల్స్, రావ్‌మాన్ పావెల్, హోల్డర్, నర్స్, కీమో పాల్, రోచ్, అలెన్/బిషూ. ►ధోని మరో పరుగు చేస్తే వన్డేలో భారత్ తరఫున 10 వేల పరుగులు పూర్తవుతాయి. అతను ఇప్పటికే వన్డేల్లో 10173 పరుగులు సాధించినా... ఇందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ జట్టు తరఫున చేశాడు. -
ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం
కొలంబో: ఇంగ్లండ్ జట్టు తమ వన్డే చరిత్రలోనే అతి పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. శ్రీలంకతో సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్నా... చివరి వన్డేలో శ్రీలంక 219 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) భారీ తేడాతో నెగ్గింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది. డిక్వెలా (95), చండీమాల్ (80), కుషాల్ మెండిస్ (56), సమరవిక్రమ (54) భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఇంగ్లండ్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 26.1 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో వాన తగ్గకపోవడంతో ఫలితాన్ని ప్రకటించారు. -
యథాతథంగా వైజాగ్ వన్డే!
విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 29న విశాఖపట్నంలో జరగాల్సిన ఐదో వన్డేపై నెలకొన్న సందేహాలు తొలగిపోయారుు. ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని పిచ్ వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం సిద్ధంగా లేకపోవడం వల్ల వేదిక మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చారుు. అరుుతే ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం వైజాగ్‌లోనే జరగనుంది. బుధవారం బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స) ఎంవీ శ్రీధర్, బోర్డు క్యురేటర్ ఇక్కడి పిచ్‌ను పరిశీలించారు. పూర్తి తనిఖీ తర్వాత పిచ్‌పై వారిద్దరు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ’వైజాగ్ స్టేడియంలో అంతా బాగుంది’ అని వ్యాఖ్యానించిన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మ్యాచ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదే స్టేడియంలో నవంబర్ 17నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు కూడా జరగనుంది. -
నాలుగేళ్ల తర్వాత గెలిచింది!
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): వన్డేల్లో నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన ఐదో వన్డేలో ఆసీస్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని 45.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్లన్ శామ్యూల్స్(92, 87 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత పోరాటానికి తోడు చార్లెస్(48), బ్రావో(39) రాణించడంతో విండీస్ విజయాన్ని అందుకుంది. రామదిన్ 29, ఫ్లెచర్ 27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నీల్, జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫాల్కనర్ ఒక వికెట్ తీశాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కంగారు టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా(98) తృటిలో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ స్మిత్(74), బెయిలీ(55) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫించ్ డకౌటయ్యాడు. విండీస్ బౌలర్లలో హొల్డర్, బ్రాత్ వైట్, పొలార్డ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. శామ్యూల్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. -
ఒక్కటైనా గెలుస్తారా..!
ఎప్పుడో 27 ఏళ్ల క్రితం భారత్ చివరిసారిగా 0-5తో వెస్టిండీస్ చేతిలో వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది. ఈ మధ్యలో ఎన్ని సిరీస్‌లు ఓడినా అంతటి పరాభవం మళ్లీ చవిచూడలేదు. కానీ ఇప్పుడు ధోని సేన ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఆసీస్‌తో సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత పరువు నిలబెట్టుకోవడం అనే మాట కూడా చిన్నగానే కనిపిస్తున్న చోట... కనీసం క్లీన్‌స్వీప్ కాకుండా తప్పించుకోగలదా? స్పిన్‌కు అనుకూలమైన సిడ్నీ మైదానంలో టీమిండియా ఏమైనా ప్రభావం చూపించగలదా? * నేడు ఐదో వన్డే * దోని సేనకు అగ్ని పరీక్ష * క్లీన్‌స్వీప్‌పై ఆసీస్ గురి * మ్యాచ్‌కు వర్ష సూచన సిడ్నీ: తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు ఇప్పటికే 0-4తో సిరీస్ ఓడిపోయింది. కొన్ని సందర్భాల్లో విజయావకాశాలు వచ్చినా వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. ముఖ్యంగా కచ్చితంగా గెలుస్తారనుకున్న గత మ్యాచ్‌ను కూడా అప్పగించింది. భారీ స్కోర్లు నమోదు చేయగలిగినా... గెలుపు మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో సిరీస్‌లో చివరి వన్డేలో నెగ్గాలంటే టీమిండియా రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడ నేడు (శనివారం) జరిగే ఐదో వన్డేలో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో జోరు మీదున్న కంగారూలు క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు. అశ్విన్‌కు అవకాశం... పరుగుల వరద పారిన గత మ్యాచ్‌లతో పోలిస్తే సిడ్నీ సాంప్రదాయకంగా స్పిన్ పిచ్ కావడం భారత్‌కు కాస్త అనుకూలాంశం. ఈ నేపథ్యంలో ఒక పేసర్ స్థానంలో అశ్విన్ బరిలోకి దిగడం దాదాపు ఖాయం. భువనేశ్వర్ లేదా రిషి ధావన్‌లలో ఒకరిపై వేటు పడవచ్చు. నాలుగు మ్యాచ్‌లలోనూ నిరాశపర్చిన బౌలింగ్ ఈసారైనా మెరుగ్గా ఉంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయవచ్చు. ఇక బ్యాటింగ్‌లో టాప్-3 మొత్తం భారాన్ని మోస్తున్నారు. రోహిత్, కోహ్లి రెండేసి సెంచరీలు చేయగా, శిఖర్ ధావన్ మరో శతకం బాదాడు. లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్లు తమ పాత్రకు న్యాయం చేస్తే మళ్లీ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తన వైఫల్యంతో కాన్బెర్రా మ్యాచ్‌ను అప్పగించిన ధోనిపై చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సిన బాధ్యత ఉంది. రహానే పూర్తిగా కోలుకోకపోతే రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా మనీశ్ పాండే బరిలోకి దిగుతాడు. అంతా ఫామ్‌లో... మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రతీ ఒక్కరు తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. ఫించ్, వార్నర్, స్మిత్, బెయిలీ, మ్యాక్స్‌వెల్... అంతా సిరీస్‌లో ప్రభావం చూపించారు. దాంతో ప్రతీసారి జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. దాంతో ఆ జట్టుకు బ్యాటింగ్ బెంగ లేదు. మిషెల్ మార్ష్ ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఒక రకంగా భారత్‌తో పోలిస్తే ఆసీస్ బౌలింగ్‌లోనే అనుభవలేమి కనిపిస్తోంది. హేస్టింగ్స్, రిచర్డ్సన్ ఆ జట్టుకు సంబంధించి ద్వితీయ శ్రేణి బౌలర్లు మాత్రమే. దాంతో వారు పెద్దగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేదు కానీ భారత్ స్వయంకృతం కారణంగానే మ్యాచ్‌లు ఓడింది. మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా ఆడలేకపోతే అతని స్థానంలో షాన్ మార్ష్ లేదా బోలండ్కు అవకాశం దక్కవచ్చు. ఈ మ్యాచ్ ఓడితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోతుంది. ఉదయం గం. 8. 50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం టర్నింగ్ వికెట్. స్పిన్నర్లకు అనుకూలం. మ్యాచ్ రోజున భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా కాకపోయినా కొంత వరకు మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. వాతావరణం బాగా లేకపోవడంతో శుక్రవారం భారత్ ప్రాక్టీస్ రద్దయింది. ‘పరాజయాలు ఎదురైనా జట్టులో ఆత్మవిశ్వాసానికి లోటు లేదు. ఈ మ్యాచ్‌తో పాటు వరుసగా మూడు టి20లూ గెలవగలమనే నమ్మకముంది. సొంతగడ్డపై ఆసీస్‌ను ఓడించాలంటే అంత సులువు కాదు. మాలో చాలా మందికి అనుభవం లేకపోవడం కూడా సమస్య.’ - విరాట్ కోహ్లి ‘5-0తో గెలవడమే మా లక్ష్యం. విజయంతో ముగించాలని కోరుకుంటున్నా. కాబట్టి ఉదాసీనతకు చోటు లేదు. గత మ్యాచ్‌లో మేం కోలుకొని గెలిచిన తీరు పట్ల సంతోషంగా ఉన్నా. వ్యక్తిగత మైలురాయిని చేరువగా ఉన్నప్పుడు ఆటగాళ్లు నెమ్మదించడం చాలా సహజం. ప్రపంచ వ్యాప్తంగా అందరు క్రికెటర్లు ఇలాగే చేస్తారు. కోహ్లి, రోహిత్ అత్యుత్తమ ఆటగాళ్లు. వారు అలా ఆడటం తప్పేమీ కాదు. దానిని స్వార్థం అనలేం. ఆస్ట్రేలియాలో గతంలోలాగే పేస్, బౌన్స్ పిచ్‌లు రావాలని కోరుకుంటున్నా.’ -స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ -
అఖరి పోరాటం
భారత్, దక్షిణాఫ్రికాల ఐదో వన్డే నేడు సిరీస్ గెలవాలంటే ఇద్దరికీ విజయం అవసరం మార్పుల్లేకుండానే బరిలోకి భారత్ మ. గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం గాంధీ-మండేలా సిరీస్‌లో వన్డే మ్యాచ్‌లు ఇప్పటి వరకూ అంచనాలకు తగ్గట్లుగానే జరిగాయి. ఇరు జట్లు చెరో రెండు వన్డేలు గెలిచి సిరీస్ ఫలితం విషయంలో ఉత్కంఠను పెంచాయి. బలాబలాల పరంగా రెండు జట్లూ సమానంగా ఉండటం... ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో మరోసారి ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు జరిగే చివరి పోరాటంలో గెలిచిన జట్టు సిరీస్‌ను ఎగరేసుకుపోతుంది. ముంబై: మూడు రోజుల క్రితం నాలుగో వన్డేకు ముందు భారత జట్టు పరిస్థితి అయోమయంగా ఉంది. ఏ బ్యాట్స్‌మన్ ఎక్కడ ఆడతాడో తెలియదు... ఎవరు విఫలమవుతారో అర్థం కాదు... బౌలింగ్ విభాగం ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాట్స్‌మెన్ పరిస్థితి అగమ్యగోచరం. అలాంటి సమయంలో చెన్నైలో బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై అందరూ సమష్టిగా రాణించి 299 పరుగులు చేశారు. దీంతో ఒక్కసారిగా జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే జోరును కొనసాగిస్తే ఆఖరి వన్డేలోనూ గెలిచి దక్షిణాఫ్రికాపై సిరీస్‌ను కైవసం చేసుకోవడం కష్టం కాదు. అటు దక్షిణాఫ్రికా జట్టు గాయాల కారణంగా, ఫామ్‌లేమితో బాధపడుతున్న ఆటగాళ్ల కారణంగా కాస్త ఇబ్బందుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే నేడు వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. అదే జోరు కొనసాగాలి నాలుగో వన్డేలో అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిన భార త్... ఐదో వన్డేలో అదే జోరుతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఇన్నాళ్లూ ఆందోళన కలిగించిన రైనా కూడా చెన్నైలో నిలకడగా ఆడటం ధోని సేనకు ఊరట. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లూ నిలకడగా రాణిస్తున్నందున మరోసారి అదే ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది. భువనేశ్వర్ కూడా తుది జట్టులో ఉంటాడు. వాంఖడే పిచ్ స్వభావం దృష్ట్యా మోహిత్ స్థానంలో శ్రీనాథ్ అరవింద్ జట్టులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిల్లర్, ఆమ్లాలే సమస్య దక్షిణాఫ్రికా జట్టుకు ఈ సిరీస్‌లో బ్యాటింగ్ విభాగంలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. కీలక ఆటగాడు ఆమ్లాతో పాటు డేవిడ్ మిల్లర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఆమ్లా నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 66 పరుగులు మాత్రమే చేశాడు. దీనికి తోడు జేపీ డుమిని గాయం కారణంగా మధ్యలో తప్పుకోవడంతో జట్టులో సమతుల్యం దెబ్బతింది. డుమిని ఉంటే ఏడుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాల్సి వస్తోంది. డికాక్, డు ప్లెసిస్, బెహర్దీన్ ఫర్వాలేదనేలా ఆడారు. ఇక కెప్టెన్ డివిలియర్స్ సిరీస్‌లో రెండు సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మిల్లర్ ఫామ్‌లో లేనందున అతని స్థానంలో ఎల్గర్‌ని ఆడించే ప్రతిపాదన కూడా ఉంది. ఎల్గర్ పార్ట్‌టైమ్ బౌలర్‌గానూ పనికొస్తాడు. అయితే కీలకమైన పేసర్ మోర్నీ మోర్కెల్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో చివరి వన్డేలోనూ అతను ఆడటం సందేహమే. మొత్తం మీద సఫారీలు కూడా సమస్యల్లోనే ఉన్నారు. పిచ్, వాతావరణం వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. వర్ష సూచన లేదు. వేడి ఎక్కువగా ఉండొచ్చు. మంచు ప్రభావం కూడా పెద్దగా ఉండదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఆడటం నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని, బౌలర్లపై ఎదురుదాడి చేయొచ్చు. సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్లకు ప్రత్యర్థుల గురించి పూర్తి అవగాహన వచ్చింది. శిఖర్ ధావన్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. -కోహ్లి డుమిని, మోర్కెల్‌ల గాయాలు మమ్మల్ని ఇబ్బందుల్లో పడేశాయి. మిగిలిన ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది. పరుగులు చేయలేకపోవడం నాకూ అసంతృప్తిగానే ఉంది. ఒక్కసారి కుదురుకుంటే జట్టుకు విజయాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడగలను. - ఆమ్లా 17 ఇప్పటి వరకూ భారత్‌లో దక్షిణాఫ్రికా నాలుగు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడింది. మూడింట్లో భారత్ గెలిస్తే, ఒకటి డ్రాగా ముగిసింది. 3 వాంఖడేలో గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, సురేశ్ రైనా, అక్షర్ పటేల్, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్, మోహిత్ శర్మ/అరవింద్. దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డికాక్, డు ప్లెసిస్, ఎల్గర్ / మిల్లర్, బెహర్దీన్, స్టెయిన్, రబడ, మోరిస్, ఫాంగిసో, తాహిర్. -
ఐదో వన్డేనూ వర్షార్పణం
భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వరుణుడు మరోసారి ప్రతాపం చూపాడు. ఇరు జట్ల మధ్య శనివారమిక్కడ జరగాల్సిన ఐదో వన్డే ఊహించినట్టే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు స్టేడియం చిత్తడిగా మారడంతో మ్యాచ్ జరగడం శుక్రవారం నుంచే సందేహంగా మారింది. మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. నాలుగో వన్డే కూడా వర్షం కారణంగా ఫలితం తేలని సంగతి తెలిసిందే. ఈ ఏడు వన్డేల సిరీస్‌లో కంగారూలు 2-1 ఆధిక్యంలో ఉన్నారు. మరో రెండు వన్డేలు జరగాల్సివుంది. ధోనీసేన సిరీస్ నెగ్గాలంటే మిగిలిన రెండూ గెలవాలి. ఇరు జట్ల మధ్య ఆరో వన్డే ఈ నెల 30న నాగపూర్‌లో జరగనుంది.