
కొలంబో: ఇంగ్లండ్ జట్టు తమ వన్డే చరిత్రలోనే అతి పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. శ్రీలంకతో సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్నా... చివరి వన్డేలో శ్రీలంక 219 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) భారీ తేడాతో నెగ్గింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది.
డిక్‌వెలా (95), చండీమాల్ (80), కుషాల్ మెండిస్ (56), సమరవిక్రమ (54) భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఇంగ్లండ్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 26.1 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో వాన తగ్గకపోవడంతో ఫలితాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment