DLS
-
Asia Cup 2023 IND VS PAK Super 4 Match: పాక్ టార్గెట్ ఎంతంటే..?
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా భారత్-పాక్‌ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. పాక్ ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తూ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ దశలో (సాయంత్రం 4:53 గంటలకు) ప్రారంభమైన వర్షం రాత్రి 7 గంటల సమయంలో కాస్త ఎడతెరిపినిచ్చినప్పటికీ మైదానం మొత్తం చిత్తడిగా ఉండటంతో మరి కాసేపు (రాత్రి 7:30 గంటల వరకు) వెయిట్ చేయాలని ఇరు జట్ల కెప్టెన్లు రిఫరీని కోరారు. 🤞🤞🤞pic.twitter.com/CbVc0lgJu1 — CricTracker (@Cricketracker) September 10, 2023 ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం లేకుండా డక్‌వర్త్ లూయిస్ పద్థతి ప్రకారం పాక్‌కు టార్గెట్ నిర్ధేశించాల్సి వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరగాలంటే కటాఫ్ టైమ్ రాత్రి 10:30 గంటలు. దీని తర్వాత మ్యాచ్ సాధ్యపడే అవకాశం లేదు. మ్యాచ్ రిజర్వ్ డే అయిన రేపు (సెప్టెంబర్ 11) నిర్వహించాల్సి ఉంటుంది. భారత్ తిరిగి బ్యాటింగ్‌కు దిగకుండా 20 ఓవర్ల మ్యాచ్ అయితే (DLS ప్రకారం) పాక్ లక్ష్యం 181 పరుగులుగా ఉంటుంది. 21 ఓవర్లలో పాక్ లక్ష్యం 187 22 ఓవర్లలో 194 23 ఓవర్లలో 200 24 ఓవర్లలో 206 -
కంగ్రాట్స్ ఐర్లాండ్.. ఇంగ్లండ్ అలా అనకుంటే చాలు!
టి20 ప్రపంచకప్‌లో ఈసారి పరుగుల కన్నా వర్షం తన జోరు చూపిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చిన వరుణుడు.. ఈసారి ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బను మిగిల్చాడు. అంతేకాదు అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం ఆటంకం కలిగించే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ గెలిచినట్లు పేర్కొన్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజయాన్ని దక్కించుకున్న ఐర్లాండ్‌కు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ''ఏదైతేనేం.. ఇంగ్లండ్ లాంటి టాప్ జట్టును మట్టికరిపించింది'' అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా స్పందించాడు. ''కంగ్రాట్స్ ఐర్లాండ్.. అయితే డక్‌వర్త్ లూయిస్ అనేది క్రీడాస్పూర్తికి విరుద్దం అని ఇంగ్లండ్ అనదనే నమ్మకంతోనే ఉన్నా'' అంటూ వినూత్నంగా స్పందించాడు. ఇంతకముందు టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మలు మన్కడింగ్ చేయడంపై క్రీడాస్పూర్తికి విరుద్ధమంటూ ఇంగ్లండ్ నానా యాగీ చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే అమిత్ మిశ్రా ఇంగ్లండ్ జట్టుకు కౌంటర్ ఇచ్చాడంటూ కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ పూర్తిగా సాగకుండానే ఫలితం వచ్చింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. మార్క్ వుడ్ (3/34), లివింగ్‌స్టోన్ (3/17), సామ్ కర్రన్ (2/31), స్టోక్స్ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ జోస్ బట్లర్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆతర్వాత వచ్చిన మలాన్ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (1 నాటౌట్) ఇంగ్లండ్‌కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. చదవండి: 'అవసరమా మనకు.. 'స్పైడర్'ను బ్యాన్ చేయండి' Congratulations @cricketireland on a massive victory. Hope England doesn’t say winning through DLS isn’t in the spirit of the game. 😄 #EngvsIRE pic.twitter.com/0S4L5f1ZTi — Amit Mishra (@MishiAmit) October 26, 2022 Group 1's elite toples over to the luck of the three leaf clover! #irevseng #T20worldcup22 — Brad Hogg (@Brad_Hogg) October 26, 2022 IRE Vs ENG: టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’ -
ఇలాంటి మ్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్
నేపియర్: న్యూజిలాండ్‌తో రెండో టి20లో ఛేదనకు బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. కానీ ఎన్ని పరుగులు చేస్తే గెలుస్తామో తెలీదు! దానిపై స్పష్టత లేకుండానే అంపైర్లు ఆట మొదలు పెట్టేశారు. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో మైదానంలోని పెద్ద స్క్రీన్‌పై, కివీస్ అధికారిక ట్విట్టర్లో 16 ఓవర్లలో 148గా చూపించారు. 9 బంతులు పడిన తర్వాత హడావిడిగా మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో కంప్యూటర్‌తో కుస్తీ పట్టి డక్‌వర్త్ లూయిస్ లెక్క ప్రకారం లక్ష్యాన్ని 16 ఓవర్లలో 170గా తేల్చాడు. ఆ వెంటనే కాదు కాదు అంటూ నాలుక్కర్చుకొని చివరకు 171 పరుగులుగా ఖరారు చేశారు! ‘డక్‌వర్త్’ ఎంత గందరగోళమో, చివరకు మ్యాచ్ రిఫరీలకు కూడా అర్థం కానిదని ఈ ఘటన నిరూపించింది. సాధారణ వర్ష సూచన ఉన్నప్పుడు ఓవర్లు, వికెట్ల ప్రకారం చేయాల్సిన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఇన్నింగ్స్ విరామం మధ్యలో ఇరు జట్లకు ఒక షీట్‌ను అందిస్తారు. సరిగ్గా లెక్క చేయలేక వాటిని ఇవ్వకపోవడంతో ఇదంతా జరిగి నిర్వహణా లోపాన్ని చూపించింది. చివరకు జెఫ్ క్రో ఇరు జట్లకు క్షమాపణలు చెప్పుకున్నాడు! ఈ మ్యాచ్‌లో కివీస్ 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గి 2–0తో సిరీస్ దక్కించుకుంది. ముుందుగా కివీస్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. వర్షం రావడంతో ఇన్నింగ్స్‌ను ముగించారు. ఫిలిప్స్ (58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (34 నాటౌట్ ; 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. చదవండి: (క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ...) (ఐపీఎల్ 2021: పంజాబ్ పదునెంత?) -
డక్‌వర్త్ లూయిస్‌ను సిలబస్‌లో పెట్టాలి
మాంచెస్టర్: డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) అంశాన్ని సీబీఎస్ఈ పదవ తరగతి పాఠ్యాంశాల్లో భాగం చేయాలని క్రికెట్ అభిమానులు ఐసీసీని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ తొలి మెగాసమరానికి వరుణ దేవుడు అడ్డు పడిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యచ్‌లో ఒక ఇన్నింగ్సూ పూర్తిగా ముగియకుండానే ఆటకు అంతరాయం కలిగింది. సుదీర్ఘ సమయం పాటు వర్షం కురువడంతో అంపైర్లు ఆటను రిజర్వ్‌డే(బుధవారం)కు వాయిదావేశారు. ఈ నేపథ్యంలో వర్షం అంతరాయంపై తీవ్ర అసహనానికి గురైన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. కివీస్ బ్యాట్స్‌మెన్ మైదానంలో నిలిచిన సమయం కన్నా వర్షమే ఎక్కువ సేపు ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఐసీసీ క్రికెట్ మైదాన నిర్మాణాలను మర్చాలని, ఇండోర్ స్టేడియంలా నిర్మించాలని కామెంట్ చేస్తున్నారు. ఇక వివాదాస్పద డీఎల్ఎస్ పద్దతి ఎవరికీ అర్థం కాదని కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలు పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. పూర్తిగా ఒక జట్టుకు మేలు చేకూర్చే విధంగా ఉండే ఈ పద్దతిని మార్చాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని అభిమానులు ఐసీసీపై సెటైర్లు వేస్తున్నారు. Duckworth–Lewis–Stern method should be included in the CBSE class 10 syllabus #INDvNZ @BCCI — Nikunj Choudhari (@Nikunj_nixu) July 9, 2019 Rain has lasted longer than any New Zealand batsman did at the pitch. #INDvNZ #indiavsNewzealand pic.twitter.com/tMI4qgNWjh — Sharad Kotriwala (@ModijiKaHathHai) July 9, 2019 ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రాస్ టేలర్ (85 బంతుల్లో 67 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (95 బంతుల్లో 67; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఐదుగురు భారత బౌలర్లు తలా ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం టేలర్‌తో పాటు లాథమ్ (3 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. -
ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం
కొలంబో: ఇంగ్లండ్ జట్టు తమ వన్డే చరిత్రలోనే అతి పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. శ్రీలంకతో సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్నా... చివరి వన్డేలో శ్రీలంక 219 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) భారీ తేడాతో నెగ్గింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది. డిక్వెలా (95), చండీమాల్ (80), కుషాల్ మెండిస్ (56), సమరవిక్రమ (54) భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఇంగ్లండ్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 26.1 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో వాన తగ్గకపోవడంతో ఫలితాన్ని ప్రకటించారు. -
క్రికెట్లో కొత్త నియమాలు.!
దుబాయ్: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని సవరించడంతో పాటు కోడ్ ఆఫ్ కండక్ట్, ఐసీసీ ప్లేయింగ్ నిబంధనల్లోని మార్పులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) శనివారం విడుదల చేసింది. వివాదాస్పదంగా మారిన డక్‌వర్త్ లూయిస్(డీఎల్ఎస్) పద్దతి నిబంధనలను సవరించింది. ఇక బాల్ టాంపరింగ్ సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మారిన ఈ నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా జింబాబ్వేతో సౌతాఫ్రికా తలపడే తొలి వన్డే కొత్త నిబంధనలతో ఆడే తొలి మ్యాచ్‌గా నిలువనుంది. ఐసీసీ 2014లో డీఎల్ఎస్ నూతన పద్దతిని ప్రవేశపెట్టింది. ఈ పద్దతి ప్రకారం బంతి, బంతికి వచ్చే పరుగులతో పవర్ ప్లేను పరిగణలోకి తీసుకొని విశ్లేషించి లిమిటెడ్ ఫార్మాట్లో విజేతను ప్రకటించేవారు. అయితే ప్రస్తుతం వన్డే, టీ20ల్లో బ్యాట్స్‌మెన్ చేసే పరుగుల సగటు మారిందని, ఈ నేపథ్యంతో ఈ పద్దతిని కొంత మార్చినట్లు ఐసీసీ పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బంతి ఆకారం మార్చడాన్ని (బాల్ ట్యాంపరింగ్) ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 3 నేరంగా పరిగణిస్తారు. ఏ ఆటగాడైనా బాల్ టాంపరింగ్‌కు పాల్పడితే అతనికి పెనాల్టీ కింద గతంలో 8 సస్పెన్షన్ పాయింట్లు విధించేవారు. దీనిని 12 సస్పెన్షన్ పాయింట్లకు పెంచుతూ ఐసీసీ నిబంధనలు మార్చింది. 12 సస్పెన్షన్ పాయింట్లంటే 6 టెస్టులు లేదా 12 వన్డేల నిషేదంతో సమానం.ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బెన్క్రాఫ్ట్ల బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఐసీసీ ఈ నిబంధనల సవరణకు పూనుకుంది. బాల్ టాంపరింగ్‌ను తీవ్ర నేరంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వ్యక్తిగత దూషణకు దిగితే లెవల్ 1 నేరంగా పరిగణిస్తూ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు. -
ఇంగ్లండ్ విజయం
లీస్టర్ (ఇంగ్లండ్): మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 107 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హీథెర్‌నైట్ (109 బంతుల్లో 106; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), నటాలీ సివెర్ (92 బంతుల్లో 137; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలు చేయడం విశేషం. వీరిద్దరూ మూడో వికెట్‌కు 213 పరుగులు జోడించారు. అనంతరం పాకిస్తాన్ 29.2 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ నిలిచే సమయానికి పాకిస్తాన్ 214 పరుగులు చేయాల్సింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది.