ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా భారత్-పాక్‌ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. పాక్ ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తూ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ దశలో (సాయంత్రం 4:53 గంటలకు) ప్రారంభమైన వర్షం రాత్రి 7 గంటల సమయంలో కాస్త ఎడతెరిపినిచ్చినప్పటికీ మైదానం మొత్తం చిత్తడిగా ఉండటంతో మరి కాసేపు (రాత్రి 7:30 గంటల వరకు) వెయిట్ చేయాలని ఇరు జట్ల కెప్టెన్లు రిఫరీని కోరారు.
— CricTracker (@Cricketracker) September 10, 2023
ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం లేకుండా డక్‌వర్త్ లూయిస్ పద్థతి ప్రకారం పాక్‌కు టార్గెట్ నిర్ధేశించాల్సి వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరగాలంటే కటాఫ్ టైమ్ రాత్రి 10:30 గంటలు. దీని తర్వాత మ్యాచ్ సాధ్యపడే అవకాశం లేదు. మ్యాచ్ రిజర్వ్ డే అయిన రేపు (సెప్టెంబర్ 11) నిర్వహించాల్సి ఉంటుంది.
భారత్ తిరిగి బ్యాటింగ్‌కు దిగకుండా 20 ఓవర్ల మ్యాచ్ అయితే (DLS ప్రకారం) పాక్ లక్ష్యం 181 పరుగులుగా ఉంటుంది.
21 ఓవర్లలో పాక్ లక్ష్యం 187
22 ఓవర్లలో 194
23 ఓవర్లలో 200
24 ఓవర్లలో 206
Comments
Please login to add a commentAdd a comment