స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో భారత జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై టీమిండియా ఘోర అవమానాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచంలోనే స్పిన్‌కు బాగా ఆడుతారని పేరొందిన భారత బ్యాటర్లు.. ఇప్పడు అదే స్పిన్‌ను ఆడేందుకు భయపడుతున్నారు.
ముంబై 147 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని కూడా భారత్ చేధించలేక చతికలపడింది. కివీస్ స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 9 వికెట్లు కివీ స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. అయితే ఇదే అవకాశంగా తీసుకుని భారత జట్టును ఇంగ్లండ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎగతాళి చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, పాక్ దిగ్గజం వసీమ్ అక్రమ్‌లు భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
పాక్ కూడా ఓడిస్తుంది?
మెల్‌బోర్న్ వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో అక్రమ్,మైఖేల్ వాన్‌లు కామేంటర్‌లగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా వాన్ మాట్లాడుతూ.."పాకిస్తాన్-భారత్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలనుకుంటున్నాను' అని అన్నాడు.
అందుకు బదులుగా అక్రమ్ "నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుంది. ఇది రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని పెంచుతుంది" అని సమాధానమిచ్చాడు. ఇక్కడవరకు అంతే బాగానే చివరిలో అక్రమ్, వాన్ తన వక్ర బుద్దిని చూపించుకున్నారు. "ఇప్పుడు స్పిన్‌పిచ్‌లపై టీమిండియాను పాక్ ఓడించగలదు" అని వాన్ వ్యాఖ్యనించాడు. అక్రమ్ కూడా అందుకు అంగీకరించాడు.
"భారత్ స్పిన్‌ను ఆడటంలో ఇబ్బంది పడుతంది. కాబట్టి టర్నింగ్ వికెట్‌లపై టీమిండియాను ఓడించే అవకాశముంది. న్యూజిలాండ్ భారత జట్టును వారి స్వదేశంలోనే 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది" అని అక్రమ్ రిప్లే ఇచ్చాడు. కాగా వీరిద్దరి కామెంట్లపై భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. ముందు మీ జట్టు సంగతి చూసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు..
Comments
Please login to add a commentAdd a comment