నికెర్క్, హర్మన్‌ప్రీత్
సెంచూరియన్ : దక్షిణాఫ్రికా-భారత్ మహిళల మధ్య జరుగుతున్న నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ పచ్చిగా ఉండడం, మరి కొద్ది గంటల్లో పురుషుల మ్యాచ్ ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే భారత మహిళల టీ20 చరిత్రలో రద్దైన తొలి మ్యాచ్‌కావడం విశేషం. దీంతో హర్మన్ ప్రీత్ సేన నిర్ణయాత్మక ఐదో టీ20 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళలు చివరి మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం అవుతోంది. లేకుంటే డ్రాగా ముగుస్తోంది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు మ్యాచ్ నిలిచే సమయానికి 15.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ నికెర్క్(55: 47 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు), లిజెల్లే లీ(59: 39 బంతులు,2ఫోర్లు, 5 సిక్సర్లు, నౌటౌట్)లు రాణించారు. పురుషుల మ్యాచ్ కోసం మైదాన సిబ్బంది కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment