రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీ కార్యకర్తల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీ కార్యకర్తల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెను విరమించారు. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరవధిక సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలన్నీ బోసిపోయాయి. ఐసీడీఎస్ చరిత్రలోనే తొలిసారిగా అంగన్‌వాడీలు మహా ఉద్యమాన్ని చేపట్టడంతో హక్కుదారులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం దూరమైంది. ప్రభుత్వంతో చర్చలు సఫలంకావడంతో ఎట్టకేలకు సమ్మెను విరమించారు.