న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ నెల 16 నుంచి కొనుగోలు, అమ్మకాలను నిరవధికంగా బంద్ చేస్తామన్న నిర్ణయంపై పెట్రోల్ బంకుల యజమానులు వెనక్కి తగ్గారు. పెట్రోల్ పంప్ డీలర్లు దేశవ్యాప్తంగా జూన్ 16న చేపట్టనున్న సమ్మెను ఉపసంహరించుకున్నారు. నో పర్చేజ్, నో సేల్ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(ఇండిపెండెంట్ చార్జ్ ) ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్తో చర్చల అనంతరం ఆయన మీడియాకు వివరించారు. రోజువారీ ధరల విధానానికి సంబంధించి డీలర్ల సంఘాల ఆందోళనవ్యక‍్తం చేసినట్టు చెప్పారు.
ఆటోమేటెడ్ అవుట్లెట్లను పెంచడం, ఇంధన ధరలను అమలు చేయడం లాంటి చర్యలకు మద్దతు ఇవ్వడం కోసం తాము కృషి చేస్తున్నామని అఖిల భారత పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
కాగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల తీసుకున్న రోజువారి ధరల విధానం వల్ల పెట్రోల్ బంకుల యజమానులపై తీవ్ర ప్రభావం పడుతుందని డీలర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రోజువారీ ధరల హెచ్చుతగ్గులతో బాగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. 75 శాతం పంపుల్లో ఆటోమిషిన్ సౌకర్యం లేదని, అందువల్ల రోజువారీ ధరల హెచ్చుతగ్గుల విధానాన్ని అమలు పర్చలేమని స్పష్టం చేశారు. ఆలిండియా పెట్రోలియం అసోసియేషన్ ప్రతి నిధులు మంగళ, బుధవారాల్లో పెట్రోలియం మంత్రిత్వ శాఖ, చమురు కంపెనీలతో చర్చలు జరపనున్నారని, ఒక వేళ చర్చలు సఫలం కాకుంటే పెట్రోల్, డీజిల్ కొనుగోల్లు, అమ్మకాలను నిలిపేస్తామని స్పష్టం చేస్తూ 16న సమ్మె చేపట్టనున్నట్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
వెనక్కి తగ్గిన పెట్రోల్ పంప్ డీలర్లు
Published Wed, Jun 14 2017 8:16 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
Advertisement