జకీర్ ఝలక్.. ప్రెస్ మీట్ ఉత్తిదే! | Islamic preacher Zakir Naik's press conference via Skype cancelled | Sakshi
Sakshi News home page

జకీర్ ఝలక్.. ప్రెస్ మీట్ ఉత్తిదే!

Published Thu, Jul 14 2016 9:10 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

జకీర్ ఝలక్.. ప్రెస్ మీట్ ఉత్తిదే!

జకీర్ ఝలక్.. ప్రెస్ మీట్ ఉత్తిదే!

ముంబయి: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ మరోసారి ఝలక్ ఇచ్చాడు. అతడు ముందు ప్రకటించినట్లు ముంబయి మీడియా ముందుకు స్కైప్ ద్వారా రావడం లేదు. ఆయన స్కైప్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దయింది. గురువారం తాను స్కైప్ ద్వారా మీడియా ముందుకు వస్తానని జకీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న జకీర్ నాయక్ భారత దేశంలో జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యంతరకర ప్రసంగం చేశాడు.

ఢాకా పేలుళ్ల నేపథ్యంలో భారత ముస్లిం యువకులను రెచ్చగొట్టే చర్యలకు దిగాడు. దీంతో ఆయనను విచారించాలని ఒక పక్క పోలీసులు భావిస్తుండగా అతడు మాత్రం దేశంలోకి అడుగుపెట్టకుండా ఆఫ్రికా టూర్ అంటూ చెబుతున్నాడు. అదే సమయంలో తానేం పారిపోవడం లేదని అన్ని విషయాలు స్కైప్ ద్వారా అగ్రిపదలోని మెఫిల్ హాల్ లో ముంబయి మీడియా వద్దకు వస్తానని చెప్పాడు. అయితే, ప్రస్తుతం అతడి ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దయినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement