Islamic preacher Zakir Naik
-
Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్‌ను అప్పగిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్‌కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. -
రూ.16 కోట్ల జకీర్ ఆస్తుల అటాచ్మెంట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు సంబంధించిన రూ. 16.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఆస్తులను జప్తు చేసినట్లు శనివారం వెల్లడించింది. జకీర్ కుటుంబసభ్యుల పేరిట ముంబై, పుణేలో ఉన్న ఈ స్థిరాస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద జప్తు చేసినట్లు పేర్కొంది. జకీర్ బ్యాంక్ ఖాతాకు వచ్చిన విరాళాలను తన భార్య, కొడుకు, మేనకోడలు అకౌంట్లకు పంపినట్లు ఆధారాలు సేకరించిన ఈడీ ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో ముంబైలోని ఫాతిమా హైట్స్, ఆఫియా హైట్స్ భవంతులతో పాటు బాందప్ ప్రాంతంలోని ఆస్తులు, పుణేలోని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. -
జకీర్ ఝలక్.. ప్రెస్ మీట్ ఉత్తిదే!
ముంబయి: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ మరోసారి ఝలక్ ఇచ్చాడు. అతడు ముందు ప్రకటించినట్లు ముంబయి మీడియా ముందుకు స్కైప్ ద్వారా రావడం లేదు. ఆయన స్కైప్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దయింది. గురువారం తాను స్కైప్ ద్వారా మీడియా ముందుకు వస్తానని జకీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న జకీర్ నాయక్ భారత దేశంలో జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యంతరకర ప్రసంగం చేశాడు. ఢాకా పేలుళ్ల నేపథ్యంలో భారత ముస్లిం యువకులను రెచ్చగొట్టే చర్యలకు దిగాడు. దీంతో ఆయనను విచారించాలని ఒక పక్క పోలీసులు భావిస్తుండగా అతడు మాత్రం దేశంలోకి అడుగుపెట్టకుండా ఆఫ్రికా టూర్ అంటూ చెబుతున్నాడు. అదే సమయంలో తానేం పారిపోవడం లేదని అన్ని విషయాలు స్కైప్ ద్వారా అగ్రిపదలోని మెఫిల్ హాల్ లో ముంబయి మీడియా వద్దకు వస్తానని చెప్పాడు. అయితే, ప్రస్తుతం అతడి ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దయినట్లు తెలుస్తోంది.