బెల్‌ఫాస్ట్: వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే క్రమంలో విజయవంతంగా తొలి అడుగు వేయా లని భావించిన వెస్టిండీస్‌కు వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఐర్లాండ్‌తో బుధవారం జరగాల్సిన ఏకైక వన్డే భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. గేల్ తదితరుల పునరాగమనంతో ఈ మ్యాచ్‌లో విజయంపై విండీస్ ఆశలు పెంచుకుంది.
ఈ మ్యాచ్ గెలిచి ఉంటే తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో విండీస్ 4–1తో గెలిస్తే సరిపోయేది. అయితే తాజా సమీకరణం ప్రకారం ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకూడదు. అంటే 5–0 లేదా 4–0తో విండీస్ ఆ సిరీస్‌ను గెలుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే శ్రీలంక నేరుగా ప్రపంచ కప్‌కు క్వాలిఫై అవుతుంది. వచ్చే ఏడాది జింబాబ్వేలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో విండీస్ ఆడాల్సి ఉంటుంది.
విండీస్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
Published Thu, Sep 14 2017 12:42 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM