15 పాయింట్లతో మూడో స్థానానికి హైదరాబాద్
గుజరాత్‌తో మ్యాచ్ రద్దు
భారీ వర్షంతో సాధ్యం కాని ఆట
ఆదివారం పంజాబ్‌తో ఆఖరి పోరు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన దెబ్బ ఐపీఎల్ మ్యాచ్‌పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్‌గాంధీ స్టేడియంలో కూడా అవుట్‌ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పేశారు.
అయితే ఏ దశలోనూ వాన పూర్తిగా ఆగలేదు. టాస్ కాస్త ఆలస్యం కాగా... నిర్ణీత రాత్రి 7:30 గంటల సమయంలో కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ వెంటనే చిరు చినుకులతో మొదలై మళ్లీ విరామం లేకుండా కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా రాత్రి 10:15 గంటలకు పూర్తిగా వాన ఆగాలి. కానీ అలా జరగలేదు. దాంతో అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్‌రైజర్స్ 13 మ్యాచ్‌ల తర్వాత 15 పాయింట్ల వద్ద మూడో స్థానంలో నిలిచింది. దాంతో టీమ్‌కు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్‌రైజర్స్ సొంతగడ్డపైనే పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచి... అదే రోజు రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ చివరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓడితే సన్‌రైజర్స్‌కు రెండో స్థానం ఖాయమవుతుంది. 2020లో చివరిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2021, 2022, 2023 సీజన్లలో వరుసగా 8వ, 8వ, 10వ స్థానాల్లో నిలిచింది.
ఐపీఎల్‌లో నేడు
ముంబై X లక్నో
వేదిక: ముంబై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment