![Umpires for India vs Pakistan match at ICC Champions Trophy revealed](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/ind%20vs%20pak.jpg.webp?itok=1qqTJ2Sp)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.
కాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంపైర్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌కు సంబంధించిన అంపైర్ల వివరాలను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా వ్యవహరించన్నాడు.
టీవీ అంపైర్‌గా జోయెల్ విల్సన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక ఫిబ్రవరి 23న జరగనున్న భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు పాల్ రీఫిల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా ఎంపికయ్యారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ వ్యవహరించనున్నారు.
ఐరెన్ లెగ్ అంపైర్ లేడు..
అయితే భారత్ ఆడే గ్రూపు స్టేజి మ్యాచ్‌ల అంపైర్ జాబితాలో ఐరెన్ లెగ్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అతడు అంపైర్‌గా టీమిండియా అభిమానులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో చాలా సార్లు అది రుజువైంది. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు.
అంపైర్‌ల పూర్తి జాబితా
పాకిస్థాన్ vsన్యూజిలాండ్, ఫిబ్రవరి 19 - కరాచీ
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్
టీవీ అంపైర్: జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్: అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్
బంగ్లాదేశ్ vs భారత్, ఫిబ్రవరి 20 - దుబాయ్
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, పాల్ రీఫిల్
టీవీ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఫోర్త్ అంపైర్: మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్
ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 21 - కరాచీ
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, రోడ్నీ టక్కర్
టీవీ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లె
ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 22 - లాహోర్
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: జోయెల్ విల్సన్, క్రిస్ గఫానీ
టీవీ అంపైర్: కుమార్ ధర్మసేన, ఫోర్త్ అంపైర్: అహ్సన్ రజా, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్
పాకిస్థాన్ v భారత్, ఫిబ్రవరి 23 - దుబాయ్
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: పాల్ రీఫిల్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్
టీవీ అంపైర్: మైఖేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్
బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, ఫిబ్రవరి 24 - రావల్పిండి
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అహ్సన్ రజా, కుమార్ ధర్మసేన
టీవీ అంపైర్: రోడ్నీ టక్కర్, ఫోర్త్ అంపైర్: జోయెల్ విల్సన్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లె
ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 25 – రావల్పిండి
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీ
టీవీ అంపైర్: అలెక్స్ వార్ఫ్, ఫోర్త్ అంపైర్: కుమార్ ధర్మసేన, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్
ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 26 - లాహోర్
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, జోయెల్ విల్సన్
టీవీ అంపైర్: అహ్సన్ రజా, ఫోర్త్ అంపైర్: రోడ్నీ టక్కర్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లె
పాకిస్థాన్ vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 27 - రావల్పిండి
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్
టీవీ అంపైర్: పాల్ రీఫిల్, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిఫరీ: డేవిడ్ బూన్
ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 28 - లాహోర్
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, కుమార్ ధర్మసేన
టీవీ అంపైర్: క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్
Comments
Please login to add a commentAdd a comment