టీ20 వరల్డ్‌కప్-2024కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1న అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో జూన్5న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.
అనంతరం టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 9న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ క్రమంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అంపైర్‌ల జాబితాను ఐసీసీ బుధవారం ప్రకటించింది.
ఈ దాయాదుల పోరులో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రోడ్నీ టక్కర్ ఫీల్డ్ అన్ ఫీల్డ్ అంపైర్‌లుగా వ్యవహరించనున్నారు. అదే విధంగా టీవీ అంపైర్‌గా క్రిస్ గఫానీ బాధ్యతలు నిర్విర్తించనున్నారు.
వీరితో పాటు డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. కాగా ఈ మెగా టోర్నీ కోసం భారత్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా తమ జట్టను ఎంపిక చేయలేదు.
టీ20 వరల్డ్‌కప్-2024కు అంపైర్లు వీరే: క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్‌టన్ రీఫెల్ రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్
Comments
Please login to add a commentAdd a comment