
ఢాకా ప్రీమియర్ లీగ్‌లో షకీబ్ అల్ హసన్ వ్యవహార శైలి విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. వికెట్లు తన్ని, పీకిపాడేసిన ఘటనలపై షకీబ్ క్షమాపణలు కూడా చెప్పాడు. ఇది జరిగి కొద్ది గంటలు కూడా గడవకముందే షకీబ్ భార్య ఉమ్మె అల్ హసన్ మరోలా స్పందించింది.
ఈ వ్యవహారంలో నా భర్తను విలన్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. మీడియాతో పాటే నేనూ ఆ కథనాల్ని ఎంజాయ్ చేశా. కేవలం ఆయన కోపాన్నే చూపించారే తప్ప.. అసలు విషయాన్ని మీడియా కప్పిపెట్టే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో అంపైర్లు అలా ఎలా నిర్ణయం ప్రకటిస్తారు? ఈ వ్యవహారంలో అంపైర్ల తీరుపైనా నాకు అనుమానాలున్నాయి. అయితే ఇంత వ్యతిరేకత ప్రచారంలోనూ నా భర్తకు సపోర్ట్ ఇచ్చిన వాళ్లకు థ్యాంక్స్ అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్చేసిందామె.
కాగా, డీపీఎల్ టోర్నీలో భాగంగా మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్, అబహాని లిమిటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముష్పికర్ రహీం ప్యాడ్‌కు బంతి తగిలాక అవుట్ అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ స్పందించకపోవడంతో వికెట్లను కాలితో తన్నేశాడు. ఆ తర్వాత ఏకంగా వికెట్లనే పెకిలించాడు. అయితే వివాదాలు 34 ఏళ్ల షకీబ్‌కు కొత్తేం కాదు. ఇదే డీపీఎల్ టోర్నీ టైంలో బయో బబుల్ ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసి విమర్శల పాలయ్యాడు. చదవండి: అవసరమా ఇలాంటి ప్లేయర్స్