బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ అన్న తేడా లేకుండా తరుచూ గొడవలకు దిగే షకీబ్.. తాజాగా ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. ఇటీవలే రాజకీయాల్లోకి దిగి అవామీ లీగ్ అనే పార్టీ తరఫున మగుర 1 నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన షకీబ్.. పోలింగ్ రోజున సొంత అభిమానిపై చేయి చేసుకున్నాడు.
Shakib Al Hasan slapped a fan..!pic.twitter.com/KaUbabgkCX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024
ఓ పోలింగ్ స్టేషన్ సందర్శనకు వెళ్లిన షకీబ్‌ను సదరు అభిమాని వెనక నుంచి నెట్టడంతో సహనం కోల్పోయి కొట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ ఎంపీగా గెలిచాడు. షకీబ్ తన సమీప ప్రత్యర్ధి ఖాజీ రేజౌల్ హొస్సేన్‌పై 1,50,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఎన్నికల్లో షకీబ్ పార్టీ అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ మీడియా అంటుంది.
అవామీ లీగ్ 300 సీట్లలో 200 పై చిలుకు సీట్లు గెలిచినట్లు అక్కడి మీడియా చెబుతుంది. పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది. అవామీ లీగ్ అనే పార్టీ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ. అవామీ లీగ్ మరో సారి పూర్తి మెజార్టీ సాధించడంతో షేక్ హసీనానే మళ్లీ ప్రధాన పదవి చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, షకీబ్ ఎన్నికల కోసం క్రికెట్ నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment