ఇది నా రాజ్యం | Cricket matches of animals, birds, disruption | Sakshi
Sakshi News home page

ఇది నా రాజ్యం

Published Fri, Nov 18 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

ఇది నా రాజ్యం

ఇది నా రాజ్యం

క్రికెట్ మ్యాచ్‌లకు జంతువులు, పక్షులు అంతరాయం కలిగించడం కొత్తేం కాదు. గతంలో అనేకసార్లు మైదానంలోకి కుక్కలు వచ్చి మ్యాచ్‌కు ఆటంకం కలిగించాయి. తొలి రోజు వైజాగ్‌లో కూడా ఓ కుక్క సందడి చేసింది. టీ విరామానికి ముందు బ్రాడ్ ఓవర్లో రెండు బంతులు వేశాక కుక్క మైదానంలోకి వచ్చింది. మైదానం సిబ్బంది వచ్చి దానిని బయటకు పంపారు. కానీ ఒక్క నిమిషంలోపే మళ్లీ అది తిరిగి మైదానంలోకి వచ్చింది.

ఇది నా రాజ్యం... మీరెవరూ అనే తరహాలో అక్కడే కాలకృత్యాలు తీర్చుకునే ప్రయత్నం చేసింది. దీంతో దానిని తరుముతున్న సిబ్బందిలో ఒకరు షూ తీసి విసిరేసి దాని వెంటపడ్డాడు. మైదానం అంతా పరుగులు పెట్టించిన తర్వాత గానీ అది బయటకు వెళ్లలేదు. ఈ  ఆలస్యంతో అంపైర్లు కాస్త ముందుగానే టీ విరామం ప్రకటించాల్సి వచ్చింది. బహుశా ఇలా మాత్రం గతంలో ఎప్పుడూ జరిగినట్లు లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement