మాజీ క్రికెటర్‌లు, అంపైర్‌లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ అందించింది. మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 900 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరునుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. మాజీ క్రికెటర్లు (పురుషులు అండ్ మహిళలు) అంపైర్‌ల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను.
దాదాపు 900 మంది సిబ్బంది ఈ ప్రయోజనాన్ని పొందుతారు ఇందులో 75శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు 100% పెన్షన్ పెంపు అందుకోనున్నారు అని జై షా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక రూ. 15,000 చెల్లించే ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లకు ఇప్పుడు రూ. 30,000 అందజేయగా, రూ.22,500 పెన్షన్ అందుకునేవారికి రూ.45,000, రూ.30వేల పెన్షన్ అందుకునేవారికి రూ.52,500 లభించనుంది.
చదవండి: India Vs South Africa: ఇక గెలవాల్సిందే!
NEWS 🚨- BCCI announces increase in monthly pensions of former cricketers, umpires.
— BCCI (@BCCI) June 13, 2022
READ -https://t.co/wmjylA1sb4
Comments
Please login to add a commentAdd a comment