యువరాజ్ సింగ్(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు ఆడి వీడ్కోలు చెప్పే క్రమంలో బీసీసీఐ వ్యహరించే తీరు సరిగా ఉండటం లేదని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మండిపడ్డాడు. ఆట నుంచి రిటైర్మెంట ప్రకటించిన క్రికెటర్లను గౌరవించడంపై బీసీసీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. గతేదాడి జూన్ 10వ తేదీన యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన రిటైర్మెంట్ సమయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు అసంతృప్తి కలిగించిందని అన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ తన రిటైర్మెంట్‌కు సంబంధించి పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. (క్రికెట్ మ్యాచ్‌కు ప్రేక్షకులు షురూ)
తానేమీ లెజెండ్‌ను కాదని, అయితే భారత్‌కు ఆడినప్పుడు ప్రాణం పెట్టి ఆడేవాడినని యువీ చెప్పాడు. తాను టెస్టు క్రికెట్ చాలా తక్కువగా ఆడానని, టెస్టుల్లో అమోఘమైన రికార్డులున్న కొంతమందికి ఫేర్‌వెల్ నిర్వహించిన విషయాన్ని యువీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘ఎవరైనా ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతడికి గౌరవంగా వీడ్కోలు పలకడమనేది బీసీసీఐ చేతిలో ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. నా రిటైర్మెంట్ సమయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు మాత్రం సరిగా లేదు. నా విషయంలోనే కాదు.. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి అనేకమంది ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు దారుణం. కానీ ఇది భారత క్రికెట్‌లో ఎప్పటినుంచో ఉంది. అందుకే నేనేమీ ఆశ్చర్యపోను. దాని గురించి అంతగా పట్టించుకోను’ అని యువీ తెలిపాడు. కనీసం భవిష్యత్తులోనైనా గొప్ప ఆటగాళ్లను బీసీసీఐ గౌరవించాలని ఆశిస్తున్నట్లు యువీ పేర్కొన్నాడు. భారత్ గెలిచిన టీ20 వరల్డ్‌కప్(2007), వన్డే వరల్డ్‌కప్(2011)రెండు వరల్డ్‌కప్‌ల్లో యువీ కీలక పాత్ర పోషించాడు.(‘ఆ తరహా క్రికెటర్ భారత్‌లో లేడు’)
Comments
Please login to add a commentAdd a comment