యువరాజ్ సింగ్‌కి కోహ్లి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌.. | Virat Kohli shares heartwarming video for Yuvrajs birthday | Sakshi
Sakshi News home page

Happy Birthday Yuvraj Singh: యువరాజ్ సింగ్‌కి కోహ్లి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌..

Published Sun, Dec 12 2021 4:21 PM | Last Updated on Sun, Dec 12 2021 9:20 PM

Virat Kohli shares heartwarming video for Yuvrajs birthday - Sakshi

భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆదివారం(డిసెంబర్‌12) 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న యువరాజ్‌కి అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెప్తూ.. పాత ఫొటోలు, వీడియోల్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో సందేశం ద్వారా విషెస్‌ చెప్పాడు. 

"నేను అండర్‌-19 ప్రపంచకప్‌  తర్వాత భారత్‌ జట్టులోకి వచ్చాను. నాకు యువీ  ఘనంగా స్వాగతం పలికాడు.  నాతో సరదాగా మాట్లాడటం, ఉండడం చేసేవాడు. మేము ఒకే రకమైన ఫుడ్‌ను ఇష్టపడతాము, అదే విధంగా మా ఇద్దరికీ పంజాబీ సంగీతం అంటే ఇష్టం" అని కోహ్లి పేర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు.

ఇక యువరాజ్‌ తన 19 ఏ‍ళ్ల కెరీర్‌లో టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇ‍క  2007, 2011 వన్డే ప్రపంచకప్‌లు భారత్‌ గెలవడంలో యువరాజ్‌ కీలకపాత్ర పోషించాడు. 

చదవండి: Happy Birthday Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ గురించి మనకు తెలియని విశేషాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement