హైదరాబాద్: ఆల్‌రౌండర్‌గా, వ్యాఖ్యాతగా, టీమ్ డైరెక్టర్‌గా, ప్రధాన కోచ్‌గా తన కంటూ ప్రత్యేక స్థానాన్ని భారత క్రికెట్ చరిత్రలో లిఖించుకున్నాడు రవిశాస్త్రి. అతడు నిర్వర్తించే బాధ్యత ఏదైనా నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవిశాస్త్రి బర్త్‌డే ఈ రోజు. 58వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా రవిశాస్త్రికి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
‘చాలా మంది ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కానీ కొంతమంది మాత్రమే ధైర్యంగా ఉంటారు. హ్యాపీ బర్త్‌డే రవి భాయ్’ అంటూ రవిశాస్త్రిపై తనకున్న గురుభక్తిని చూపుతూ అదేవిధంగా బర్త్‌డే విషెస్ తెలుపుతూ కోహ్లి ట్వీట్ చేశాడు. ఇక బీసీసీఐ కూడా ప్రధాన కోచ్‌కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. వీరితో పాటు ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కోచ్ బాధ్యతల నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న తర్వాత రవిశాస్త్రి తిరిగి కోచ్‌గా ఎంపిక కావడంలో కోహ్లి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.}
Many seem confident but only few are brave. Happy birthday Ravi bhai. God bless 👍👏😊 . #throwback pic.twitter.com/fId9yMB3IH
— Virat Kohli (@imVkohli) May 27, 2020
చదవండి:
ప్చ్.. ధోని అలా బ్యాటింగ్ చేసాడేంటి?
టీ20 ప్రపంచకప్ వాయిదా? రేపు క్లారిటీ!
Comments
Please login to add a commentAdd a comment