'యువరాజ్ నాకు అన్నలాంటివాడు..'
కాన్ బెర్రా: వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో 7 వేల పరుగుల మైలురాయితో పాటు 24 సెంచరీలు సాధించి రికార్డు బద్దలుకొట్టిన హీరో విరాట్ కోహ్లీ. అయినప్పటికీ, క్రికెటర్గా తాను ఇంకా నిత్య విద్యార్థినేనని.. మరిన్ని విషయాలు నేర్చుకుంటున్నానని విరాట్ అంటున్నాడు. అభిమానులతో మంగళవారం ఫేస్ బుక్ వీడియో చాటింగ్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఎన్నో విషయాలను వారితో పంచుకున్నాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 7వేల పరుగులు చేస్తారని భావించారా?
కోహ్లీ: నిజం చెప్పాలంటే ఆ విషయాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. రికార్డుల గురించి చూడలేదు.. కానీ, తక్కువ మ్యాచ్లలో టీమిండియాకు సాధ్యమైనన్ని పరుగులు చేయడమే నా టార్గెట్. మైదానంలో ప్రతిరోజూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో చేసిన సెంచరీ నాకెంతో ప్రత్యేకం. నన్ను చూసేందుకు వచ్చిన మా బ్రదర్ గ్యాలరీలో కూర్చుని నా సెంచరీని ఆస్వాదించాడు. నా ఇన్నింగ్స్ పై అతడు చాలా హ్యాపీగా ఉన్నాడు.
యువరాజ్ తో కలిసి టీ20లు ఆడనున్నారు. జట్టులోకి యూవీ తీరిగి రావడంపై మీరేమంటారు?
కోహ్లీ: యువరాజ్ సింగ్తో నేను చాలా సన్నిహితంగా ఉంటాను. యువీ నాకు పెద్దన్న లాంటి వాడు. ఎంతో ఉత్సాహంతో ఆటను కొనసాగిస్తుంటాడు యువీ. అతడు చాలా మంచి ఆటగాడే కాదు మంచి మనిషి అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. నాకు అతడు ఎప్పుడు మార్గనిర్దేశం చేసేవాడు. యువీతో కలిసి మళ్లీ ఆడనుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియా తరఫున ఆడటాన్ని యువరాజ్ ఎప్పడు చాలా గర్వంగా ఫీలయ్యేవాడని, అతడు కష్టపడే తత్వం గల వ్యక్తి.