record century
-
చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..!
Smriti Mandhana Slams Maiden Hundred in Historic Pink Ball Test: ఆసీస్ మహిళల జట్టుతో జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధాన(216 బంతుల్లో 127; 22 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకం సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ శతకంతో స్మృతి మంధాన పలు రికార్డులు నెలకొల్పింది. పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా మహిళల జట్టు తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా, తొలి పింక్ బాల్ టెస్ట్‌లోనే శతక్కొట్టిన బ్యాటర్‌గా, అలాగే ఆసీస్ గడ్డపై సెంచరీ బాదిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. గతంలో పురుషుల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి పింక్ బాల్ టెస్ట్‌లో సెంచరీ కొట్టాడు. 2019లో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ టెస్ట్‌లో కోహ్లి 136 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, స్మృతి మంధాన టెస్ట్ కెరీర్లో తన తొలి శతకం సాధించడంతో టీమిండియా రెండో రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(12), తానియా భాటియా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫి మోలినెక్స్ 2, ఆష్లే గార్డనర్, ఎలైస్ పెర్రీ తలో వికెట్ పడగొట్టగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(30) రనౌటైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36) పర్వాలేదనిపించగా, యస్తికా భాటియా(19) నిరాశపరిచింది. అంతకుముందు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: కోహ్లిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అతనే డేంజర్ మ్యాన్ -
ఉన్ముక్త్ చంద్ పరుగుల సునామీ.. రికార్డు శతకం నమోదు
Unmukt Chand Scores 132 From 69 Balls: అమెరికాలో జరుగుతున్న టోయోటా మైనర్ లీగ్‌లో భాగంగా ఆస్టిన్ అథ్లెటిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్, మాజీ భారత బ్యాటర్ ఉన్ముక్త్ చంద్ బౌండరీలు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 69 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ(132 నాటౌట్) నమోదు చేశాడు. ఉన్ముక్త్ వీర విహారం ధాటికి సిలికాన్ వ్యాలీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టిన్ అథ్లెటిక్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. Unmukt Chand scored unbeaten 132 runs from 69 balls including 15 fours and 7 sixes for Silicon Valley Strikers in Minor League Cricket in USA.pic.twitter.com/8iKuoKmJmx — Johns. (@CricCrazyJohns) September 27, 2021 అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉన్ముక్త్ జట్టు.. 3 బంతులు మిగిలి ఉండగానే, 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉన్ముక్త్ తుఫాను ఇన్నింగ్స్‌తో తన జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఉన్ముక్త్ చేసిన స్కోర్‌లో 102 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయంటే అతను ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడో అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ అమెరికన్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్ ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తంగా 434 బంతులను ఎదుర్కొన్న అతను.. 53.20 సగటు, 122.58 స్ట్రైక్ రేట్‌తో 534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. చదవండి: "ఆ రెండు నిర్ణయాలే" కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణం..! -
సాహా విధ్వంసం.. 20 బంతుల్లో శతకం!
కోల్‌కతా : టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా రెచ్చిపోయాడు. ఐపీఎల్ ఎఫెక్ట్ ఎమో కానీ మైదానంలో చెలరేగాడు. ఏకంగా 14 సిక్సులు, నాలుగు ఫోర్లతో కేవలం 20 బంతుల్లో శతకం బాదాడు. శనివారం కోల్‌కతాలో జరిగిన జేసీ ముఖర్జీ లోకల్ టీ20 టోర్నీలో సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న 20 బంతుల్లో 18 బంతులను బౌండరీ లైన్ దాటించడం విశేషం. వీటితోనే సాహా 100 పరుగులను పూర్తి చేశాడు. మరో రెండు బంతుల్లో రెండు సింగిల్స్ సాధించాడు. ఈ విజృంభణతో సాహా ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ బగాన్ జట్టు బీఎన్ఆర్ రీక్రియేషన్ క్లబ్‌పై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీఎన్ఆర్ 152 లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన మోహన్ బగాన్ సాహా, కెప్టెన్ సుబ్హోమయ్(43 22 బంతుల్లో)లు దాటిగా ఆడటంతో వికెట్ నష్ట పోకుండా కేవలం 7 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం సాహా మాట్లాడుతూ.. ‘ఇది రికార్డో కాదో కూడా నాకు తెలియదు. ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకోని ప్రత్యేకమైన్ షాట్స్ ఆడటానికి ప్రయత్నించా. ప్రతి బంతి నా బ్యాట్ మధ్యలో తగిలిందని భావించి హిట్టింగ్ చేశానని’ తెలిపాడు. ఇక వన్డే, టీ20ల్లో అవకాశంపై స్పందిస్తూ.. అది సెలక్టర్ల నిర్ణయమని, అవకాశం వచ్చేలా ఆడటమే నా బాధ్యత అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సాహా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతానన్నా సాహా సన్‌రైజర్స్‌లో ధావన్, వార్నర్‌లు ఉండటంతో ఏ స్థానంలో ఆడటానికైనా సిద్దమేనన్నాడు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లో శతకం సాధించిన రికార్డు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన గేల్.. పుణె వారియర్స్‌పై 30 బంతుల్లో శతకం సాధించి రికార్డు సృష్టించాడు. -
'యువరాజ్ నాకు అన్నలాంటివాడు..'
కాన్ బెర్రా: వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగుల మైలురాయితో పాటు 24 సెంచరీలు సాధించి రికార్డు బద్దలుకొట్టిన హీరో విరాట్ కోహ్లీ. అయినప్పటికీ, క్రికెటర్‌గా తాను ఇంకా నిత్య విద్యార్థినేనని.. మరిన్ని విషయాలు నేర్చుకుంటున్నానని విరాట్ అంటున్నాడు. అభిమానులతో మంగళవారం ఫేస్ బుక్ వీడియో చాటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఎన్నో విషయాలను వారితో పంచుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 7వేల పరుగులు చేస్తారని భావించారా? కోహ్లీ: నిజం చెప్పాలంటే ఆ విషయాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. రికార్డుల గురించి చూడలేదు.. కానీ, తక్కువ మ్యాచ్‌లలో టీమిండియాకు సాధ్యమైనన్ని పరుగులు చేయడమే నా టార్గెట్. మైదానంలో ప్రతిరోజూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో చేసిన సెంచరీ నాకెంతో ప్రత్యేకం. నన్ను చూసేందుకు వచ్చిన మా బ్రదర్ గ్యాలరీలో కూర్చుని నా సెంచరీని ఆస్వాదించాడు. నా ఇన్నింగ్స్ పై అతడు చాలా హ్యాపీగా ఉన్నాడు. యువరాజ్ తో కలిసి టీ20లు ఆడనున్నారు. జట్టులోకి యూవీ తీరిగి రావడంపై మీరేమంటారు? కోహ్లీ: యువరాజ్ సింగ్‌తో నేను చాలా సన్నిహితంగా ఉంటాను. యువీ నాకు పెద్దన్న లాంటి వాడు. ఎంతో ఉత్సాహంతో ఆటను కొనసాగిస్తుంటాడు యువీ. అతడు చాలా మంచి ఆటగాడే కాదు మంచి మనిషి అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. నాకు అతడు ఎప్పుడు మార్గనిర్దేశం చేసేవాడు. యువీతో కలిసి మళ్లీ ఆడనుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియా తరఫున ఆడటాన్ని యువరాజ్ ఎప్పడు చాలా గర్వంగా ఫీలయ్యేవాడని, అతడు కష్టపడే తత్వం గల వ్యక్తి.