Smriti Mandhana Slams Maiden Hundred in Historic Pink Ball Test: ఆసీస్ మహిళల జట్టుతో జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధాన(216 బంతుల్లో 127; 22 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకం సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ శతకంతో స్మృతి మంధాన పలు రికార్డులు నెలకొల్పింది. పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా మహిళల జట్టు తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా, తొలి పింక్ బాల్ టెస్ట్‌లోనే శతక్కొట్టిన బ్యాటర్‌గా, అలాగే ఆసీస్ గడ్డపై సెంచరీ బాదిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. గతంలో పురుషుల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి పింక్ బాల్ టెస్ట్‌లో సెంచరీ కొట్టాడు. 2019లో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ టెస్ట్‌లో కోహ్లి 136 పరుగులు సాధించాడు.
ఇదిలా ఉంటే, స్మృతి మంధాన టెస్ట్ కెరీర్‌లో తన తొలి శతకం సాధించడంతో టీమిండియా రెండో రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(12), తానియా భాటియా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫి మోలినెక్స్ 2, ఆష్లే గార్డనర్, ఎలైస్ పెర్రీ తలో వికెట్ పడగొట్టగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(30) రనౌటైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36) పర్వాలేదనిపించగా, యస్తికా భాటియా(19) నిరాశపరిచింది. అంతకుముందు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
చదవండి: కోహ్లిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అతనే డేంజర్ మ్యాన్
Comments
Please login to add a commentAdd a comment