టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా-వెస్టిండీస్‌లకు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 2 న చెన్నై వేదికగా అమెరికా-కెనడా మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీకోసం 20 మందితో కూడిన అంపైర్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది.
ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌లో సభ్యత్వం పొందిన అంపైర్‌లు 16 మంది, ఎమర్జింగ్ ప్యానెల్‌లోని నలుగురు అంపైర్‌లు ఉన్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్‌కు చోటు దక్కింది.
కాగా మదనగోపాల్‌కు ఐసీసీ ఈవెంట్‌లో అంపైరింగ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారి. అతడితో పాటు సామ్ నోగాజ్‌స్కీ, అల్లావుడియన్ పాలేకర్, రషీద్ రియాజ్, ఆసిఫ్ యాకూబ్‌లు సైతం తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
అదే విధంగా 2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అంపైర్‌లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు.
మరోవైపు ఈ ప్రధాన టోర్నీ కోసం మ్యాచ్ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్‌లను మ్యాచ్ రిఫరీలగా ఐసీసీ నియమించింది.
వరల్డ్‌కప్‌కు అంపైర్‌లు వీరే..
క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్టన్ రుసెరే, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.
మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్.
The ICC announced the group of officials for the first round of the T20 World Cup 2024 in the USA and West Indies. The squad includes 20 umpires and 6 match referees.#T20WorldCup2024 pic.twitter.com/lvH9P4trg1
— CricTracker (@Cricketracker) May 3, 2024
Comments
Please login to add a commentAdd a comment