
టీ20 వరల్డ్‌కప్-2024లో విజేతగా భారత్ నిలవడంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ది కీలక పాత్ర. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న సూర్యకుమార్.. 13 ఏళ్ల టీమిండియా వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాడు.
సూర్య తన సంచలన క్యాచ్‌తో విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించారు. భారత క్రికెట్ చరిత్రలో సూర్య పట్టిన క్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఫైనల్ మ్యాచ్ ముగిసి దాదాపు 10 రోజులు పైగా అవుతున్నప్పటికి సూర్యపై ఇంకా ప్రశంసల వర్షం కురిస్తోంది.
అయితే సూర్య తన జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన క్యాచ్ ఎప్పుడో అందుకున్నాడంట. తన భార్య దేవిశా శెట్టిని వివాహం చేసుకోవడమే ముఖ్యమైన క్యాచ్ అంటూ సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టిలు ఇటీవల తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. పెద్ద కేక్‌ను తీసుకువచ్చి కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సూర్యకుమార్ ఇనాస్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
"వరల్డ్‌కప్‌లో క్యాచ్ అందుకుని నిన్నటకి 8 రోజులైంది. కానీ నిజానికి నా జీవితంలో అంత్యంత ముఖ్యమైన 8 ఏళ్ల క్రితమే అందుకున్నానంటూ" ఆ ఫోటోకు సూర్య క్యాప్షన్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు మీరిద్దరూ కలకలం ఇలానే సంతోషంగా కలిసి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
ఇక వరల్డ్‌కప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 135.37 స్ట్రైక్‌రేట్‌తో 199 పరుగులు చేశాడు. వరల్డ్‌కప్ విజయనంతరం సూర్య విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి శ్రీలంక పర్యటకు సూర్యకుమార్ అందుబాటులోకి రానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment