Nitin Menon
-
టీ20 వరల్డ్‌కప్‌కు అంపైర్లు వీరే.. భారత్ నుంచి ఇద్దరు
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా-వెస్టిండీస్‌లకు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 2 న చెన్నై వేదికగా అమెరికా-కెనడా మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీకోసం 20 మందితో కూడిన అంపైర్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది.ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్లో సభ్యత్వం పొందిన అంపైర్లు 16 మంది, ఎమర్జింగ్ ప్యానెల్‌లోని నలుగురు అంపైర్లు ఉన్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్‌కు చోటు దక్కింది. కాగా మదనగోపాల్‌కు ఐసీసీ ఈవెంట్లో అంపైరింగ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారి. అతడితో పాటు సామ్ నోగాజ్స్కీ, అల్లావుడియన్ పాలేకర్, రషీద్ రియాజ్, ఆసిఫ్ యాకూబ్‌లు సైతం తొలిసారి ఐసీసీ ఈవెంట్లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదే విధంగా 2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరోవైపు ఈ ప్రధాన టోర్నీ కోసం మ్యాచ్ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్‌లను మ్యాచ్ రిఫరీలగా ఐసీసీ నియమించింది. వరల్డ్‌కప్‌కు అంపైర్లు వీరే..క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్టన్ రుసెరే, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్. The ICC announced the group of officials for the first round of the T20 World Cup 2024 in the USA and West Indies. The squad includes 20 umpires and 6 match referees.#T20WorldCup2024 pic.twitter.com/lvH9P4trg1— CricTracker (@Cricketracker) May 3, 2024 -
నితిన్ మీనన్ కొనసాగింపు
దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ అంపైర్ల ప్యానెల్లో వరుసగా ఐదో ఏడాది తన స్థానం పదిలం చేసుకున్నారు. ఇండోర్‌కు చెందిన నితిన్ తొలిసారి 2020లో ఐసీసీ ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత నాలుగేళ్లుగా ఐసీసీ ఆయన సేవల్ని గుర్తించి ఎలైట్ ప్యానెల్లో కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఏడాది కూడా మరోసారి పొడిగింపు లభించింది. ఓవరాల్‌గా అత్యున్నత అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికైన మూడో భారత అంపైర్ మీనన్. గతంలో ఎస్. రవి, మాజీ స్పిన్నర్ ఎస్. వెంకటరాఘవన్‌లు ఎలైట్ క్లబ్లో ఉండేవారు. రవి 33 టెస్టు మ్యాచ్‌లకు ఫీల్డ్ అంపైర్‌గా సేవలందించగా, వెంకటరాఘవన్ ఏకంగా 73 టెస్టులకు (అన్ని ఫార్మాట్లలో 125 మ్యాచ్‌లు) అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం 12 మంది సభ్యులు గల ఈ ఎలైట్ క్లబ్లో భారత్ నుంచి 40 ఏళ్ల నితిన్ మీనన్ ఒక్కరే ఉన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఆయన 122 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు చెందిన షర్ఫుద్దౌలా షాహిద్‌కు కొత్తగా ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కింది. బంగ్లా తరఫున ఈ అర్హత సాధించిన తొలి అంపైర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల జాబితా నుంచి సీనియర్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ను తొలగించారు. 2003 నుంచి సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన 123 టెస్టులు, 361 వన్డేలు, 135 టి20లు, 15 మహిళల టి20లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. పునరి్నర్మాణ ప్రక్రియలో భాగంగానే ఆయన్ని తప్పించామని, ఇతరత్రా కారణాల్లేవని ఐసీసీ తెలిపింది. -
భారత అంపైర్‌కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్‌కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్‌గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్‌లో ఇతను అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్‌ల వందో టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్‌గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్‌లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్‌లో కూడా అంపైర్‌గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌తో వంద టెస్ట్‌ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
వరల్డ్‌కప్‌కు అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒక్కడే
అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించింది. మెగా టోర్నీ కోసం నలుగురు రిఫరీల లిస్ట్‌ను కూడా ఐసీసీ ఇవాళే రిలీజ్ చేసింది. అంపైర్ల జాబితాలో భారత్ నుంచి నితిన్ మీనన్ ఒక్కడికే ప్రాతినిథ్యం లభించగా.. రిఫరీల్లో సైతం భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ ఒక్కడికే అవకాశం దక్కింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌కు భారత అంపైర్ నితిన్ మీనన్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార ధర్మసేన ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ పేర్కొంది. అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లు, రిఫరీల వివరాలను సైతం ఐసీసీ ఇవాళే వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మరియాస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్‌బోరో థర్డ్ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారు. అంపైర్ల వివరాలు.. క్రిస్ బ్రౌన్ (న్యూజిలాండ్) కుమార ధర్మసేన (శ్రీలంక) మరియాస్ ఎరాస్మస్ (సౌతాఫ్రికా) క్రిస్టోఫర్ గఫ్ఫానీ (న్యూజిలాండ్) మైఖేల్ గాఫ్ (ఇంగ్లండ్) అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (సౌతాఫ్రికా) రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) రిచర్డ్ కెటిల్‌బోరో (ఇంగ్లండ్) నితిన్ మీనన్ (ఇండియా) ఎహసాన్ రజా (పాకిస్తాన్) పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా) షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్ (బంగ్లాదేశ్) రాడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా) అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) జోయెల్ విల్సన్ (వెస్టిండీస్) పాల్ విల్సన్ (ఆస్ట్రేలియా) రిఫరీల జాబితా.. జెఫ్ క్రో (న్యూజిలాండ్) ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) రిచీ రిచర్డ్సన్ (వెస్టిండీస్) జవగల్ శ్రీనాథ్ (ఇండియా) -
ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా ఆటగాళ్లపై ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్న భారత అంపైర్ నితిన్ మీనన్ సంచలన వాఖ్యలు చేశాడు. 50-50 ఉండే ఛాన్సులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత ఆటగాళ్లు అంపైర్లపై ఒత్తడి తీసుకువస్తారని మీనన్ తెలిపాడు. మీనన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్-2023లో ఆఖరి మూడు టెస్టులకు నితిన్ మీనన్ అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు. యాషెస్ సిరీస్‌లో మీనన్ అంపైర్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలి సారి. కాగా గత కొనేళ్లుగా భారత తమ సొంత గడ్డపై ఆడిన చాలా మ్యాచ్‌ల్లో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా తన బాధ్యతలు నిర్విర్తించాడు. ఐపీఎల్లో కూడా మెజారిటీ మ్యాచ్‌ల్లో మీనన్ అంపైర్‌గా కన్పిస్తున్నాడు. ఈ క్రమంలో భారత జట్టుకు వ్యతిరేకంగా అతడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి కూడా. "భారత జట్టు స్వదేశంలో ఆడుతున్నప్పుడు స్టేడియం మొత్తం ఫుల్ అయిపోతుంది. కాబట్టి తమ అభిమానులు ముందు ఎలాగైనా గెలవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో టీమిండియాలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు అంపైర్లపై ప్రెషర్ పెట్టాలని ప్రయత్నిస్తారు. 50-50 ఛాన్స్‌లను తమకు అనుకూలంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అటువంటి ఒత్తడిలను ఎలా ఎదుర్కొవాలో మాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లేం చేసినా యా ఏకాగ్రత ఏ మాత్రం దెబ్బ తీయలేరు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్నవారే భారత ఆటగాళ్లు తెచ్చే ఒత్తడిని తట్టుకోగలరు. భారత్‌లో అంపైర్‌గా వ్యవహరించడం ఏ ఎలైట్ ప్యానెల్ అంపైర్కైనా సవాలుగా ఉంటుంది. నాకు మొదట్లో అంతగా అనుభవం లేదు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లోకి వెళ్లాక చాలా విషయాలు నేర్చుకున్నాను" అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనన్ పేర్కొన్నాడు. కాగా భారత్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్న ఏకైక అంపైర్ నితిన్ మీననే కావడం విశేషం. చదవండి: Ind vs WI 2023: రోహిత్, కోహ్లి ఆడతారు.. అయితే! వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్! -
ఇది విన్నారా.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి!
క్రికెట్లో ఫీల్డ్ అంపైర్ పనేంటని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరు. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లకు సిగ్నల్స్ ఇవ్వడం.. బౌలర్లకు ఆదేశాలు ఇవ్వడం.. రనౌట్లు, నోబ్లు, వైడ్లు, లెగ్‌బైలు ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాచ్‌లో ఆటగాళ్ల కన్నా అంపైర్‌కే ఎక్కువ పని ఉంటుంది. అనుక్షణం ఏకాగ్రతతో ఉంటూ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించడం అతని పాత్ర. ఒకప్పుడు ఫీల్డ్ అంపైర్ ఏది చెబితే అదే శాసనం. ఇప్పుడంటే డీఆర్ఎస్ల రూపంలో అంపైర్ల నిర్ణయాన్ని చాలెంజ్ చేయొచ్చు. కానీ ఒకప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్.. రనౌట్ ఈ రెండు అంశాల్లో తప్ప అంపైర్ ఔట్ ఇచ్చాడంటే బ్యాటర్ మాట మాట్లాడకుండా పెవిలియన్‌కు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు డీఆర్ఎస్లు అంపైర్లను కన్ఫూజన్‌కు గురిచేస్తున్నాయి. బంతి బంతికి డీఆర్ఎస్ కోరే అవకాశం ఉండడంతో వైడ్ బాల్స్‌ను కూడా సందేహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్జున్ వేసిన నాలుగో బంతి త్రిపాఠి పక్క నుంచి లెగ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లింది. అయితే అర్జున్ టెండూల్కర్‌తో పాటు కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్‌ఔట్ అంటూ అప్పీల్ చేశారు. కానీ అంపైర్ వైడ్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అర్జున్, ఇషాన్‌లు సైలెంట్ అయిపోయారు. కానీ ఇక్కడే అసలు కథ ప్రారంభమయింది. ఏమైందో తెలియదు కానీ నితిన్ మీనన్ తొలిసారి అంపైర్ రివ్యూను ఉపయోగించాడు. అసలు అది వైడ్ బాల్ అవునా కాదా అనే డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో అది క్లియర్ వైడ్ అని తెలిసింది. అంపైర్‌గా ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా నితిన్ మీనన్ రివ్యూ వెళ్లడం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆసక్తి కలిగించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంటేనే ఈ రివ్యూను అంపైర్ ఉపయోగిస్తారు. ఐపీఎల్లో ఇంతవరకు ఈ రివ్యూ ఏ అంపైర్ వాడుకోలేదు. ఒక రకంగా ఐపీఎల్ చరిత్రలో ఒక అంపైర్ డీఆర్ఎస్ కోరడం ఇదే తొలిసారి. అయితే ఒక వైడ్ బాల్ విషయంలో అయోమయానికి గురవ్వడం ఏంటో.. దీనికోసం థర్డ్ అంపైర్ వరకు వెళ్లడమేంటో అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే రివ్యూ కోరుకోవాల్సింది ఆటగాళ్లని.. అంపైర్లు కాదని కొందరు విమర్శించారు. What's just Nitin Menon has done by taking caught behind decision upstairs on his own... What we can call this..#IPL2O23 #SRHvsMI @cricbuzz pic.twitter.com/4E8tzVXAzg — Amit K Jha (@Amit_sonu_) April 18, 2023 Why the hell did Nitin Menon take the review? Strange. #MIvsSRH — Mihir Gadwalkar (@mihir_gadwalkar) April 18, 2023 Umpire taking review for caught behind🤔 Whats happening??#MIvsSRH — Manish Nonha (@ManishNonha) April 18, 2023 చదవండి: పిచ్చి ప్రవర్తన.. హీరో కాస్త విలన్ అయిపోతున్నాడు! 'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు' -
T20 World Cup 2022: అంపైర్ల జాబితా ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16 నుంచి ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 16న నమీబియాతో శ్రీలంక తలపడనుంది. ఇక ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సూపర్-12 మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం మ్యాచ్ రిఫెరీలు, అంపైర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ జాబితాలో నలుగురు మ్యాచ్ రిఫరీలు, 16 మంది అంపైర్లు ఉన్నారు. కాగా భారత్ నుంచి ఐసీసీ ఎలైట్ అంపైర్ నితిన్ మీనన్‌కు స్థానం దక్కింది. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాధ్యత వహించిన అదే 16 మంది అంపైర్లను ఐసీసీ ఎంపిక చేసింది. వారిలో నితిన్ మీనన్, రిచర్డ్ కెటిల్‌బరో, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, అలీం దార్ వంటి సీనియర్ అంపైర్లు ఉన్నారు. ఇక మ్యాచ్ రిఫరీలగా ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె ఎంపికయ్యారు. టీ20 ప్రపంచకప్-2022కు అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అలీమ్ దార్, అహ్సన్ రజా, క్రిస్టోఫర్ బ్రౌన్, క్రిస్టోఫర్ గఫానీ, జోయెల్ విల్సన్, కుమార ధర్మసేన, లాంగ్టన్ రుసెరే, మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, నితిన్ మీనన్, పాల్ రీఫిల్, పాల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరోక్, రిచర్డ్ కెటిల్‌బరోక్ మ్యాచ్ రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె చదవండి: Jasprit Bumrah: 'నేను ధైర్యంగానే ఉన్నా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన -
అంపైర్లకు ప్రమోషన్.. బీసీసీఐతో అట్లుంటది మరి
క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) అంపైర్ల విషయంలో కొత్త పంథాను అనుసరించింది. ఇన్నాళ్లు ఆటగాళ్లకు మాత్రమే ఉన్న ఏ-ప్లస్ గ్రేడ్‌ను అంపైర్లకు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మెంబర్ అయిన నితిన్ మీనన్ సహా మరో నలుగురు అంతర్జాతీయ అంపైర్లకు ఏ ప్లస్ కేటగిరిలో చోటు కల్పించింది. అనిల్ చౌదరీ, మదన్‌గోపాల్ జయరామన్, వీరేంద్ర కుమార్ శర్మ, కెఎన్ అనంతపద్మనాభన్ ఈ జాబితాలో ఉన్నారు. గురువారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ అంతర్జాతీయ అంపైర్లు కె. హరిహరన్, సుదీర్ అనానీ, అమీష్ సాహెబా, బీసీసీఐ అంపైర్స్ సబ్ కమిటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఇచ్చిన రిపోర్టు మేరకు బీసీసీఐ ఏ-ప్లస్ కేటగిరిని కొత్తగా సృష్టించింది. ఇంతవరకు అంపైర్ల గ్రేడ్ కాంట్రాక్ట్ విషయంలో ఏ, బి, సి, డి కేటగిరీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా చేర్చిన ఏ-ప్లస్, ఏ కేటగిరిలో ఉన్న అంపైర్లకు ఒక్కో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌కు రూ.40 వేలు.. బి, సి కేటగిరిల్లో ఉన్న అంపైర్లకు రూ.30వేలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఏ-ప్లస్‌లో ఐదుగురు ఉండగా.. ఏ-కేటగిరిలో 20 మంది అంపైర్లు, బి-కేటగిరిలో 60 మంది అంపైర్లు, సి-కేటగిరిలో 46 మంది అంపైర్లు ఉన్నారు.కమిటీ బీసీసీఐకి ఇచ్చిన నివేదికలో ఏ ప్లస్ కేటగిరీ ప్రతిపాదనను ‘గ్రేడేషన్ ఆఫ్ అంపైర్లు’గా పేర్కొంది. అయితే బోర్డు స్వయంగా ఆ కేటగిరీని సృష్టించిందని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇవి ఏ-ప్లస్ కొత్త కేటగిరీతో కూడిన సమూహాలు. ఏ-ప్లస్‌తో పాటు ఏ- గ్రేడ్ భారతీయ అంపైర్ల క్రీమ్‌ను కలిగి ఉంటాయి. ఇక అంపైర్లకు విధులనేవి కేటగిరీ వారిగా నిర్ణయిస్తారని.. రంజీ ట్రోఫీ సహా మిగిలిన దేశవాలీ క్రికెట్ టోర్నీలకు ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. చదవండి: BCCI Case: గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్ క్యూరీగా మణిందర్ సింగ్ ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి -
ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఒకే ఒక్క భారతీయుడు
ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో భారత అంపైర్ నితిన్ మీనన్ మరోసారి స్థానం దక్కించుకున్నాడు. మీనన్ సేవలను మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఐసీసీ గురువారం ప్రకటించింది. ఈ నెలాఖరులో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా మీనన్ న్యూట్రల్ అంపైర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. ఐసీసీ ప్రకటించిన 11 మంది సభ్యుల ఎలైట్ ప్యానెల్లో ఇండోర్‌కు చెందిన 38 ఏళ్ల నితిన్ మీనన్ ఏకైక భారత అంపైర్ కావడం విశేషం. 2020లో కోవిడ్ సమయంలో మీనన్ తొలిసారి ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నాడు. ఎస్. వెంకటరాఘవన్, ఎస్. రవి తర్వాత ఎలైట్ క్లబ్లో చేరిన మూడో భారతీయుడిగా నితిన్ మీనన్ రికార్డుల్లో నిలిచాడు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా మీనన్ కేవలం భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే అంపైర్‌గా వ్యవహరించాడు. తాజాగా విదేశాల్లో ప్రయాణ అంక్షలు ఎత్తివేయడంతో మీనన్ తొలిసారి న్యూట్రల్ అంపైర్‌గా కనిపించనున్నాడు. మీనన్ ప్రస్తుతంభారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో మీనన్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అలీమ్ దార్, న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, ఆస్ట్రేలియా నుండి పాల్ రీఫిల్, ఇంగ్లండ్ నుంచి రాడ్ టక్కర్, వెస్టిండీస్ నుండి జోయెల్ విల్సన్ ఉన్నారు. చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్ట్‌తో సంబంధం అంటగట్టి' -
IPL 2021: ఐపీఎల్ నుంచి ఇద్దరు అంపైర్లు ఔట్
న్యూఢిల్లీ: ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపీఎల్-14వ సీజన్‌ను వీడిన సంగతి తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్(రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ (ఆర్సీబీ)లు ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. వీరు వైదొలగడానికి కారణం కరోనా సంక్షోభమే. ఇప్పుడు వీరి సరసన ఇద్దరు అంపైర్లు చేరారు. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఐసీసీ ఎలైట్ ప్యానల్ సభ్యులైన వీరిద్దరూ.. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మీనన్ తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో వారితో ఉండటం కోసం మీనన్ టోర్నీ నుంచి వైదొలిగారు. ఇక రీఫెల్ మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న విమానా రాకపోకల నిషేధం కారణంగా స్వదేశం వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ నితిన్‌కు చిన్న కుమారుడు ఉన్నాడు. తల్లికి భార్యకు కరోనా సోకడంతో ఆ కుమారుడ్ని చూసుకోవడానికి ఐపీఎల్‌ను వీడాల్సి వస్తుంది. ఇక రీఫెల్ భయపడుతున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లడానికి విమాన సౌకర్యం ఉండదనే భయంతో ముందుగా వెళ్లిపోతున్నారు. భారత్‌లో చాలామంది స్థానిక అంపైర్లు బ్యాకప్‌గా ఉన్నారు. వారు అంపైరింగ్ సేవల్ని ఉపయోగించుకుంటాం’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
27 ఏళ్ల తర్వాత తొలి సారిగా..
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలి సారిగా ఇద్దరు స్వదేశీ అంపైర్లు ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో చివరి సారిగా ఇద్దరు భారత అంపైర్లు బరిలో నిలిచారు. ఆ మ్యాచ్‌లో ఎల్.నరసింహన్, వీకే రామస్వామిలు ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇద్దరు భారత అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరీలు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కొద్ది రోజుల ముందే నితిన్ మీనన్, అనిల్ చౌదరీతో పాటు వీరేందర్ శర్మ అనే అంపైర్‌ను ఐసీసీ నియమించింది. తొలి టెస్టులో అనిల్, నితిన్ బరిలో నిలువగా రెండో టెస్టులో నితిన్‌కు తోడుగా వీరేందర్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. కరోనా ప్రయాణ అంక్షల కారణంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్సిప్కు స్థానిక అంపైర్లనే నియమించుకోవాలని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ అంపైర్ల ప్యానల్లో సభ్యులైన ఈ ముగ్గురు భారత అంపైర్లకు ఈ అరుదైన అవకాశం దక్కింది. మరోవైపు సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు భారతకు చెందిన వ్యక్తే రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌లకు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వహించనున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్‌డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. -
‘ఎలైట్ ప్యానెల్’లో నితిన్
దుబాయ్: భారత అంపైర్ నితిన్ నరేంద్ర మేనన్‌కు అరుదైన అవకాశం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అగ్రశ్రేణి అంపైర్ల జాబితా అయిన ‘ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్’లో ఆయనకు చోటు దక్కింది. భారత్ నుంచి గతంలో ఇద్దరు మాత్రమే ఎలైట్ ప్యానెల్ అంపైర్లుగా వ్యవహరించారు. శ్రీనివాసన్ వెంకట్రాఘవన్ (2002–04), సుందరం రవి (2010–19) గతంలో ఈ బాధ్యతను నిర్వర్తించారు. ఇంగ్లండ్‌కు చెందిన నైజేల్ లాంజ్ స్థానంలో 36 ఏళ్ల నితిన్ ప్యానెల్లోకి వచ్చారు. ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్, రంజన్ మదుగలే, డేవిడ్ బూన్, సంజయ్ మంజ్రేకర్‌ల బృందం నితిన్‌ను ఎంపిక చేసింది. 12 మంది సభ్యుల ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఇప్పుడు అందరికంటే పిన్న వయస్కుడు నితిన్ కావడం విశేషం. ఇండోర్‌కు చెందిన నితిన్ మధ్యప్రదేశ్ జట్టు తరఫున 2 దేశవాళీ వన్డేలు ఆడారు. 2017లో అంతర్జాతీయ అంపైర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. తన మూడేళ్ల అంతర్జాతీయ అంపైరింగ్ కెరీర్లో ఆయన 3 టెస్టులు, 24 వన్డేలు, 16 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. 10 మహిళల టి20 మ్యాచ్‌లకు కూడా పని చేశారు. ఏడాది కాలంగా ఆయన పనితీరు చాలా బాగుండటాన్ని ఐసీసీ గుర్తించింది. మరోవైపు అందరికంటే ఎక్కువగా 36.2 శాతం తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన నైజేల్ లాంజ్ చోటు కోల్పోవాల్సి వచ్చింది. తనకు ఈ అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నితిన్... మరింత సమర్థంగా పని చేసి అంపైరింగ్‌పై విశ్వాసం పెరిగేలా చేస్తానని అన్నారు. -
పిన్న వయసులోనే ఎలైట్ ప్యానల్లో చోటు
దుబాయ్: వచ్చే 2020-21 సీజన్లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తమ అంపైర్ల ఎలైట్ ప్యానల్‌ను ప్రకటించింది. ఇందులో భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్‌కు చోటు కల్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్‌ను ఎలైట్ ప్యానల్ చేర్చే విషయాన్ని ఐసీసీ సోమవారం ప్రకటించింది. దాంతో ఈ సీజన్లో ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్న పిన్నవయస్కుడిగా 36 ఏళ్ల నితిన్ నిలిచారు. ఇప్పటివరకూ మూడు టెస్టులకు, 24 వన్డేలకు, 16 టీ20లకు నితిన్ అంపైర్‌గా వ్యహరించారు. ఇంగ్లండ్‌కు చెందిన నిగెల్ ఎల్లాంగ్ స్థానంలో నితిన్‌కు అవకాశం దక్కింది. గతంలో శ్రీనివాస్ వెంకట్రాఘవన్, సుందర్ రవిలు ఐసీసీ ఎలైట్ ప్యానల్లో పని చేసిన భారత అంపైర్లు. కాగా, గతేడాది సుందర్ రవిని ఐసీసీ ఎలైట్ ప్యానల్ నుంచి ఐసీసీ తప్పించింది. (కరోనాతో మాజీ క్రికెటర్ మృతి) అంతకుముందు ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానల్లో ఉన్న నితిన్‌ను.. ఎలైట్ ప్యానల్ అంపైర్‌గా ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్, మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్, మ్యాచ్ రిఫరీలు రంజన్ మదుగలే, డేవిడ్ బూన్లతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. చాలా ఏళ్లుగా భారత అంపైర్ల స్టాండర్డ్స్‌పై విమర్శలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరొకసారి భారత్‌కు చెందిన అంపైర్‌కు ఎలైట్ ప్యానల్లో చోటు దక్కడం విశేషం. కొంతకాలంగా నితిన్ అంపైర్‌గా కొన్ని కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్న క్రమంలోనే అతనికి ఎలైట్ ప్యానల్లో చోటు కల్పించారు. ‘ఎలైట్ అంపైర్ల ప్యానెల్‌కు తనను ఎంపిక చేయడం గొప్ప గౌరవంగా, గర్వకారణంగా భావిస్తున్నాను. ప్రముఖ అంపైర్లు, రిఫరీలతో ఉన్న ఎలైట్ ప్యానల్లో చేరాలనేది నా కల. కల ఇన్నాళ్లకు నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని నితిన్ ఆనందం వ్యక్తం చేశారు. (30 నిమిషాల కామెంటరీ అనుకుంటే..) నా తండ్రి కూడా అంపైరే ‘నా తండ్రి నరేంద్ర మీనన్ కూడా అంతర్జాతీయ అంపైరే. 2006లో బీసీసీఐ అంపైర్ల కోసం ఒక ఎగ్జామ్ నిర్వహించింది. అంతకు పూర్వం పది సంవత్సరాల క్రితం నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నువ్వు క్లియర్‌గా ఉంటే అంపైరింగ్ కోసం ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకో అన్నారు. నాకు అంపైరింగ్ అంటే ఇష్టం దాంతోనే అంపైరింగ్ పరీక్ష రాయడం జరిగింది. అలా నేను అంపైర్‌ను అయ్యాను’ అని మీనన్ తన జర్నీని రెండు మాటల్లో చెప్పేశారు.