ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16 నుంచి ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 16న నమీబియాతో శ్రీలంక తలపడనుంది. ఇక ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సూపర్-12 మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం మ్యాచ్ రిఫెరీలు, అంపైర్‌ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది.
ఈ జాబితాలో నలుగురు మ్యాచ్ రిఫరీలు, 16 మంది అంపైర్‌లు ఉన్నారు. కాగా భారత్ నుంచి ఐసీసీ ఎలైట్ అంపైర్ నితిన్ మీనన్‌కు స్థానం దక్కింది. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాధ్యత వహించిన అదే 16 మంది అంపైర్‌లను ఐసీసీ ఎంపిక చేసింది.
వారిలో నితిన్ మీనన్, రిచర్డ్ కెటిల్‌బరో, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, అలీం దార్ వంటి సీనియర్ అంపైర్‌లు ఉన్నారు. ఇక మ్యాచ్ రిఫరీలగా ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె ఎంపికయ్యారు.
టీ20 ప్రపంచకప్-2022కు అంపైర్‌లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అలీమ్ దార్, అహ్సన్ రజా, క్రిస్టోఫర్ బ్రౌన్, క్రిస్టోఫర్ గఫానీ, జోయెల్ విల్సన్, కుమార ధర్మసేన, లాంగ్టన్ రుసెరే, మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, నితిన్ మీనన్, పాల్ రీఫిల్, పాల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరోక్, రిచర్డ్ కెటిల్‌బరోక్
మ్యాచ్ రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె
చదవండి: Jasprit Bumrah: 'నేను ధైర్యంగానే ఉన్నా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన
Comments
Please login to add a commentAdd a comment