ICC umpires
-
రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండరీ అంపైర్..
దక్షిణాఫ్రికా లెజండరీ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు అనంతరం 16 ఏళ్ల అంపైరింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 2006లో జోహన్స్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌తో ఎరాస్మస్ అంపైర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కెరీర్లో 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20ల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా ఎరాస్మస్ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా ఎరాస్మస్ వ్యవహరించాడు.అదేవిధంగా మూడు సార్లు(2016, 2017, 2021) ఐసీసీ బెస్ట్ అంపైర్‌గా ఎరాస్మస్ నిలిచాడు. కాగా ఇప్పుడు ఎరాస్మస్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఐసీసీ ఎలైట్ ప్యానల్లో దక్షిణాఫ్రికా నుంచి అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ ఒక్కరే మిగలనున్నారు. -
T20 World Cup 2022: అంపైర్ల జాబితా ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16 నుంచి ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 16న నమీబియాతో శ్రీలంక తలపడనుంది. ఇక ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సూపర్-12 మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం మ్యాచ్ రిఫెరీలు, అంపైర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ జాబితాలో నలుగురు మ్యాచ్ రిఫరీలు, 16 మంది అంపైర్లు ఉన్నారు. కాగా భారత్ నుంచి ఐసీసీ ఎలైట్ అంపైర్ నితిన్ మీనన్‌కు స్థానం దక్కింది. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాధ్యత వహించిన అదే 16 మంది అంపైర్లను ఐసీసీ ఎంపిక చేసింది. వారిలో నితిన్ మీనన్, రిచర్డ్ కెటిల్‌బరో, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, అలీం దార్ వంటి సీనియర్ అంపైర్లు ఉన్నారు. ఇక మ్యాచ్ రిఫరీలగా ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె ఎంపికయ్యారు. టీ20 ప్రపంచకప్-2022కు అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అలీమ్ దార్, అహ్సన్ రజా, క్రిస్టోఫర్ బ్రౌన్, క్రిస్టోఫర్ గఫానీ, జోయెల్ విల్సన్, కుమార ధర్మసేన, లాంగ్టన్ రుసెరే, మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, నితిన్ మీనన్, పాల్ రీఫిల్, పాల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరోక్, రిచర్డ్ కెటిల్‌బరోక్ మ్యాచ్ రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె చదవండి: Jasprit Bumrah: 'నేను ధైర్యంగానే ఉన్నా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన -
ఐపీఎల్ 2020: బీసీసీఐకి మరో సవాల్
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ నిర్వహణ కోసం కిందా మీదా పడుతోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి తాజాగా అంపైర్ల విషయంలో మరో సవాల్ ఎదురైంది. యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్లో విధులు నిర్వర్తించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్‌కు చెందిన అంపైర్లు సుముఖంగా లేకపోవడమే అందుకు కారణం. ఐపీఎల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యులను బీసీసీఐ కోరగా... నలుగురు మాత్రమే అందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని సమాచారం. ఇందులో క్రిస్ గఫాని (న్యూజిలాండ్), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), మైకేల్ గాఫ్ (ఇంగ్లండ్)తో పాటు భారత్‌కు చెందిన నితిన్ మీనన్ ఉన్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ ఏడాది ఐపీఎల్‌కు తాము దూరమవుతున్నామని అంపైర్లు చెబుతున్నా... వాస్తవం మాత్రం కరోనానే అని తెలుస్తోంది. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్‌లో భాగంగా ఉంటున్న కుమార ధర్మసేన కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. శ్రీలంకలో జరిగే క్రికెట్ టోర్నీలతో తాను బిజీగా ఉండటమే దీనికి కారణమని అతడు బీసీసీఐకి చెప్పడం విశేషం. (చదవండి: అభిమానులకు డేవిడ్ వార్నర్ సవాల్) ప్రతి సీజన్లో ఎలైట్ ప్యానల్‌కు చెందిన ఆరుగురు అంపైర్లను ఐపీఎల్ కోసం బీసీసీఐ తీసుకుంటూ వస్తోంది. కరోనాతో ఈసారి ఐపీఎల్ సెప్టెంబర్‌కు వాయిదా పడటం... అదే సమయంలో అంతర్జాతీయ సిరీస్‌లు లేకపోవడంతో ఎక్కువ మంది ఎలైట్ ప్యానెల్ అంపైర్లను తీసుకోవాలని బీసీసీఐ యోచించింది. క్వారంటైన్, బయో సెక్యూర్ బబుల్ దాటి వెళ్లకూడదు వంటి నిబంధనల నడుమ దాదాపు రెండు నెలల పాటు సాగే ఐపీఎల్లో బాధ్యతలు నిర్వర్తించడం అవసరమా అనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు సమాచారం. దాంతో వారి స్థానంలో భారత అంపైర్లను తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ కోసం కనీసం 15 మంది అంపైర్లు అవసరం. అందులో 12 మంది ఫీల్డ్, టీవీ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తే... మరో ముగ్గురు ఫోర్త్ అంపైర్లుగా ఉంటారు. (చదవండి: వైజ్ కెప్టెన్ ఉన్నాడు.. వైస్ కెప్టెన్ ఎందుకు?) -
‘ఎలైట్ ప్యానెల్’లో రవి
* శంషుద్దీన్ ఎమర్జింగ్ ప్యానెల్‌కు * అంపైర్లను ఎంపిక చేసిన ఐసీసీ న్యూఢిల్లీ: రాబోయే సీజన్‌కు ఐసీసీ అంపైర్లను ఎంపిక చేసింది. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ఎస్.రవి.. ‘ఎలైట్ ప్యానెల్’లో స్థానాన్ని నిలబెట్టుకోగా, శంషుద్దీన్‌ను ‘ఎమర్జింగ్ ప్యానెల్’కు తీసుకుంది. 2011లో అంపైర్‌గా బాధ్యతలు చేపట్టిన రవి.. ఇప్పటి వరకు 11 టెస్టులు, 26 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేశారు. మరోవైపు 46 ఏళ్ల శంషుద్దీన్‌కు మరింత ప్రోత్సాహిన్నిస్తూ వన్డే ఎమర్జింగ్ ప్యానెల్‌కు ఎంపిక చేసింది. ఇప్పటికే ఆయన ఏడు వన్డేలు, 10 టి20 మ్యాచ్‌లతో పాటు అండర్-19 ప్రపంచకప్‌లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.