‘ఎలైట్ ప్యానెల్’లో రవి | ICC selection panel of umpires retain S Ravi in Elite Panel | Sakshi
Sakshi News home page

‘ఎలైట్ ప్యానెల్’లో రవి

Published Tue, Jun 7 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

ICC selection panel of umpires retain S Ravi in Elite Panel

* శంషుద్దీన్ ఎమర్జింగ్ ప్యానెల్‌కు
* అంపైర్లను ఎంపిక చేసిన ఐసీసీ

న్యూఢిల్లీ: రాబోయే సీజన్‌కు ఐసీసీ అంపైర్లను ఎంపిక చేసింది. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ఎస్.రవి.. ‘ఎలైట్ ప్యానెల్’లో స్థానాన్ని నిలబెట్టుకోగా, శంషుద్దీన్‌ను ‘ఎమర్జింగ్ ప్యానెల్’కు తీసుకుంది. 2011లో అంపైర్‌గా బాధ్యతలు చేపట్టిన రవి.. ఇప్పటి వరకు 11 టెస్టులు, 26 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేశారు. మరోవైపు 46 ఏళ్ల శంషుద్దీన్‌కు మరింత ప్రోత్సాహిన్నిస్తూ వన్డే ఎమర్జింగ్ ప్యానెల్‌కు ఎంపిక చేసింది. ఇప్పటికే ఆయన ఏడు వన్డేలు, 10 టి20 మ్యాచ్‌లతో పాటు అండర్-19 ప్రపంచకప్‌లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement