దక్షిణాఫ్రికా లెజండరీ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. వెల్లింగ్‌టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు అనంతరం 16 ఏళ్ల అంపైరింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 2006లో జోహన్స్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌తో ఎరాస్మస్ అంపైర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
తన కెరీర్‌లో 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20ల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా ఎరాస్మస్ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా ఎరాస్మస్ వ్యవహరించాడు.అదేవిధంగా మూడు సార్లు(2016, 2017, 2021) ఐసీసీ బెస్ట్ అంపైర్‌గా ఎరాస్మస్ నిలిచాడు. కాగా ఇప్పుడు ఎరాస్మస్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో దక్షిణాఫ్రికా నుంచి అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ ఒక్కరే మిగలనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment