మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 8) జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బెత్ మూనీ (40), ఎల్లిస్ పెర్రీ (30), అలైసా హీలీ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. బ్రూక్ హ్యలీడే, రోస్‌మేరీ మెయిర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మెగాన్ షట్, సదర్‌ల్యాండ్ తలో మూడు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. సోఫీ మోలినెక్స్ రెండు, జార్జియా వేర్హమ్, తహిళ మెక్‌గ్రాత్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో జార్జియా ప్లిమ్మర్ (29), సుజీ బేట్స్ (20), లియా తహుహు (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో ఆసీస్ గ్రూప్-ఏలో (పాయింట్ల పట్టిక) అగ్రస్థానానికి చేరింది. పాక్, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment