మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 24) ప్రకటించింది. ఈ జాబితాలో పది మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు.
మ్యాచ్ రిఫరీలు: షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరా
అంపైర్లు: లారెన్ అజెన్‌బాగ్, కిమ్ కాటన్, సారా దంబనేవానా, అన్నా హారిస్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, వృందా రతి, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, జాక్విలిన్ విలియమ్స్
కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 3 నుంచి షార్జా, దుబాయ్ వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ మొత్తం 18 రోజుల పాటు సాగనుంది. ఇందులో 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీ పడతాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడనుండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.
బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో (అక్టోబర్ 3) టోర్నీ మొదలు కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment