మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన మెగా టోర్నీ ఓపెనర్‌లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్‌పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.
36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్‌ను కట్టడి చేశారు.
స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి చేరుకుంది. మెగా టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్
Comments
Please login to add a commentAdd a comment