మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (నవంబర్ 11) జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. రెనెగేడ్స్ 17.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. గతంలో కూడా ఈ రికార్డు రెనెగేడ్స్ పేరిటే ఉండేది. 2019-20 సీజన్‌లో బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో రెనెగేడ్స్ 184 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక లక్ష్య ఛేదనలు..
186- మెల్‌బోర్న్ రెనెగేడ్స్
184- మెల్‌బోర్న్ రెనెగేడ్స్
180- పెర్త్ స్కార్చర్స్
179- సిడ్నీ సిక్సర్స్ (2020-21)
179- సిడ్నీ సిక్సర్స్ (2024-25)
కాగా, హేలీ మాథ్యూస్ (54 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), డియాండ్రా డొట్టిన్ (18 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 186 పరుగుల భారీ లక్ష్యాన్ని మెల్‌బోర్న్ రెనెగేడ్స్ సునాయాసంగా ఊదేసింది. మాథ్యూస్, డొట్టిన్ రెండో వికెట్‌కు కేవలం 33 బంతుల్లో 85 పరుగులు జోడించి రెనెగేడ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో రెనెగేడ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
అడిలైడ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తహిల మెక్‌గ్రాత్ (49), స్మృతి మంధన (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. లారా వోల్వార్డ్ట్ (27), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (24) పర్వాలేదనిపించారు. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇల్లింగ్‌వర్త్, అలైస్ క్యాప్సీ, డియాండ్రా డొట్టిన్, సారా తలో వికెట్ దక్కించుకున్నారు.
రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో హేలీ మాథ్యూస్, డొట్టిన్‌తో పాటు కోట్నీ వెబ్ (37 రిటైర్డ్ హర్ట్) కూడా రాణించింది. అలైస్ క్యాప్సీ ఒక్కరే తక్కువ స్కోర్‌కు (4) నిష్క్రమించారు. క్యాప్సీ వికెట్ డార్సీ బ్రౌన్‌కు దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టికలో సీడ్నీ థండర్ టాప్‌లో ఉండగా..మెల్‌బోర్న్ రెనెగేడ్స్ రెండో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment