క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ కీలక పాత్ర పోషించాడు. 98 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
నాలుగో రోజు ఆటలో ఆసీస్ విజయానికి 202 పరుగులు అవసరమైన దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన క్యారీ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తృటిలో సెంచరీతో చేసే అవకాశాన్ని క్యారీ కోల్పోయాడు.
ఇక ఈమ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన క్యారీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా క్యారీ(98*) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది.
2021లో బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఓ టెస్టులో పంత్ నాలుగో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో గిల్ క్రిస్ట్ 149 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
Comments
Please login to add a commentAdd a comment