Alex Carey Suprass Rishab Pant And 5 Others Set New Test Record Debut.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ డెబ్యూ టెస్టులోనే అదరగొట్టాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా క్యారీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బ్యాటర్‌గా 12 పరుగులు చేసిన క్యారీ పెద్దగా ఆకట్టుకోకున్నా వికెట్ కీపర్‌గా మాత్రం అదుర్స్ అనిపించాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే కీపర్‌గా 8 క్యాచ్‌లు అందుకొని చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి టెస్టులోనే అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న తొలి వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ రికార్డు సాధించాడు.
చదవండి: Nathon Lyon: వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర
ఇంతకముందు రిషబ్ పంత్(టీమిండియా) సహా క్రిస్ రీడ్, బ్రియాన్ టేబర్, చమర దనుసింఘే, పీటర్ నెవిల్, అలన్ నాట్‌లు తమ డెబ్యూ టెస్టులో వికెట్ కీపర్‌గా ఏడు క్యాచ్‌లు అందుకున్నారు. అయితే దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ ఒక టెస్టులో వికెట్ కీపర్‌గా తొమ్మిది క్యాచ్‌లు తీసుకున్నప్పటికీ అతనికి డెబ్యూ టెస్టు కాకపోవడం విశేషం.
చదవండి: BBL 2021: సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు
ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 400వ వికెట్ల మార్కును చేరుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లు తీసిన ఆసీస్ మూడో బౌలర్‌గా.. ఓవరాల్‌గా 17వ బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరపున లియోన్ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు), గ్లెన్ మెక్‌గ్రాత్(563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇక ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది.ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టును నాలుగు రోజుల్లో ముగించింది. ఆసీస్ ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 16- 20 వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది.
చదవండి: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే
Click Video For Here: Alex Carey Suprass Rishab Pant And 5 Others
— sakshi analytics (@AnalyticsSakshi) December 11, 2021
Alex Carey becomes the first player in men's Tests to take eight catches on debut! #Ashes https://t.co/H7QXaUzvGY
— cricket.com.au (@cricketcomau) December 11, 2021
Comments
Please login to add a commentAdd a comment