Rishabh Pant Completes 100th Test Dismissal In Just 26 Matches, Breaks Ms Dhoni's Record - Sakshi
Sakshi News home page

Rishab Pant: ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్‌

Published Tue, Dec 28 2021 10:30 PM | Last Updated on Wed, Dec 29 2021 9:16 AM

IND vs SA: Rishabh Pant Completes His 100th Test Dismissal  - Sakshi

Rishabh Pant Completes 100th Test Dismissal: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ టెస్టుల్లో మరో ఘనత సాధించాడు. తొలి టెస్టులో భాగంగా మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ టెంబా బవుమా క్యాచ్‌ తీసుకోవడం ద్వారా పంత్‌ టెస్టుల్లో కీపర్‌గా 100వ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో 100 క్యాచ్‌లు తీసుకున్న పంత్‌ ధోని, సాహా సరసన నిలిచాడు. అయితే పంత్‌కు 100 క్యాచ్‌లు అందుకోవడానికి కేవలం 26 టెస్టులు మాత్రమే అవసరమయ్యాయి.

చదవండి: BBL 2021: ఆండ్రూ టైకి ఊహించని షాక్‌ ఇచ్చిన అంపైర్లు

ఇక ధోని, సాహాలు సమానంగా 36 టెస్టుల్లో 100 క్యాచ్‌ల మార్క్‌ను అందుకున్నారు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా తరపున ఎంఎస్‌ ధోని 294 క్యాచ్‌లతో మొదటిస్థానంలో.. సయ్యద్‌ కిర్మాణి(198 డిస్‌మిసల్స్‌), కిరణ్‌ మోరే(130 డిస్‌మిసల్స్‌), నయన్‌ మోంగియా(107 డిస్‌మిసల్స్‌), వృద్ధిమాన్‌ సాహా(104 డిస్‌మిసల్స్‌) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement