Wriddiman Saha
-
తిరిగి బెంగాల్ గూటికి చేరిన సాహా
వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా దేశవాలీ క్రికెట్లో తిరిగి బెంగాల్ గూటికి చేరాడు. సాహా రెండేళ్ల కింద బెంగాల్ నుంచి త్రిపురకు వలస వెళ్లాడు. తాజాగా మనసు మార్చుకున్న సాహా తిరిగి బెంగాల్ జట్టుతో జత కట్టేందుకు సిద్ధమయ్యాడు. మూడు ఫార్మాట్లలో బెంగాల్ టీమ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. సుదీర్ఘ అనుబంధం ఉన్న బెంగాల్ జట్టులో తిరిగి చేరడం ఆనందంగా ఉందని, తదుపరి దేశవాలీ సీజన్లో ఆడేందుకు ఆతృతగా ఉన్నానని సాహా తెలిపాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి సాహా ఈ విషయాలను వెల్లడించాడు. సాహా రీఎంట్రీపై స్నేహశిష్ సైతం హర్షం వ్యక్తం చేశాడు. సాహాను బెంగాల్ జట్టులోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు స్నేహశిష్ తెలిపాడు. గతంలో సాహా బెంగాల్ జట్టుకు ఎంతో చేశాడని, అతని చేరిక బెంగాల్ జట్టును మరింత పటిష్ట పరుస్తుందని స్నేహశిష్ అభిప్రాయపడ్డాడు. వయసు మీద పడటంతోపై సాహా స్పందిస్తే.. అది కేవలం అంకెలకు మాత్రమే పరిమితం అని, తనలో క్రికెట్ ఆడే ఓపిక ఇంకా ఉందని అన్నాడు. ప్రస్తుత బెంగాల్ జట్టు యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉందని.. జట్టుకు అవసరమైన ఏ సేవలైనా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సాహా తెలిపాడు.39 ఏళ్ల సాహా టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లేటు వయసులోనూ సాహా ఐపీఎల్లో సత్తా చాటుతున్నాడు. -
ఐపీఎల్‌కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..?
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 18) క్యాష్ రిచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ జ్ఞాపకాన్ని కూడా షేర్ చేసుకోండని క్యాప్షన్ జోడించింది. దీంతో చాలామంది ఐపీఎల్ అభిమానులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. IPL's poster on Completed "17 Years of IPL". - The Biggest Cricket Event...!!!! ⭐ pic.twitter.com/oXgkvRf0dP — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో ఆడిన వారు ప్రస్తుతం ఎంత మంది ఇప్పటికీ ఆడుతున్నారని అడిగాడు. దీనికి చాలామంది తమకు తెలిసిన సమాధానాలు చెప్పారు. సమాధానం రివీల్ చేయకముందు మీకు తెలిసిన సమాధాన్ని మీరు కూడా షేర్ చేయండి. 17 YEARS OF THE IPL...!!! 💥 The greatest league in the world started on this day in 2008. 🇮🇳 pic.twitter.com/BPApcjBkOL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024 సమాధానం విషయానికొస్తే.. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున ఆడిన వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి ఆడిన విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒక్కడే నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బ్రెండన్ మెక్కల్లమ్ శివాలెత్తిపోవడంతో (73 బంతుల్లో 158; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) కేకేఆర్ 140 పరుగల భారీ తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో మెక్కల్లమ్ ఒక్కడే సింహ భాగం స్కోర్ చేశాడు. సౌరవ్ గంగూలీ 10, రికీ పాంటింగ్ 20, డేవిడ్ హస్సీ 12, మొహమ్మద్ హఫీజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఆర్సీబీ బౌలర్లలో జహీర్ ఖాన్, ఆష్లే నోఫ్కే, జాక్ కలిస్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆశోక్ దిండా (3-0-9-2), ఇషాంత్ శర్మ (3-0-7-1), అజిత్ అగార్కర్ (4-0-25-3), సౌరవ్ గంగూలీ (4-0-21-2), లక్ష్మీ రతన్ శుక్లా (1.1-0-12-1) ధాటికి 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (ప్రవీణ్ కుమార్ (18 నాటౌట్)) రెండంకెల స్కోర్ చేశారు. ద్రవిడ్ 2, వసీం జాఫర్ 6, విరాట్ కోహ్లి 1, జాక్ కలిస్ 8, కెమరూన్ వైట్ 6, మార్క్ బౌచర్ 7, బాసిల్ థంపి 0, నోఫ్కే 9, జహీర్ ఖాన్ 3, సునీల్ జోషి 3 పరుగులు చేసి ఔటయ్యారు. వికెట్ కీపర్‌గా వృద్దిమాన్ సాహా కలిస్ క్యాచ్ అందుకున్నాడు. -
దేశంలో టెస్ట్‌లకు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ ప్లేయర్‌గా ముద్రపడిన ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషాన్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసినందుకు గాను భారత క్రికెట్ అభిమానులు సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దేశంలో టెస్ట్ ఫార్మాట్‌కు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారంటూ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. సెలెక్టర్లకు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలని లేనట్లుంది, అందుకే టీ20 ఆడుకునే వాడిని జట్టులో చేర్చుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మేనేజ్మెంట్ ఇషాన్‌ను తుది జట్టులోకి (డబ్ల్యూటీసీ ఫైనల్) తీసుకుంటే, చాలాకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోతుందని అంటున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇషాన్ గణాంకాలు (48 మ్యాచ్‌ల్లో 38 సగటున 2985 పరుగులు) చూసే ఈ ఎంపిక చేశారా.. లేక ఎవరైనా రెకమెండ్ చేస్తే జట్టులోకి తీసుకున్నారా అంటూ సెలెక్టర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కంటే వెయ్యి రెట్టు మెరుగైన గణాంకాలు కలిగి, దేశవాలీ టోర్నీల్లో పరుగుల పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ (37 మ్యాచ్‌ల్లో 79.65 సగటున 3505 పరుగులు) కానీ, టెస్ట్ ఫార్మాట్‌కు అతికినట్లు సరిపోయి, ప్రస్తుతం (ఐపీఎల్ 2023) సూపర్ ఫామ్‌లో ఉన్న అనుభవజ్ఞుడైన వృద్ధిమాన్ సాహా కానీ సెలెక్టర్లకు కనపడలేదా అని నిలదీస్తున్నారు. సర్ఫరాజ్‌కు అనుభవం లేదని వదిలేస్తే, సాహా గత రంజీ ట్రోఫీ ప్రదర్శననైనా (7 ఇన్నింగ్స్‌ల్లో 52.16 సగటున 313 పరుగులు) పరిగణలోకి తీసుకొని ఉండాల్సిందని అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు ఇషాన్ కంటే సాహా బెటర్‌గా సూటవుతాడని, ఇషాన్‌ను ఎంపిక చేసి సెలెక్టర్లు పెద్ద తప్పే చేశారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడుతున్నారు. దేశంలో టెస్ట్ ఫార్మాట్‌కు సూటయ్యే ఆటగాళ్లే లేరని స్టాండ్ బై ప్లేయర్‌గా సూర్యకుమార్‌ను, వరల్డ్ గ్రేట్ ఆల్‌రౌండర్ లార్డ్ శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: రుత్‌రాజ్ గైక్వాడ్‌కు బంపరాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో! -
తీసేస్తారన్న సమయంలో ఆడతాడు.. అదే ప్రత్యేకత!
ఐపీఎల్లో ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో వృద్దిమాన్ సాహా ఒకడు. వికెట్ కీపర్ అనే ట్యాగ్‌లైన్ ఉండడంతో సాహా ఇన్నేళ్లయినా ఐపీఎల్లో కొనసాగుతూ వస్తున్నాడు. ఈ 16 ఏళ్లలో ఎన్నో జట్లకు ఆడిన సాహా మంచి అనుభవాన్నే గడించాడు. గతేడాది సాహా గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లడం.. అరంగేట్రం ఏడాదిలోనే ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడంతో సాహా జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోయాడు. దీనికి తోడు గుజరాత్‌కు నిఖార్సైన వికెట్ కీపర్ అవసరం ఉండడంతో సాహాను పక్కనబెట్టడానికి పాండ్యా ఇష్టపడలేదు. అంతేకాదు గుజరాత్ టైటాన్స్ తరపున బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో సాహా అంతగా రాణించింది లేదు. ఒకటో రెండో మ్యాచ్‌ల్లో తన ప్రభావం చూపించిన సాహా తొందరగానే ఔటయ్యేవాడు. వచ్చీ రావడంతో బౌండరీలు, సిక్సర్లు కొట్టాలనే ప్రయత్నంలో వికెట్ పారేసుకునేవాడు. కేఎస్ భరత్ లాంటి నాణ్యమైన వికెట్‌కీపర్ ఉన్నా పాండ్యా మాత్రం సాహాకే అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే సాహాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇక ఆడడం లేదు.. జట్టులో చోటు కోల్పోవడం ఖాయం అనుకున్న దశలో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. తాజాగా ఆదివారం(మే 7న) లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో అదే జరిగింది. ఈ సీజన్లో సాహా తొలిసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. 43 బంతుల్లో 81 పరుగులు చేసిన సాహా ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో సాహా బ్యాటింగ్ చూస్తుంటే సెంచరీ కూడా చేస్తాడేమో అన్నంతలా సాగింది. ఇప్పుడే కాదు ప్రతీ సీజన్లోనూ సాహాకు ఇది అలవాటే. 14 మ్యాచ్‌లు ఆడితే అందులో ఒక్కటి మాత్రమే గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌లు ఒకటో, రెండో ఉంటాయి. Salaam Saha-ab! 🙌 Wriddhiman scores the fastest 5️⃣0️⃣ for @gujarat_titans in just 20 balls#IPLonJioCinema #TATAIPL #IPL2023 #GTvLSG pic.twitter.com/bUCvkQPzsT — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: అన్నదమ్ముళ్ల అనుబంధం.. 'నాన్న గర్వంగా ఫీలయ్యేవారు' -
సమయం ముగిశాకా రివ్యూనా.. అదెలా సాధ్యం?
క్రికెట్లో రూల్ ప్రకారం ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై డీఆర్ఎస్ కోరేందుకు ఏ జట్టుకైనా 15 సెకన్లు సమయం ఉంటుంది. నిర్ణీత సమయంలోగా డీఆర్ఎస్ తీసుకుంటేనే థర్డ్ అంపైర్‌కు వెళ్లుంది. సమయం దాటిపోతే ఆన్‌ఫీల్డ్ అంపైర్ డీఆర్ఎస్కు కాల్అప్ ఇస్తారు. తాజాగా ఐపీఎల్లో మాత్రం ఈ నిబంధనను గాలికొదిలేశారు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని సాహా పుల్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్ ఇషాన్ కిషన్ చేతిలో పడింది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే సాహా వెంటనే రివ్యూకు వెళ్లకుండా గిల్‌తో చర్చించాడు. అప్పటికే 15 సెకన్ల గడువు ముగిసింది. కానీ ఈ విషయం ఫీల్డ్ అంపైర్ గమనించలేదు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత గుజరాత్ బ్యాటర్ వృద్దిమాన్ సాహా రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో ఫలితం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. అల్ట్రాఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తగిలినట్లు స్పైక్ కనిపించింది. దీంతో సాహా ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. అయితే రివ్యూ సమయం ముగిశాకా సాహా డీఆర్ఎస్ కోరడం సరైనదేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/o1jMdNEj5T — Surya Sharma (@SuryaSh54265109) April 25, 2023 How was Wriddhiman Saha even allowed to take the DRS? He signalled post the 15 seconds timer and even though the decision didn’t go in his favour, this shouldn’t have been allowed by the 3rd umpire! On-field umpire cannot track the time but the 3rd umpire surely can#GTvMI — Sports Taaza (@SportsTaaza) April 25, 2023 -
సాహాను గుడ్డిగా నమ్మిన పాండ్యా.. ఫలితం!
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్, పంజాబ్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రివ్యూ విషయంలో క్లారిటీ లేని కెప్టెన్ పాండ్యా కీపర్ సాహాను గుడ్డిగా నమ్మాడు. మరి ఫలితం ఏంటో తెలియాలంటే వార్త చదివాల్సిందే. విషయంలోకి వెళితే.. పంజాబ్ ఇన్నింగ్స్ 13వ ఓవ్ మోహిత్ శర్మ వేశాడు. ఔట్‌సైడ్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే ప్రయత్నంలో జితేశ్ శర్మ బంతిని మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. బంతిని అందుకున్న సాహా ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. అయితే బౌలర్ మోహిత్ సహా కెప్టెన్ పాండ్యాలు తమకు బ్యాట్‌కు బంతి టచ్ అయినట్లుగా ఎలాంటి శబ్దం రాలేదని చెప్పారు. Photo: Jio Cinema Twitter కానీ సాహా మాత్రం..'' లేదు నాకు సౌండ్ వచ్చింది.. బంతి బ్యాట్‌కు తాకింది'' అని బలంగా చెప్పాడు. అప్పటికే డీఆర్ఎస్ సమయం ముగిసిపోవడానికి ఒక్క సెకండ్ మాత్రమే మిగిలింది. అలా చివరి సెకన్లో సాహాను నమ్మిన పాండ్యా రివ్యూ కోరాడు. ఇక రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకినట్లు అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ రావడంతో జితేశ్ శర్మ ఔటైనట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో పాండ్యా నవ్వుతూ సాహా దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని అభినందించాడు. కెప్టెన్, బౌలర్ ఔట్ విషయంలో నమ్మకంతో లేనప్పుడు సాహా మాత్రం తన మాటకే కట్టుబడి రివ్యూ కోరి ఫలితం సాధించడం అందరిని ఆకట్టుకుంది. A brilliant review for Wriddhiman Saha. Jitesh Sharma departs for just 25 runs.#IPL2023 #PBKSvGT #WriddhimanSaha pic.twitter.com/Y3EtuuK67n — CricTelegraph (@CricTelegraph) April 13, 2023 చదవండి: 'అద్బుతం జరిగేది ఒకసారే.. అంతిమంగా బలయ్యింది మేమే' -
IPL 2022: గుజరాత్ బ్యాటర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్
గుజరాత్ ఓపెనింగ్ బ్యాటర్, వెటరన్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో సాహా మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. సాహాలో టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసిరావట్లేదని అభిప్రాయపడ్డాడు. లేటు వయసులో సాహా అదిరిపోయే ప్రదర్శనలతో రెచ్చిపోతున్నాడని కితాబునిచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సాహా.. మోస్ట్ డేంజరెస్ ప్లేయర్‌గా మారాడని, అతను మైదానం నలుదిక్కులా షాట్లు ఆడగలుగుతున్నాడని, సాహాకు తాను హై రేటింగ్ ఇస్తానని ప్రశంసలు కురిపించాడు. సాహా.. ఎలాంటి బౌలింగ్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగల ప్రతిభావంతుడైన ఆటగాడని కొనియాడాడు. అతను క్రీజులో నిలదొక్కుకుంటే అత్యంత ప్రమాదకర ఆటగాడని ఆకాశానికెత్తాడు. సాహా ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకొని, అతనికి టీమిండియాలో అవకాశం కల్పించాలని సెలెక్టర్లకు పరోక్ష సూచన చేశాడు. ఈ మేరకు సచిన్ తన లేటెస్ట్ యూట్యూబ్ వీడియోలో సాహాపై తన పాజిటివిటీని వ్యక్తపరిచాడు. ఐపీఎల్ 2022 సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన సాహా.. 39 సగటున 312 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌తో వివాదంలో ఇటీవలే క్లీన్ చిట్ పొందిన సాహా.. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. బెంగాల్ రంజీ జట్టులో అవకాశం ఇస్తామన్నా.. తనను జట్టు నుంచి రిలీవ్ చేయాలని రాద్ధాంతం చేస్తున్నాడు. టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడిన సాహా 3 సెంచరీలు, అర్ధసెంచరీల సాయంతో 1394 పరుగులు చేశాడు. టెస్ట్ ప్లేయర్‌గా ముద్రపడిన ఈ బెంగాలీ వెటరన్.. ఆ ముద్రను చెరిపేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే అతను బ్యాట్‌ను ఝులిపించడం మొదలుపెట్టాడు. ఐపీఎల్లో 142 మ్యాచ్‌లు ఆడిన సాహా పేరిట ఐపీఎల్లో ఓ శతకం కూడా నమోదై ఉంది. చదవండి: 'అర్థం పర్థం లేని ట్వీట్స్.. మాకేదో తేడా కొడుతుంది' -
సాహా వ్యవహారం.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం!
టీమిండియా సీనియర్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆరోపణలపై విచారణ కమిటీ సమర్పించిన నివేదికను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శనివారం సమీక్షించింది. ఇంటర్య్వూ ఇవ్వనందుకు స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్ తనను బెదిరించాడంటూ గత ఫిబ్రవరిలో సాహా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమాచారం ప్రకారం.. సాహా వ్యవహారంలో జర్నలిస్ట్ బొరియా మజుందార్‌దే తప్పని తేలడంతో అతనిపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఈ రెండేళ్ల కాలంలో మజుందార్ టీమిండియా ఆటగాళ్లను కలవడం గానీ.. స్వదేశంలో భారత్ ఆడే మ్యాచ్‌లకు వెళ్లడం చేయకూడదని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా సాహా చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు.. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభుతేజ్ బాటియాలతో బీసీసీఐ ఒక కమిటీని నియమించింది. కాగా గత నెలలో కమిటీ ముందు హాజరైన సాహా, బొరియా మజుందార్లు తమ వెర్షన్‌ను వెల్లడించారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు మజుందార్ తనను బెదిరించాడని సాహా పేర్కొనగా.. మరోవైపు సాహా వాట్సప్ చాట్‌ను తారుమారు చేసి స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఆరోపించాడు. ఇద్దరి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న విచారణ కమిటి నిజానిజాలు నిగ్గుతేల్చి శనివారం బీసీసీఐకి తమ నివేదికను సమర్పించింది. ''అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డుకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. సాహా వ్యవహారంలో తప్పు బొరియా మజుందార్దేనని రిపోర్టులో తేలిందని.. అందుకే భారత్ స్వదేశంలో ఆడే మ్యాచ్‌లకు మజుందార్‌ను అనుమతించకూడదు. అంతేకాదు ఆటగాళ్లను కూడా కలవకూడదు.. ఎలాంటి ఇంటర్య్వూలు తీసుకోకూడదు. ఇది రెండేళ్ల పాటు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి విషయాలు త్వరలోనే వెల్లడిస్తాం'' అంటూ బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాహా టీమిండియా తరపున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. చదవండి: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ..! ‘అతడు కాంట్రాక్ట్ ప్లేయర్..’ Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX — Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022 -
'సాహాను చూస్తే జాలేస్తోంది.. కానీ పంత్ ఉండడమే కరెక్ట్'
శ్రీలంకతో టి20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియాకు స్వదేశంలో తొలి సిరీస్ కాగా.. అటు మెషిన్ గన్ విరాట్ కోహ్లికి వందో టెస్టు ఆడనున్నాడు. అయితే లంకతో సిరీస్‌కు ముందు పలువురు సీనియర్ ఆటగాళ్లను బీసీసీఐ జట్టు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో పుజారా, రహానే, సాహా, ఇషాంత్ శర్మలు ఉన్నారు. ఇందులో రహానే, పుజారాలు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ సాహా, ఇషాంత్‌లకు దారులు మూసుకుపోయినట్లే. ఈ నేపథ్యంలో సాహాను జట్టు నుంచి తొలగించడంపై టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తిక్ అతనికి మద్దతుగా నిలిచాడు. సాహాను చూస్తే జాలేస్తుంది. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో పంత్ ఉండడమే సరైనదని అభిప్రాయపడ్డాడు. ''భారత క్రికెట్‌కు సాహా అపారమైన సేవలు అందించాడు. ఇప్పటికీ అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడిగా ఉన్నాడు. అదే సమయంలో రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా దూసుకురావడం సాహా అవకాశాలను తగ్గించేసింది. ఒక రకంగా దశాబ్ధన్నరం పాటు ఎంఎస్ ధోని జట్టులో ఎలా కొనసాగాడో.. అదే రీతిలో పంత్ కూడా అన్ని ఫార్మాట్లలోనూ అటు వికెట్ కీపర్‌గా.. బ్యాట్స్‌మన్‌గా నిలకడ చూపిస్తున్నాడు. అందుకే సాహా రెండో వికెట్ కీపర్‌గా ఉండాల్సి వస్తోంది. ఒకరకంగా అతనికి అవకాశాలు రాకపోవడంతో ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఇక లంకతో టెస్టు సిరీస్‌కు కేఎస్ భరత్‌ను పంత్‌కు తోడుగా వికెట్ కీపర్‌గా సెలెక్ట్ చేసింది. ఒక దశలో టీమ్‌లో స్థానం దక్కకపోతే ఎలాంటి క్రికెటర్ అయినా బాధపడతాడు. జట్టును ఏ విధంగా ఎంపిక చేశారో సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని అంచనా వేసుకోవాలి. ప్రతీ ఒక్కరూ దేశం కోసం ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సమయంలో.. నువ్వు పనికిరావు అని చెప్తే జీర్ణించుకోవడం కష్టం. కానీ వాస్తవం ఏంటనేది తెలుసుకుంటే విషయం అర్థమవుతుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: IND VS SL: రోహిత్‌కు వార్నింగ్ ఇచ్చిన కోహ్లి కోచ్.. మున్ముందు ముసళ్ల పండగ Novak Djokovic: నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన జొకోవిచ్ -
బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. ఇంటర్వ్యూ కోసం ఓ ప్రముఖ జర్నలిస్టు తనను బెదిరించినట్లు సాహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సాహానే స్వయంగా ట్విటర్లో స్క్రీన్షాట్ల రూపంలో బయటపెట్టాడు. సాహా ట్వీట్ అనంతరం మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్‌లు అతనికి మద్దతుగా నిలిచి.. ఆ జర్నలిస్ట్ పేరు బయటికి చెప్పాల్సిందన్నారు. చదవండి: Saha-Journalist Row: ఆటగాళ్లు నేరుగా మీడియాతో మాట్లాడకూడదు.. బీసీసీఐ సంచలన నిర్ణయం..! కాగా సాహా ట్వీట్‌ను బీసీసీఐ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ విషయంలో సాహాను బీసీసీఐ వివరణ కోరనున్నట్లు బోర్డు ట్రెజరర్ అరుణ్ దుమాల్ పీటీఐతో తెలిపారు. ''సాహా చేసిన ట్వీట్ గురించి అతన్నే అడుగుదామనుకుంటున్నాం. అసలు అది నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. సాహాకు నిజంగానే సదరు జర్నలిస్ట్ నుంచి బెదిరింపులు వచ్చాయా.. ట్వీట్ వెనుక బ్యాక్‌గ్రౌండ్ కాంటెస్ట్ ఏముందనేది తెలుసుకోవాలి. ఇంతకుమించి తాను ఏం చెప్పలేను. సాహాతో బీసీసీఐ సెక్రటరీ మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటారని'' చెప్పుకొచ్చాడు. కాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి చోటు దక్కలేదు. భారత జట్టులోకి మున్ముందు ఎంపిక చేసే అవకాశం లేదని, రిటైర్మెంట్ గురించి ఆలోచించాలంటూ సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు ఇటీవలే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ తనకు ఈ సమాచారం ఇచ్చాడంటూ సాహా బహిరంగపర్చాడు. చదవండి: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ..! ‘అతడు కాంట్రాక్ట్ ప్లేయర్..’ సాహా వ్యాఖ్యలపై ద్రవిడ్ స్పందించాడు. తాను చేసిన సూచనలో తప్పేమీ లేదని, సాహా దానిని బయటపెట్టడం పట్ల కూడా తాను బాధపడటం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ప్రధాన వికెట్ కీపర్‌గా పంత్ తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని, సాహాకు బదులుగా మరో యువ ఆటగాడిని రెండో కీపర్‌గా తీర్చి దిద్దాలనే ఉద్దేశం సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్కు ఉందని అతను వివరించాడు. After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX — Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022 -
ఆటగాళ్లు నేరుగా మీడియాతో మాట్లాడకూడదు.. బీసీసీఐ సంచలన నిర్ణయం..!
టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్దిమాన్ సాహా- జర్నలిస్ట్ మధ్య వివాదంతో మేల్కొన్న బీసీసీఐ.. టీమిండియా కాంట్రాక్ట్ ఆటగాళ్లు మీడియాతో నేరుగా సంప్రదింపులు జరిపే అంశానికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో లంకతో ప్రారంభంకానున్న సిరీస్ నుంచే కొత్త గైడ్‌లైన్స్‌ను ఆచరణలోకి తీసుకురావాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. బీసీసీఐ ప్రతిపాదిస్తున్న కొత్త మీడియా గైడ్ లైన్స్: బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లతో మీడియా నేరుగా మాట్లాడకూడదు. బీసీసీఐ మీడియా మేనేజర్ ద్వారానే ఆటగాళ్లు-మీడియా మధ్య సమాచారం బదిలీ జరగాలి. పబ్లిక్ ఫంక్షన్లు, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ఆటగాళ్లు మీడియాతో మాట్లాడే వెసులుబాటు యధాతథంగా కొనసాగనుంది. బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే ఆటగాడిపై నిషేధం లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. బీసీసీఐ మీడియా మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్ల ఇంటర్వ్యూలు, బైట్స్ తీసుకునే జర్నలిస్టులను ఏడాది పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. అండర్-19 క్రికెటర్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. కాగా, ఇంటర్వ్యూ కోసం ఓ ప్రముఖ జర్నలిస్టు బెదిరించినట్లు టీమిండియా సీనియర్ వికెట్‌కీపర్ సాహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూండా ఉండేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మీడియాకు కొత్త గైడ్‌లైన్స్ విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చదవండి: Wriddhiman Saha: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ! -
ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం
ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఆశ్చర్యంగా అసలు వేలంలో అమ్ముడుపోతారో లేదో అని అనుకున్న కొందరి ఆటగాళ్లను చివర్లో అదృష్టం వరించింది. వీళ్లది లక్ అనే చెప్పొచ్చు. చదవండి: IPL 2022 Auction: అన్క్యాప్డ్ ప్లేయర్‌కు అంత ధర.. ఎవరీ యష్ దయాల్ తొలి రోజు అమ్ముడుపోక రెండో రోజు చివర్లో మళ్లీ వేలానికి వచ్చిన వారిలో డేవిడ్ మిల్లర్‌కు రూ. 3 కోట్ల విలువ పలికింది. అప్పటి వరకు ఒక్క వికెట్ కీపర్‌ను కూడా తీసుకోని గుజరాత్ టైటాన్స్ వరుసగా వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్లను తీసుకుంది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా చివర్లో కోల్‌కతా బేస్‌ప్రైస్‌కే తీసుకోవడం ఊరట కలిగించింది. 333 టి20ల్లో ఏకంగా 146.35 స్ట్రయిక్‌రేట్‌తో 9,346 పరుగులు సాధించిన ఘనమైన రికార్డు ఉన్న అలెక్స్ హేల్స్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. కోల్‌కతా తక్కువ మొత్తానికే (రూ.కోటీ 50 లక్షలు) అతడిని దక్కించుకోగలిగింది. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ (బెంగళూరు; రూ. 2 కోట్లు) ఈ సీజన్ వేలంలో అమ్ముడైన చివరి ఆటగాడిగా నిలిచాడు. చదవండి: IPL 2022 Mega Auction: ఎవరీ షెపర్డ్.. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం! -
ఫ్యాబ్-ఫోర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!
టీమిండియా సీనియర్ టెస్టు క్రికెటర్లు రహానే, పుజారా, ఇషాంత్, వృద్ధిమాన్ సాహాలపై వేట పడనుంది. రాబోయే శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి ఈ నలుగురిని తప్పించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫ్యాబ్-ఫోర్ క్రికెటర్లకు వ్యక్తిగతంగానే సమాచారం అందించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ నలుగురిని శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కనీసం పరిగణలోకి కూడా తీసుకోవద్దని సెలక్షన్ కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ''రహానే, పుజారా, ఇషాంత్, సాహాలపై వేటు నిజమే. వీరి స్థానంలో కొత్త మొహాలకు చాన్స్ ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఫ్యాబ్-ఫోర్కు పర్సనల్‌గా సమాచారం అందించాం. అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టులోని మరికొంతమంది సీనియర్ ఆటగాళ్ల అభిప్రాయాలు అడిగాకే ఈ నిర్ణయానికి వచ్చామంటూ'' బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసి సాహా కీలక నిర్ణయం పుజారా, రహానేలకు బ్రేక్ మాత్రమే.. పుజారా, రహానేలకు ఇది బ్రేక్ మాత్రమే అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న ఈ ఇద్దరు జట్టుకు భారంగా మారారు. అయితే ఇప్పటికి వీరిద్దరు రాణిస్తారనే నమ్మకం బీసీసీఐకి ఉంది. ఎందుకంటే ఎంత కాదనుకున్న రహానే, పుజారాలు ప్రస్తుతం టీమిండయా టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లు. కాబట్టి రానున్న రంజీ సీజన్లో వీరిద్దరు రాణిస్తే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరికి రంజీ సీజన్ కీలకం. ఇషాంత్, సాహాల కెరీర్ ముగిసినట్లే.. ఇషాంత్, సాహాలను మాత్రం తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు వయసు పైబడడంతో ఫిట్నెస్ను అందుకోలేకపోతున్నారు. ఇషాంత్ బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. 33 ఏళ్ల వయసు ఉన్న ఇషాంత్ మహా అయితే మరో రెండేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లకు తోడూ సిరాజ్, శార్దూల్ లాంటి కొత్త బౌలర్లు వస్తుండడంతో ఇషాంత్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమై. దీంతో ఇషాంత్ రిటైర్ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడున్నారు. పరోక్షంగా బీసీసీఐ కూడా ఇషాంత్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లే. చదవండి: IND Vs WI: కేఎల్ రాహుల్ హిట్టయ్యాడు కానీ సమస్య అక్కడే.. Virat Kohli: అదే నిర్లక్ష్యం.. ప్రతిష్టాత్మక వన్డేలో కోహ్లి చెత్త ప్రదర్శన ఇక సాహా విషయంలోనూ బీసీసీఐ ఇదే అభిప్రాయంతో ఉంది. రెగ్యులర్‌గా కాకున్నా ఎప్పుడో ఒకసారి అవకాశాలు వస్తున్నప్పటికి సాహా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీనికి తోడూ వయసు కూడా 37 ఏళ్లు ఉండడం పెద్ద మైనస్‌గా మారింది. దాదాపు కెరీర్ చరమాంక దశలో సాహా ఉన్నాడు. ఇప్పుడు జట్టులో స్థానం ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకపక్క రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు అన్ని ఫార్మట్లలోనూ రెగ్యులర్‌గా ఆటగాళ్లుగా మారిపోవడం.. వీరిద్దరు వికెట్కీపర్లు కావడంతో సాహాకు అవకాశాలు మరింతగా తగ్గిపోయాయి. కేఎస్ భరత్ లాంటి యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు కూడా వస్తుండడంతో సాహా కెరీర్ దాదాపు ముగిసినట్లే. అందుకేనేమో ఎలాగూ టీమిండియాకు సెలక్ట్ కావడం లేదని ఈసారి రంజీ సీజన్‌కు దూరంగా ఉండాలని సాహా నిర్ణయం తీసుకున్నాడు. పైకి వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నప్పటికి.. అంతర్లీనంగా తనకు అవకాశాలు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇక శ్రీలంకతో టీమిండియా రెండు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 25-మార్చి 1 మధ్య తొలి టెస్టు(మొహలీ) మార్చి 5-9 రెండో టెస్టు(బెంగళూరు) తొలి టి20- మార్చి 13, మొహలీ రెండో టి20-మార్చి 15, ధర్మశాల మూడో టి20- మార్చి 18, లక్నో -
ఎలాగూ టీమిండియాలో చోటు దక్కదు.. రంజీలు ఆడి ఏం ప్రయోజనం..?
Saha Opts To Quit Ranji Trophy: కెరీర్ చరమాంకంలో ఉన్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బెంగాల్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ప్రారంభంకాబోయే రంజీ సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదని ప్రకటన చేశాడు. వ్యక్తిగత కారణాల చేత రంజీల నుంచి తప్పకుంటున్నట్టు వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయం వెనుక వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే నెలలో శ్రీలంకతో స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సెలక్షన్ కమిటీ అతన్ని పరిగణలోకి తీసుకోవట్లేదని బీసీసీఐ ముఖ్య అధికారి ఒకరు అతనితో నేరుగా చెప్పారట. పంత్‌కు ప్రత్యామ్నాయంగా కేఎస్ భరత్‌కు అవకాశమివ్వాలని సెలెక్టర్లు డిసైడ్ చేశారని సదరు అధికారి సాహాకు వివరించాడట. ఇది తెలిసే సాహా రంజీల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. ఎలాగూ టీమిండియాలో చోటు దక్కదు.. ఇక రంజీలు ఆడి ఏం ప్రయోజనమని సాహా వారి వద్ద వాపోయినట్లు సమాచారం. కాగా, 39 ఏళ్ల సాహా చివరిసారిగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడాడు. అప్పుడు రెగ్యులర్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. సాహాకు అవకాశమిచ్చారు. అయితే, ఆ సిరీస్‌లో అతను పెద్దగా రాణించకపోవడంతో దక్షిణాఫ్రికా పర్యటనకు తిరిగి పంత్‌నే వికెట్‌కీపర్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. మరోవైపు పంత్‌కు సబ్‌స్టిట్యూట్‌గా యువ ఆటగాడు కేఎస్ భరత్‌ను బీసీసీఐ ఎంకరేజ్ చేస్తున్నట్లు స్పష్టమవడంతో సాహా పూర్తిగా వైరాగ్యంలోని మునిపోయినట్లు తెలుస్తోంది. టీమిండియాకు ఆడాలన్న కసి అతనిలో ఉన్నా వయసు మీద పడటంతో బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టింది. ఈ నేపథ్యంలోనే సాహా రంజీల నుంచి పూర్తిగా వైదొలగాలిని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, భారత్-శ్రీలంక జట్ల మధ్య మార్చి 3 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ మార్చి 3 నుంచి మొహాలీ వేదికగా, రెండో టెస్ట్ మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనుంది. టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు ఆడిన సాహా.. 1353 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా అతను104 మందిని పెవిలియన్ కు పంపాడు. ఇందులో 92 క్యాచ్‌లు, 12 స్టంప్ అవుట్లు ఉన్నాయి. చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి రోహిత్.. కోహ్లికి మరింత దగ్గర -
ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్
Rishabh Pant Completes 100th Test Dismissal: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో మరో ఘనత సాధించాడు. తొలి టెస్టులో భాగంగా మహ్మద్ షమీ బౌలింగ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ టెంబా బవుమా క్యాచ్ తీసుకోవడం ద్వారా పంత్ టెస్టుల్లో కీపర్‌గా 100వ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో 100 క్యాచ్‌లు తీసుకున్న పంత్ ధోని, సాహా సరసన నిలిచాడు. అయితే పంత్‌కు 100 క్యాచ్‌లు అందుకోవడానికి కేవలం 26 టెస్టులు మాత్రమే అవసరమయ్యాయి. చదవండి: BBL 2021: ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు ఇక ధోని, సాహాలు సమానంగా 36 టెస్టుల్లో 100 క్యాచ్‌ల మార్క్‌ను అందుకున్నారు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా తరపున ఎంఎస్ ధోని 294 క్యాచ్‌లతో మొదటిస్థానంలో.. సయ్యద్ కిర్మాణి(198 డిస్మిసల్స్), కిరణ్ మోరే(130 డిస్మిసల్స్), నయన్ మోంగియా(107 డిస్మిసల్స్), వృద్ధిమాన్ సాహా(104 డిస్మిసల్స్) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నారు. Bavuma gone, 100th Catch for Pant #INDvsSA #SAvIND #testcricket #IndianCricketTeam @ESPNcricinfo pic.twitter.com/aPiDraQaWT — Inian Kumar Ganesan (@Inian14) December 28, 2021 -
ధోని ఈజ్ బెస్ట్, తర్వాత ఆ ఇద్దరు.. అశ్విన్ లిస్ట్‌లో పంత్కి దక్కని చోటు
Ravichandran Ashwin Picks Best Indian Wicketkeeper: ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైన రవిచంద్రన్ అశ్విన్.. పర్యటనకు బయల్దేరే ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ.. తన దృష్టిలో ధోని, వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్‌లు భారత అత్యుత్తమ వికెట్కీపర్లు అని, వికెట్ల వెనకాల వారు పాదరసంలా కదులుతారని పేర్కొన్నాడు. ఈ ముగ్గురు అద్భుతమైన కీపర్లు అని, వీరిలో ధోని అత్యుత్తమమని తెలిపాడు. క్లిష్టమైన స్పిన్ బంతులను ధోని ఎంతో సులువుగా అందుకుంటాడని, వికెట్లకు ఇరు వైపులా మెరుపులా కదులుతాడని అన్నాడు. మరోవైపు కార్తీక్‌పై కూడా ప్రశంసలు కురిపించిన అశ్విన్, సాహా.. ఇంచుమించు ధోనిలాగే కదులుతాడని కితాబునిచ్చాడు. సాహా వికెట్‌కీపింగ్ టాప్ క్లాస్‌గా ఉంటుందని కొనియాడాడు. అశ్విన్ పేర్కొన్న భారత అత్యుత్తమ వికెట్కీపర్ల జాబితాలో ప్రస్తుత భారత రెగ్యులర్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు చోటు ఇవ్వకపోవడం విశేషం. పంత్ గురించి ఇప్పుడే ఓ అభిప్రాయానికి రాలేమన్న యాష్.. అతనికి మరింత అనుభవం అవసరమని అభిప్రాయపడ్డాడు. కాగా, త్వరలో ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. చదవండి: అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు.. వైరలవుతోన్న గంగూలీ కామెంట్లు -
రెండో టెస్టుకు సాహా దూరం.. కేఎస్ భరత్‌కు అవకాశం!
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెడనొప్పి గాయంతో ఇబ్బంది పడుతున్న సాహా రెండో టెస్టు సమయానికి కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బౌలింగ్ కోచ్ పరాస్ అంబ్రే ఒక ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. ఫిజియోలు సాహా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మెడనొప్పి అలాగే ఉంటే మాత్రం సాహా స్థానంలో కేఎస్ భరత్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ విరాట్ కోహ్లిలు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ సమయంలో సాహా మెడనొప్పితో బాధపడుతూ కీపింగ్‌కు రాలేదు. దీంతో కేఎస్ భరత్ సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా విధులు నిర్వహించాడు. అయితే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్‌కు దిగిన సాహా నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్క్ సాధించి టీమిండియాకు మంచి ఆధిక్యం సాధించడంలో కృషి చేశాడు. -
సాహా ఎట్టకేలకు.. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే
Wriddiman Saha Half Century Mark After 2017 Since 11 Tests.. టీమిండియా వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ఎట్టకేలకు రాణించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్థ సెంచరీతో రాణించాడు. 126 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్స్ సహాయంతో 61 పరుగులతో నౌటౌట్‌గా నిలిచిన సాహా.. టీమిండియాకు మంచి ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. అయ్యర్ తర్వాత మంచి ఇన్నింగ్స్‌తో మెరిసిన సాహాకు టెస్టుల్లో ఇది ఆరో అర్థసెంచరీ. కాగా సాహా టెస్టుల్లో అర్థ సెంచరీ చేసి నాలుగేళ్లవుతుంది. 2017లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సాహా ఆఖరిసారిగా అర్థ సంచరీ చేశాడు. అప్పటినుంచి తాను ఆడిన 11 టెస్టుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సాహాపై ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగోరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. 2 పరుగులు చేసిన ఓపెనర్ యంగ్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆట ఐదోరోజులో న్యూజిలాండ్ గెలవాలంటే 280 పరుగులు అవసరం కాగా.. టీమిండియా 9 వికెట్లు కావాలి. -
ముందు బ్యాటింగ్‌లో.. ఇప్పుడు సూపర్ స్టంపింగ్‌తో
Sanju Samson Super Stuming.. ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సూపర్ స్టంపింగ్‌తో మెరిశాడు. అసలు టైం గ్యాప్ కూడా ఇవ్వని శాంసన్ సాహాను స్టంప్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన లామ్రోర్ తొలి బంతిని మిడిలి వికెట్ దిశగా వేశాడు. బంతిని సరిగా అంచనా వేయని సాహా ఫ్రంట్‌ఫుట్ వచ్చేశాడు. బంతిని వేగంగా అందుకున్న శాంసన్ సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. అంతకముందు శాంసన్ మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. 57 బంతులెదుర్కొన్న శాంసన్ 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. కాగా రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 9 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 81 పరుగులు చేసింది. రాయ్ 38, విలియమ్సన్ 14 పరుగులతో ఆడుతున్నారు. -
WTC Final: అందుకే పంత్ మైదానాన్ని వీడాడు..
న్యూఢిలీ: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆఖరి రోజు ఆట ఉత్కంఠగా సాగుతున్న సమయంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నపళంగా మైదానం వీడి వెళ్లిపోవడంపై పలు రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. 139 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టుని కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ విజయతీరాలకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో టీమిండియా.. వికెట్ కీపర్‌ని మార్చడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పంత్ స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వచ్చి నాలుగు ఓవర్ల పాటు కీపింగ్ చేశాడు. దీంతో పంత్‌కు ఏమైంది..?, సాహా ఎందుకు కీపింగ్ చేస్తున్నాడు..? అని తెలుసుకునేందుకు అభిమానులు, నెటిజన్లు తెగ ఆరాటపడ్డారు. ఈ నేపథ్యంలో పంత్ మైదానం వీడడానికి గల కారణాన్ని ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ వెల్లడించింది. ఆ సమయంలో పంత్ ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో అతని స్థానంలో సాహా కీపింగ్ చేశాడని డీసీ ట్వీట్ చేసింది. కాగా, ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తో పాటు ఐసీసీ గద (ట్రోఫీ) లభించగా, రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. చదవండి: WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో -
సలాం సాహా.. నిజమైన ప్రొఫెషనలిజం చూపించావు
లాహోర్: టీమిండియాకు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంతే ఉండాలని వ్యాఖ్యానించిన భారత వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాపై పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి వ్యాఖ్యలు నిజమైన ప్రొఫెషనల్ ఆటగాడు మాత్రమే చేయగలడని కితాబునిచ్చాడు. ప్రొఫెషనలిజం అనేది భారత వ్యవస్థలో భాగంగా మారిందని, అందుకు సాహా చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొనియాడాడు. మన స్థానంలో మరొకరికి అవకాశాలు వస్తున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణమైన విషయం కాదని, అందుకే సాహాను నిజమైన ప్రొఫెషనల్ ఆటగాడితో పోల్చానని పేర్కొన్నాడు. వ్యక్తిగత స్వార్ధాలు పక్కన పెట్టి దేశ ప్రయోజనాల గురించి ఆలోచించిన సాహాకు హ్యాట్సాఫ్ అని ఆకాశానికెత్తాడు. ఈ సందర్భంగా సాహాతో అతనికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. వీరిద్దరు ఐపీఎల్ ప్రారంభ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వికెట్‌గా ఎవరు బెస్ట్ ఛాయిస్ అనే అంశంపై మాట్లాడుతూ.. సాహా పై విధంగా స్పందించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో పంత్ విశేషంగా రాణించాడు కాబట్టి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు అతనే మొదటి ఛాయిస్‌గా ఉండేందుకు అర్హుడని పేర్కొన్నాడు. తన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటానని, అంతవరకు ప్రాక్టీస్‌పై దృష్టి సారిస్తానని వెల్లడించాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో డబ్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. భారత జంబో జట్టులో వికెట్ కీపర్లుగా పంత్, సాహాలు ఎంపికైనప్పటికీ.. కరోనా బారిన పడటంతో సాహా అవకాశాలు క్లిష్టంగా మారాయి. చదవండి: సెప్టెంబర్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఈ నెల 29న ప్రకటించే అవకాశం -
WTC Final: టీమిండియాకి గుడ్‌న్యూస్..
న్యూఢిల్లీ:ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్(డబ్యూటీసీ) ఫైనల్ కోసం సన్నద్ధం అవుతున్న వేళ భారత్ కు గూడ్ న్యూస్ అందింది. ఐపీఎల్-14 వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్న వృద్ధిమాన్ సాహా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పడు టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నాడు. వచ్చే నెలలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వృద్ధిమాన్ సాహా అందుబాటులో ఉండనున్నాడు.సూమారు మూడు వారాల పాటు ఢిల్లీ లో ఓ హాటల్లో క్వారంటైన్ వున్న సాహా సోమవారం ఇంటికి చేరుకున్నట్లు అతని సన్నిహితులు తెలిపారు. ఇంగ్గాండ్‌కు బయలు దేరేముందు ముంబైలో టీంఇండియా కఠిన ఆంక్షల మధ్య బయో బబుల్‌లో ఉండనుంది.ఈ బయో బబుల్‌లో చేరడానికి ముందు సాహా మరో సారి RT-PCR పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. సౌతాంప్టన్‌లో జూన్ 18 నుంచి జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. (చదవండి:WTC Final: గెలుపే లక్ష్యం.. ఆ సిరీస్ కూడా గెలుస్తాం!) -
కరోనా: కోలుకున్న హస్సీ.. సాహాకు వింత అనుభవం
ఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కు బ్యాటింగ్ కోచ్ మైకెల్ హస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో హస్సీకి నెగెటివ్‌గా తేలింది. కాగా హస్సీ ఆదివారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా హస్సీకి రెండుసార్లు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ''హస్సీకి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ నెగెటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. హస్సీ ఆసీస్ వెళ్లే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మే 15 వరకు ఆస్ట్రేలియా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో హస్సీ ట్రావెల్ బ్యాన్ ముగిసేవరకు ఇక్కడే ఉంటాడు. ఒకవేళ ఆస్ట్రేలియా విమానాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకపోతే ఆదివారం హస్సీ ఆసీస్‌కు బయల్దేరుతాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తిరిగి ఆంక్షలు పెడితే మాత్రం హస్సీ మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆసీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అతను ఆసీస్ వెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది'' అంటూ ముగించాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్ రద్దు తర్వాత కామెంటేటర్ మైకెల్ స్లేటర్ సహా 40 మంది ఆసీస్ ఆటగాళ్లు మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆసీస్ చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక టీమిండియా వికెట్‌కీపర్.. ఎస్ఆర్హెచ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కోవిడ్ పరీక్షలో వింత అనుభవం ఎదురైంది. ఐపీఎల్ 14వ సీజన్ నడుస్తుండగానే సాహాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. ఇటీవలే 15 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్న సాహా మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. తొలిసారి పాజిటివ్ రావడంతో మరోసారి పరీక్ష చేయించుకున్నాడు. అయితే రెండోసారి నెగెటివ్ అని వచ్చింది. దీంతో సాహా మరో 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండడనున్నట్లు స్వయంగా వెల్లడించాడు. కాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసిన టీమిండియా జట్టును బీసీసీఐ ముంబైలో ఏర్పాటు చేసిన బయోబబూల్‌లో ఉంచనుంది. చదవండి: మైకెల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్ -
'పంత్‌కు కీపింగ్...సాహాకు బ్యాటింగ్ రాదు'
మెల్బోర్న్ : ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఓపెనర్ పృథ్వీ షా ఫేలవ ప్రదర్శన చేయడంతో అతని స్థానంలో గిల్, కోహ్లి స్థానంలో రాహుల్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో పాటు టీమిండియా జట్టులో కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ స్థానంపై ఆసక్తి నెలకొంది. తొలి టెస్టులో అటు కీపర్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమైన వృద్ధిమాన్ సాహాకు మరో స్థానం ఇస్తారా లేక రిషబ్ పంత్‌కు చోటు ఇస్తారా అన్నది వేచి చూడాలి. అయితే వీరిద్దరిపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్) 'తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై వెళ్లడంతో రాహుల్, గిల్లో ఒకరు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వృద్ధిమాన్ సాహా విషయంలో మాత్రం జట్టు మేనేజ్మెంట్ రెండో ఆప్షన్‌పై ఇంకా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే పంత్ అనుకున్నంత ఫామ్‌లో లేడు.. ప్రస్తుత వాతావరణంలో పంత్‌పై అనుకూలత లేదు. వాస్తవానికి గత ఆసీస్ పర్యటనలో పంత్ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు కీపర్‌గానూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. సరిగ్గా రెండేళ్ల తర్వాత పంత్ కీపింగ్ సరిగా చేయడని.. సాహా బ్యాటింగ్ చేయలేడనే వాతావరణంలోకి మారిపోయింది. తొలి టెస్టులో సాహా కీపర్‌గానూ.. బ్యాట్స్‌మన్‌గానూ విఫలమయ్యాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా మంచి ప్రదర్శన ఇస్తారన్న నమ్మకం లేదంటూ' ముగించాడు. కాగా కోహ్లి గైర్హాజరీలో అజింక్యా రహానే నాయకత్వంలో డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు ఆడనుంది.(చదవండి : ఒక్క ఓవర్.. ఐదు వికెట్లు.. సూపర్ కదా) -
అచ్చం ధోని తరహాలో..
అడిలైడ్ : ఆసీస్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా వైఫల్యాన్ని అభిమానులు అంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ విధించిన 90 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ 21 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మాథ్యూ వేడ్‌ను వృద్ధిమాన్ సాహా రనౌట్ చేశాడు. సాహా రనౌట్ చేసిన తీరు అచ్చం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనిని గుర్తుకుతెస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని వేడ్ ఫ్లిక్ చేయగా.. అది కీపర్ సాహా చేతికి చిక్కింది. వెంటనే సాహా.. ధోని తరహాలో తన కాళ్ల సందుల నుంచి బంతిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తిన వేడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. (చదవండి : 96 ఏళ్ల చరిత్రను రిపీట్ చేశారు) ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ' అలర్ట్.. అద్భుతమైన రనౌట్.. సాహా నుంచి వచ్చిన ఈ సిగ్నల్ దేనిని సూచిస్తుందో చెప్పగలరా..' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలుకానుంది. విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. Bizarre dismissal alert! What about that from Saha?! #AUSvIND pic.twitter.com/OqMLnSNgCE — cricket.com.au (@cricketcomau) December 19, 2020