Photo: Jio Cinema Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్, పంజాబ్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రివ్యూ విషయంలో క్లారిటీ లేని కెప్టెన్ పాండ్యా కీపర్ సాహాను గుడ్డిగా నమ్మాడు. మరి ఫలితం ఏంటో తెలియాలంటే వార్త చదివాల్సిందే. విషయంలోకి వెళితే.. పంజాబ్ ఇన్నింగ్స్ 13వ ఓవ్ మోహిత్ శర్మ వేశాడు.
ఔట్‌సైడ్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే ప్రయత్నంలో జితేశ్ శర్మ బంతిని మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. బంతిని అందుకున్న సాహా ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. అయితే బౌలర్ మోహిత్ సహా కెప్టెన్ పాండ్యాలు తమకు బ్యాట్‌కు బంతి టచ్ అయినట్లుగా ఎలాంటి శబ్దం రాలేదని చెప్పారు.
Photo: Jio Cinema Twitter
కానీ సాహా మాత్రం..'' లేదు నాకు సౌండ్ వచ్చింది.. బంతి బ్యాట్‌కు తాకింది'' అని బలంగా చెప్పాడు. అప్పటికే డీఆర్‌ఎస్ సమయం ముగిసిపోవడానికి ఒక్క సెకండ్ మాత్రమే మిగిలింది. అలా చివరి సెకన్‌లో సాహాను నమ్మిన పాండ్యా రివ్యూ కోరాడు. ఇక రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకినట్లు అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ రావడంతో జితేశ్ శర్మ ఔటైనట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో పాండ్యా నవ్వుతూ సాహా దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని అభినందించాడు. కెప్టెన్, బౌలర్ ఔట్ విషయంలో నమ్మకంతో లేనప్పుడు సాహా మాత్రం తన మాటకే కట్టుబడి రివ్యూ కోరి ఫలితం సాధించడం అందరిని ఆకట్టుకుంది.
A brilliant review for Wriddhiman Saha.
— CricTelegraph (@CricTelegraph) April 13, 2023
Jitesh Sharma departs for just 25 runs.#IPL2023 #PBKSvGT #WriddhimanSaha pic.twitter.com/Y3EtuuK67n
Comments
Please login to add a commentAdd a comment