విరాట్ కోహ్లి, అజింక్యా రహానే (ఫైల్ ఫోటో)
కోల్‌కతా: ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భారత జట్టుకు మాజీ సారథి సౌరవ్ గంగూలీ చిట్కాలు చెబుతున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న జోయ్ రూట్ సేనను ఓడించగలిగే సత్తా భారత్‌కు ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్యాటింగే టీమిండియా బలమని.. తొలి ఇన్నింగ్స్‌లో 400కి పైగా పరుగులు సాధిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దాదా అభిప్రాయపడ్డాడు. ఎన్నో అంచనాల మధ్య 2014లో ఎంఎస్ ధోని నేతృత్వంలో ఇంగ్లండ్‌లో టీమిండియా అడుగుపెట్టింది.
ఆ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు పరద పారిచంగా.. మురళీ విజయ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం చెందారని అందుకే సిరీస్ 1-3తేడాతో ఘోర ఓటమి చవిచూసిందని వివరించాడు. ఇక గత మూడు టెస్టు(న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్) సిరీస్‌ల్లో ఇంగ్లండ్ గెలవలేదని.. చివరిగా ఆడిన తొమ్మిది టెస్టుల్లో బ్రిటీష్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిందని గుర్తుచేశాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో హాట్ ఫేవరేట్ కోహ్లి సేననే అని అభిప్రాయపడ్డాడు.
ధోనిపై కామెంట్స్..
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో తీవ్రంగా నిరశపరిచిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి దాదా మద్దతుగా నిలిచాడు. రిటైర్మెంట్ అనేది అతడి వ్యక్తిగత అభిప్రాయమని, ఎవరూ సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. కానీ, ధోని మళ్లీ ఫామ్‌లోకి వచ్చి పరుగులు రాబడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.
సాహా గాయంపై..
భారత వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా గాయంపై మాజీ సారథి స్పందించాడు. అసలు ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. భువనేశ్వర్, బుమ్రా గాయలతో కీలక సిరీస్‌కు దూరమవడంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల గాయాలపై బీసీసీఐ దృష్టి పెట్టాలని సూచించాడు. ఇంగ్లండ్‌లో పొడి పిచ్‌లపై టీమిండియా స్పిన్నర్లు రాణిస్తారని నమ్మకం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment