న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భవితవ్యంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి స్పందించారు. ధోని భవిష్యత్తు క్రికెట్ గురించి తమకు పూర్తి స్పష్టత ఉందని, కానీ ఆ విషయాలను బహిరంగ వేదికలపై వెల్లడించలేమన్నాడు. ఇక్కడ ధోని గురించి సెలక్టర్లకు ఒక అంచనా ఉందన్నాడు. భారత్‌కు ధోని ఒక అసాధారణ అథ్లెట్‌గా అభివర్ణించిన గంగూలీ.. కొన్ని విషయాలు మూసి ఉన్న డోర్స్ లోపలే ఉండాలన్నాడు. అది కూడా క్రికెట్ పారదర్శకతలో భాగమేనన్నాడు.
ఇటీవల తన భవిష్యత్తు గురించి ధోని మాట్లాడుతూ.. జనవరి తర్వాత తన నిర్ణయం ఉంటుందన్నాడు. జనవరి వరకూ నిరీక్షించమన్న ధోని.. అప్పటివరకూ తనను ఏమీ అడగవద్దని తెలిపాడు. దాంతో వచ్చే టీ20 వరల్డ్‌కప్ ఆడిన తర్వాతే ధోని రిటైర్మెంట్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో రాబోవు ఐపీఎల్ సీజన్ తర్వాతే ధోని క్రికెట్ భవిష్యత్తు గురించి క్లియర్ పిక్చర్ తెలుస్తుందని ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా వెల్లడించాడు. వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత జట్టుకు ధోని అందుబాటులో లేడు. విశ్రాంతి తీసుకుంటూ ఇంటి వద్దనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. దాంతో ధోని ఆటకు తాత్కాలిక బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment