
Ravichandran Ashwin Picks Best Indian Wicketkeeper: ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైన రవిచంద్రన్ అశ్విన్.. పర్యటనకు బయల్దేరే ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ.. తన దృష్టిలో ధోని, వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్‌లు భారత అత్యుత్తమ వికెట్‌కీపర్‌లు అని, వికెట్ల వెనకాల వారు పాదరసంలా కదులుతారని పేర్కొన్నాడు. ఈ ముగ్గురు అద్భుతమైన కీపర్లు అని, వీరిలో ధోని అత్యుత్తమమని తెలిపాడు.
క్లిష్టమైన స్పిన్ బంతులను ధోని ఎంతో సులువుగా అందుకుంటాడని, వికెట్లకు ఇరు వైపులా మెరుపులా కదులుతాడని అన్నాడు. మరోవైపు కార్తీక్‌పై కూడా ప్రశంసలు కురిపించిన అశ్విన్, సాహా.. ఇంచుమించు ధోనిలాగే కదులుతాడని కితాబునిచ్చాడు. సాహా వికెట్‌కీపింగ్ టాప్ క్లాస్‌గా ఉంటుందని కొనియాడాడు. అశ్విన్ పేర్కొన్న భారత అత్యుత్తమ వికెట్‌కీపర్ల జాబితాలో ప్రస్తుత భారత రెగ్యులర్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు చోటు ఇవ్వకపోవడం విశేషం. పంత్ గురించి ఇప్పుడే ఓ అభిప్రాయానికి రాలేమన్న యాష్.. అతనికి మరింత అనుభవం అవసరమని అభిప్రాయపడ్డాడు. కాగా, త్వరలో ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.
చదవండి: అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు.. వైరలవుతోన్న గంగూలీ కామెంట్లు