మెల్‌బోర్న్ : ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఓపెనర్ పృథ్వీ షా ఫేలవ ప్రదర్శన చేయడంతో అతని స్థానంలో గిల్, కోహ్లి స్థానంలో రాహుల్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో పాటు టీమిండియా జట్టులో కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ స్థానంపై ఆసక్తి నెలకొంది. తొలి టెస్టులో అటు కీపర్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమైన వృద్ధిమాన్ సాహాకు మరో స్థానం ఇస్తారా లేక రిషబ్ పంత్‌కు చోటు ఇస్తారా అన్నది వేచి చూడాలి. అయితే వీరిద్దరిపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్)
'తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై వెళ్లడంతో రాహుల్, గిల్‌లో ఒకరు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వృద్ధిమాన్ సాహా విషయంలో మాత్రం జట్టు మేనేజ్‌మెంట్ రెండో ఆప్షన్‌పై ఇంకా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే పంత్ అనుకున్నంత ఫామ్‌లో లేడు.. ప్రస్తుత వాతావరణంలో పంత్‌పై అనుకూలత లేదు. వాస్తవానికి గత ఆసీస్ పర్యటనలో పంత్ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు కీపర్‌గానూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. సరిగ్గా రెండేళ్ల తర్వాత పంత్ కీపింగ్ సరిగా చేయడని.. సాహా బ్యాటింగ్ చేయలేడనే వాతావరణంలోకి మారిపోయింది. తొలి టెస్టులో సాహా కీపర్‌గానూ.. బ్యాట్స్‌మన్‌గానూ విఫలమయ్యాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా మంచి ప్రదర్శన ఇస్తారన్న నమ్మకం లేదంటూ' ముగించాడు. కాగా కోహ్లి గైర్హాజరీలో అజింక్యా రహానే నాయకత్వంలో డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు ఆడనుంది.(చదవండి : ఒక్క ఓవర్.. ఐదు వికెట్లు.. సూపర్ కదా)
Comments
Please login to add a commentAdd a comment