ముందు బ్యాటింగ్‌లో.. ఇప్పుడు సూపర్‌ స్టంపింగ్‌తో | Sanju Samson Super Stumping Of Wriddiman Saha SRH Vs RR Match | Sakshi
Sakshi News home page

ముందు బ్యాటింగ్‌లో.. ఇప్పుడు సూపర్‌ స్టంపింగ్‌తో

Published Mon, Sep 27 2021 10:09 PM | Last Updated on Mon, Sep 27 2021 10:23 PM

Sanju Samson Super Stumping Of Wriddiman Saha SRH Vs RR Match - Sakshi

Courtesy: IPL. Com

Sanju Samson Super Stuming.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సూపర్‌ స్టంపింగ్‌తో మెరిశాడు. అసలు టైం గ్యాప్‌ కూడా ఇవ్వని శాంసన్‌ సాహాను స్టంప్‌ అవుట్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ వేసిన లామ్రోర్‌ తొలి బంతిని మిడిలి వికెట్‌ దిశగా వేశాడు. బంతిని సరిగా అంచనా వేయని సాహా ఫ్రంట్‌ఫుట్‌ వచ్చేశాడు. బంతిని వేగంగా అందుకున్న శాంసన్‌ సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు.

అంతకముందు శాంసన్‌ మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. 57 బంతులెదుర్కొన్న శాంసన్‌ 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 9 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 81 పరుగులు చేసింది. రాయ్‌ 38, విలియమ్సన్‌ 14 పరుగులతో ఆడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement