శ్రీలంకతో టి20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియాకు స్వదేశంలో తొలి సిరీస్ కాగా.. అటు మెషిన్ గన్ విరాట్ కోహ్లికి వందో టెస్టు ఆడనున్నాడు. అయితే లంకతో సిరీస్‌కు ముందు పలువురు సీనియర్ ఆటగాళ్లను బీసీసీఐ జట్టు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో పుజారా, రహానే, సాహా, ఇషాంత్ శర్మలు ఉన్నారు.
ఇందులో రహానే, పుజారాలు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ సాహా, ఇషాంత్‌లకు దారులు మూసుకుపోయినట్లే. ఈ నేపథ్యంలో సాహాను జట్టు నుంచి తొలగించడంపై టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తిక్ అతనికి మద్దతుగా నిలిచాడు. సాహాను చూస్తే జాలేస్తుంది. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో పంత్ ఉండడమే సరైనదని అభిప్రాయపడ్డాడు.
''భారత క్రికెట్‌కు సాహా అపారమైన సేవలు అందించాడు. ఇప్పటికీ అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడిగా ఉన్నాడు. అదే సమయంలో రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా దూసుకురావడం సాహా అవకాశాలను తగ్గించేసింది. ఒక రకంగా దశాబ్ధన్నరం పాటు ఎంఎస్ ధోని జట్టులో ఎలా కొనసాగాడో.. అదే రీతిలో పంత్ కూడా అన్ని ఫార్మాట్లలోనూ అటు వికెట్ కీపర్‌గా.. బ్యాట్స్‌మన్‌గా నిలకడ చూపిస్తున్నాడు. అందుకే సాహా రెండో వికెట్ కీపర్‌గా ఉండాల్సి వస్తోంది. ఒకరకంగా అతనికి అవకాశాలు రాకపోవడంతో ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఇక లంకతో టెస్టు సిరీస్‌కు కేఎస్ భరత్‌ను పంత్‌కు తోడుగా వికెట్ కీపర్‌గా సెలెక్ట్ చేసింది.
ఒక దశలో టీమ్‌లో స్థానం దక్కకపోతే ఎలాంటి క్రికెటర్ అయినా బాధపడతాడు. జట్టును ఏ విధంగా ఎంపిక చేశారో సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని అంచనా వేసుకోవాలి. ప్రతీ ఒక్కరూ దేశం కోసం ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సమయంలో.. నువ్వు పనికిరావు అని చెప్తే జీర్ణించుకోవడం కష్టం. కానీ వాస్తవం ఏంటనేది తెలుసుకుంటే విషయం అర్థమవుతుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: IND VS SL: రోహిత్‌కు వార్నింగ్ ఇచ్చిన కోహ్లి కోచ్.. మున్ముందు ముసళ్ల పండగ
Novak Djokovic: నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన జొకోవిచ్
Comments
Please login to add a commentAdd a comment