వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా దేశవాలీ క్రికెట్‌లో తిరిగి బెంగాల్ గూటికి చేరాడు. సాహా రెండేళ్ల కింద బెంగాల్ నుంచి త్రిపురకు వలస వెళ్లాడు. తాజాగా మనసు మార్చుకున్న సాహా తిరిగి బెంగాల్ జట్టుతో జత కట్టేందుకు సిద్ధమయ్యాడు. మూడు ఫార్మాట్లలో బెంగాల్ టీమ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు.
సుదీర్ఘ అనుబంధం ఉన్న బెంగాల్ జట్టులో తిరిగి చేరడం ఆనందంగా ఉందని, తదుపరి దేశవాలీ సీజన్‌లో ఆడేందుకు ఆతృతగా ఉన్నానని సాహా తెలిపాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి సాహా ఈ విషయాలను వెల్లడించాడు. సాహా రీఎంట్రీపై స్నేహశిష్ సైతం హర్షం వ్యక్తం చేశాడు. సాహాను బెంగాల్ జట్టులోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు స్నేహశిష్ తెలిపాడు.
గతంలో సాహా బెంగాల్ జట్టుకు ఎంతో చేశాడని, అతని చేరిక బెంగాల్ జట్టును మరింత పటిష్ట పరుస్తుందని స్నేహశిష్ అభిప్రాయపడ్డాడు. వయసు మీద పడటంతోపై సాహా స్పందిస్తే.. అది కేవలం అంకెలకు మాత్రమే పరిమితం అని, తనలో క్రికెట్ ఆడే ఓపిక ఇంకా ఉందని అన్నాడు. ప్రస్తుత బెంగాల్ జట్టు యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉందని.. జట్టుకు అవసరమైన ఏ సేవలైనా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సాహా తెలిపాడు.
39 ఏళ్ల సాహా టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లేటు వయసులోనూ సాహా ఐపీఎల్‌లో సత్తా చాటుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment