Bengal cricket association
-
SMT 2024: ఒకే జట్టులో మహ్మద్ షమీ బ్రదర్స్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024-25 కోసం బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సుదీప్ కుమార్ ఘరామి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిగా వైట్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇండియన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ జట్టులో చోటు దక్కింది.షమీ ఇటీవలే రంజీ ట్రోఫీ 2024-25లో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే 6 వికెట్లతో ఈ సీనియర్ బౌలర్ సత్తచాటాడు. ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు ఈ బెంగాల్ స్టార్ సిద్దమయ్యాడు. కాగా ఈ జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్‌కు కూడా బెంగాల్ సెలక్టర్లు చోటిచ్చారు. నవంబర్ 23 నుంచి ఈ దేశవాళీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు హైదరాబాద్, మేఘాలయ, మధ్యప్రదేశ్, మిజోరాం, బీహార్, రాజస్థాన్, పంజాబ్‌లతో పాటు గ్రూప్-ఎలో ఉంది.బెంగాల్ జట్టు: సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, రిటిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), రంజోత్ సింగ్ ఖైరా, ప్రయాస్ రే బర్మన్ (వికెట్ కీపర్), అగ్నివ్ పాన్ (వికెట్ కీపర్), ప్రదీప్త ప్రమాణిక్, సాక్షం చౌదరి, మహ్మద్ షమీ, ఇషాన్ పోరెల్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్ మరియు సౌమ్యదీప్ మండల్.చదవండి: IPL 2025 Mega Auction:'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే' -
తిరిగి బెంగాల్ గూటికి చేరిన సాహా
వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా దేశవాలీ క్రికెట్లో తిరిగి బెంగాల్ గూటికి చేరాడు. సాహా రెండేళ్ల కింద బెంగాల్ నుంచి త్రిపురకు వలస వెళ్లాడు. తాజాగా మనసు మార్చుకున్న సాహా తిరిగి బెంగాల్ జట్టుతో జత కట్టేందుకు సిద్ధమయ్యాడు. మూడు ఫార్మాట్లలో బెంగాల్ టీమ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. సుదీర్ఘ అనుబంధం ఉన్న బెంగాల్ జట్టులో తిరిగి చేరడం ఆనందంగా ఉందని, తదుపరి దేశవాలీ సీజన్లో ఆడేందుకు ఆతృతగా ఉన్నానని సాహా తెలిపాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి సాహా ఈ విషయాలను వెల్లడించాడు. సాహా రీఎంట్రీపై స్నేహశిష్ సైతం హర్షం వ్యక్తం చేశాడు. సాహాను బెంగాల్ జట్టులోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు స్నేహశిష్ తెలిపాడు. గతంలో సాహా బెంగాల్ జట్టుకు ఎంతో చేశాడని, అతని చేరిక బెంగాల్ జట్టును మరింత పటిష్ట పరుస్తుందని స్నేహశిష్ అభిప్రాయపడ్డాడు. వయసు మీద పడటంతోపై సాహా స్పందిస్తే.. అది కేవలం అంకెలకు మాత్రమే పరిమితం అని, తనలో క్రికెట్ ఆడే ఓపిక ఇంకా ఉందని అన్నాడు. ప్రస్తుత బెంగాల్ జట్టు యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉందని.. జట్టుకు అవసరమైన ఏ సేవలైనా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సాహా తెలిపాడు.39 ఏళ్ల సాహా టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లేటు వయసులోనూ సాహా ఐపీఎల్లో సత్తా చాటుతున్నాడు. -
తమ్ముడి అరంగేట్రం.. మహ్మద్ షమీ భావోద్వేగం!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ బెంగాల్ జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా శుక్రవారం ఆంధ్ర జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌తో మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన తమ్ముడికి అభినందనలు తెలుపుతూ మహ్మద్ షమీ భావోద్వేగ పోస్ట్ చేశాడు. "ఎట్టకేలకు నీవు అనుకున్నది సాధించావు. బెంగాల్ వంటి అద్బుత జట్టు తరపున రంజీ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. నా దృష్టిలో ఇది నీవు సాధించిన గొప్ప విజయం. నీ కెరీర్లో మరింత ఎత్తుకు ఎదిగాలని కోరుకుంటున్నాను. జట్టు కోసం ప్రతీ మ్యాచ్‌లోను 100 శాతం ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. కంగ్రాట్స్ కైఫ్ అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా మహ్మద్ కైఫ్ కూడా షమీ మాదిరే రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. కాగా లిస్ట్-ఏ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో కైఫ్‌కు ఈ ఏడాది రంజీ సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన బెంగాల్ జట్టులో చోటు దక్కింది. 2021లో బెంగాల్ తరపున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. గతేడాది ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కైప్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన కైఫ్ 12 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టులోకి అనూహ్యంగా...!!
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం(డిసెంబర్ 17) జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ వన్డే సిరీస్ నుంచి టీమిండియా పేసర్ దీపక్ చాహర్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్ స్దానాన్ని ఎవరూ ఊహించని ఆటగాడితో బీసీసీఐ భర్తీ చేసింది. బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌ను చాహర్ ప్రత్యామ్నాయంగా బీసీసీఐ ప్రకటించింది. తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన ఆకాష్ దీప్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఆకాష్ ఈ స్దాయికి చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎవరీ ఆకాష్ దీప్..? 27 ఏళ్ల ఆకాష్ ఆకాష్ దీప్ బీహార్‌లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్‌ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. క్రికెట్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్లోని ఓ క్రికెట్ ఆకాడమీలో దీప్ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్లోని ఖేప్ క్రికెట్' టెన్నిస్ బాల్ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ డివిజన్ మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్ లభించింది. ఓ సారి కోల్‌కతాలోని రేంజర్స్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీమ్ డైరెక్టర్ జోయ్‌దీప్ ముఖర్జీ దృష్టిలో ఆకాష్ దీప్ పడ్డాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కీపర్ స్టంప్‌ల వెనుక 10 గజాల దూరంలో నిల్చోడం చూసి జోయ్‌దీప్ ముఖర్జీ ఆశ్చర్యపోయారు. వెంటనే అండర్-23 కోచ్ సౌరాశిష్‌ను పిలిపించి ఆకాష్ దీప్ గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు దీప్‌ను ముఖర్జీ రిఫర్ చేశాడు. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో ఆకాష్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ఆకాష్ పాల్గొనున్నాడు. ఆ తర్వాత 2019లో బెంగాల్ తరపున ఆకాష్ దీప్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఓవరాల్‌గా దేశీవాళీ క్రికెట్లో ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడిన ఆకాష్ 170 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20 లక్ష్లల కనీస్ ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. -
షాకిచ్చిన గంగూలీ.. అన్న కోసం అధ్యక్ష పదవి త్యాగం
బీసీసీఐ తాజా మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్రికెట్ వర్గాలకు ఊహించని షాకిచ్చాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి మరోసారి ఆశించి భంగపడ్డ దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి, చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం కూడా నామినేషన్ వేయని దాదా.. సోదరుడు స్నేహాశిష్ గంగూలీ కోసం క్యాబ్ అధ్యక్ష పదవిని త్యాగం చేశాడు. గంగూలీ పోటీ నుంచి విరమించుకోవడం, పోటీలో ఎవరూ లేకపోవడంతో స్నేహాశిష్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాడు. క్యాబ్ ఎన్నికల్లో 2015 నుంచి విపక్ష వర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడం ఆనవాయితీగా వస్తుంది. నాటి నుంచి 2019 వరకు గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా సేవలందించాడు. ఆ తర్వాత దాదా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడంతో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్ దాల్మియా క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మరోవైపు క్యాబ్ ఉపాధ్యక్ష పదవి కోసం ఆమలేందు బిస్వాస్, సెక్రటరీ పదవి కోసం నరేష్ ఓఝా, జాయింట్ సెక్రటరీ పోస్టు కోసం దేబబ్రత దాస్, ట్రెజరర్‌గా ప్రబీర్ చక్రవర్తి నామినేషన్లు వేశారు. ఈ పదవులకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవం కానున్నాయి. చదవండి: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర... -
ఈడెన్ గార్డెన్స్ స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు!
భారత సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో తన అఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. కాగా భారత జట్టు ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌కు క్లీన్ స్వీప్ చేసి జూలన్కు ఘనమైన విడ్కోలు ఇచ్చారు. తన అఖరి మ్యాచ్‌లో గో స్వామి రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో 355 వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఝులన్ తన కెరీర్‌ను ముగించింది. కాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన జులన్ 2002లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. ఇప్పడు అదే ఇంగ్లీష్ జట్టుపై తన కెరీర్‌ను ముగించడం గమానార్హం. ఇక ఇది ఇలా ఉండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఒక స్టాండ్‌కు ఝులన్ పేరును పెట్టి ఆమెను గౌరవించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ యోచిస్తోంది. "మేము ఈడెన్ గార్డెన్స్‌లో ఒక స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఆమె ఒక లెజెండరీ క్రికెటర్. కాబట్టి దిగ్గజ క్రికెటర్లతో పాటుగా ఆమె కూడా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉండాలి అనుకుంటున్నాము. అదే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించాలని భావిస్తున్నాము" అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. చదవండి: Jhulan Goswami: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా -
ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ బాస్ సోదరుడు
కోల్‌కతా: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కార్యదర్శి అయిన స్నేహాశీష్.. స్వల్ప అస్వస్థకులోనై(జ్వరం, కడుపునొప్పి) శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు అపోలో ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ జరిగింది. దీంతో యాంజియోప్లాస్టీ వల్లే ఏమైనా సమస్య వచ్చిందేమోనని కుటంబ సభ్యులు ఆందోళన చెందారు. జ్వరంగా కూడా ఉండటంతో కోవిడ్ పరీక్ష చేయించారు. అందులో నెగిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ఉడ్‌ల్యాండ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఏడాది జనవరిలో సౌరవ్ గంగూలీకి కూడా యాంజియోప్లాస్టీ జరిగింది. -
గంగూలీ తొలి కోచ్ కన్నుమూత
కోల్‌కతా : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ(86) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన తన కూతురితో పాటు లండన్‌లో ఉండేవారు. ఆయన గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఏప్రిల్ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడంతో తుదిశ్వాస విడిచారని ముస్తఫీ కుటుంబ సభ్యులు తెలిపారు. బెంగాల్‌కు క్రికెట్ పాఠాలు నేర్పే దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంటర్లో అశోక్ ముస్తాఫీ ప్రముఖ కోచ్‌గా ఉండేవారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న 12మంది బెంగాల్ రంజీ క్రికెటర్లుగా ఎదిగారు. సౌరవ్ గంగూలీ చిన్నతనంలో తొలిసారిగా ముస్తాఫీ వద్దే క్రికెట్లో ఓనమాలు దిద్దాడు. దాదా స్నేహితుడు సంజయ్ దాస్ కూడా ఆయన వద్దే క్రికెట్ ప్రారంభించాడు. గత నెల ముస్తాఫీ ఆరోగ్యం క్షీణించగా.. వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను గంగూలీ, సంజయ్ చేశారు. -
ఉంపన్: ‘పెద్ద నష్టమేమి జరగలేదు’
కోల్‌కతా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న ఆపత్కాలంలో పులి మీద పుట్రలా ప్రళయ భీకర ఉంపన్ తుపాను పశ్చిమబెంగాల్‌ను అతలాకుతలం చేసింది. ఈ తుపాను దాటికి పదుల సంఖ్యలో ప్రాణాలు, వేల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్థి నష్టం జరిగింది. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది. అయితే దేశంలోనే ప్రఖ్యాత మైదానంగా పేరుగాంచిన ఈడెన్ గార్డెన్స్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఈడెన్ గార్డెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘ఉంపన్ తుపాన్ ఎలాంటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భీకర తుపానుతో పిచ్, ఔట్ ఫీల్డ్ పూర్తిగా దెబ్బతినడం మినహా పెద్ద నష్టమేమి జరగలేదు. జరగకూడదనే కోరుకుంటున్నాం. వేగంగా వీచిన గాలులకు కొన్ని చోట్ల అద్దాలు పలిగాయి, కొన్ని బ్లాక్‌లు దెబ్బతిన్నాయి. పరిస్థితి చక్కబడ్డాక ఇంజనీర్ వచ్చి ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని పూర్తిగా పరిశీలించి మాకు రిపోర్టు అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఎలాంటి తుపానుల వచ్చినా తట్టుకొనే విధంగా పలు నిర్మాణాలను చేపట్టాలనుకుంటున్నాం’ అంటూ అవిషేక్ దాల్మియా పేర్కొన్నాడు. ఉంపన్ తుపాను సృష్టించిన ప్రళయ భీభత్సం చదవండి: ఉంపన్ విపత్తు; కేంద్రంపై బెంగాల్ ఆగ్రహం ‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’ -
సిరీస్ చేతికొచ్చేది నేడే...
పింక్‌బాల్‌తో భారత్ క్లీన్‌స్వీప్‌కు బాటవేసింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో కదం తొక్కగా... టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌కు దిగీదిగగానే ఇషాంత్ జూలు విదిల్చడం ప్రారంభించాడు. దీంతో పర్యాటక జట్టు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి ఎదురీదుతోంది. కోల్‌కతా: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నాలుగు రోజుల టికెట్లను విక్రయించింది. డే అండ్ నైట్ అనుభవాన్ని చవిచూసేందుకు ప్రేక్షకులేమో ఎగబడ్డారు. కానీ మ్యాచేమో మూడో రోజు రాత్రిదాకా కూడా సాగేలా లేదు. తొలి టెస్టులోనే గులాబీ బంతిపై భారత్ అంతలా పట్టు దక్కించుకుంది. చారిత్రక డే అండ్ నైట్ టెస్టు విజయానికి మరింత చేరువైంది. రెండో రోజు ఆటలో కెప్టెన్ విరాట్ కోహ్లి ( 194 బంతుల్లో 136; 18 ఫోర్లు) సెంచరీ హైలైట్. భారత్ తరఫున పింక్‌బాల్ టెస్టులో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా, నాయకుడిగా ఘనతకెక్కాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (69 బంతుల్లో 51; 7 ఫోర్లు) కూడా రాణించాడు. బంగ్లా బౌలర్లలో అల్ అమిన్ హుస్సేన్, ఇబాదత్ హుస్సేన్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 32.3 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ (4/39) దెబ్బకు జట్టంతా కకావికలమైతే... ముషి్ఫకర్ రహీమ్ (70 బంతుల్లో 59 బ్యాటింగ్; 10 ఫోర్లు) ఒక్కడే అర్ధసెంచరీతో క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి 27వ సెంచరీ... రెండో రోజు 174/3 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట కొనసాగించిన భారత్ నిలకడగా పరుగులు జతచేసింది. కెప్టెన్ కోహ్లి, రహానేలిద్దరు సమన్వయంతో ఆడటంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఈ దశలో రహానే 65 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు కోహ్లి శతకం దిశగా సాగుతుండగా... రహానేను తైజుల్ ఇస్లామ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో నాలుగో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచి్చన రవీంద్ర జడేజా (12) అండతో విరాట్ 159 బంతుల్లో డజను బౌండరీలతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. టెస్టుల్లో కోహ్లికిది 27వ సెంచరీ. 289/4 స్కోరు వద్ద భారత్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్లో భారత ఇన్నింగ్స్ తడబడింది. సెషన్ మొదలైన ఓవర్లోనే జడేజాను అబూ జయేద్ క్లీన్»ౌల్డ్ చేశాడు. శతకం తర్వాత చకచకా బౌండరీలు బాదిన కోహ్లి జట్టు స్కోరును 300 పరుగులకు చేర్చాడు. తర్వాత కాసేపటికే అతను ఔట్ అయ్యాడు. కీపర్ సాహా (17 నాటౌట్)కు తోడుగా అశి్వన్ (9), ఉమేశ్ (0), ఇషాంత్ (0) నిలబడలేకపోయారు. దీంతో 347/9 స్కోరు వద్ద భారత సారథి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఇషాంత్ మళ్లీ శివమెత్తాడు... తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల భారీ ఆధిక్యం పొందిన భారత శిబిరం ఆనందాన్ని ఇషాంత్ శర్మ రెట్టింపు చేశాడు. ఈ సీమర్ దూకుడు చూస్తుంటే కొందరికైతే రెండు రోజుల్లో మ్యాచ్ ముగుస్తుందేమోనన్న అనుమానం కలిగింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్ మొదలైన తొలి ఓవర్లోనే ఓపెనర్ షాద్మన్ (0)ను డకౌట్ చేసి తొలిదెబ్బకొట్టాడు. తన రెండో ఓవర్లో కెపె్టన్ మోమినుల్ హక్ (0)ను ఖాతా తెరువనియ్యలేదు. అంతే 2 పరుగులకే 2 వికెట్లు! ఇది చాలదన్నట్లు ఉమేశ్ తన వంతుగా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మిథున్ (6)ను పెవిలియన్ చేర్చడంతో పట్టుమని పది పరుగులైనా చేయకముందే (9/3) బంగ్లా మూడు వికెట్లను కోల్పోయింది. మరుసటి ఓవర్లో ఇషాంత్ పంజాకు క్రీజులో ఉన్న మరో ఓపెనర్ కైస్ (5) ఔటయ్యాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ముషి్ఫకర్ రహీమ్, మహ్ముదుల్లా (39; 7 ఫోర్లు) వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఈ జోడీ నిలదొక్కుకున్న తర్వాత మహ్ముదుల్లా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో బంగ్లా కష్టంగా 100 పరుగుల స్కోరు చేసింది. మళ్లీ ఇషాంత్ జూలు విదిల్చడంతో మెహదీ (15), ఉమేశ్ బౌలింగ్‌లో తైజుల్ (11) నిష్క్రమించారు. 152 పరుగుల వద్ద బంగ్లా ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే బంగ్లా ఇంకా 89 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లున్నాయి. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 106; భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) సబ్–మెహదీ హసన్ (బి) అల్ అమిన్ 14; రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఇబాదత్ 21; పుజారా (సి) షాద్మన్ (బి) ఇబాదత్ 55; కోహ్లి (సి) సబ్–తైజుల్ (బి) ఇబాదత్ 136; రహానే (సి) ఇబాదత్ (బి) తైజుల్ 51; జడేజా (బి) అబూ జయేద్ 12; సాహా (నాటౌట్) 17; అశి్వన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అల్ అమిన్ 9; ఉమేశ్ (సి) షాద్మన్ (బి) అబూ జయేద్ 0; ఇషాంత్ (ఎల్బీడబ్ల్యూ బి) అల్ అమిన్ 0; షమీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (89.4 ఓవర్లలో) 347/9 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–26, 2–43, 3–137, 4–236, 5–289, 6–308, 7–329, 8–330, 9–331. బౌలింగ్: అల్ అమిన్ 22.4–3– 85–3, అబూ జయేద్ 21–6–77–2, ఇబాదత్ 21–3–91–3, తైజుల్ ఇస్లామ్ 25–2–80–1. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఇషాంత్ 0; ఇమ్రుల్ కైస్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 5; మోమినుల్ (సి) సాహా (బి) ఇషాంత్ 0; మిథున్ (సి) షమీ (బి) ఉమేశ్ 6; ముషి్ఫకర్ రహీమ్ (బ్యాటింగ్) 59; మహ్ముదుల్లా (రిటైర్డ్ హర్ట్) 39; మెహదీ హసన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 15; తైజుల్ ఇస్లామ్ (సి) రహానే (బి) ఉమేశ్ 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (32.3 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–0, 2–2, 3–9, 4–13, 4–82 (మహ్ముదుల్లా రిటైర్డ్ హర్ట్), 5–133, 6–152. బౌలింగ్: ఇషాంత్ శర్మ 9–1–39–4, ఉమేశ్ 10.3–0–40–2, షమీ 8–0– 42–0, అశి్వన్ 5–0–19–0. ►1 అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రికీ పాంటింగ్ (ఆ్రస్టేలియా–41 సెంచరీలు) సరసన కోహ్లి (41 సెంచరీలు) చేరాడు. గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా–33), స్టీవ్ స్మిత్ ఆ్రస్టేలియా–20) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
‘ఈడెన్ మెరుపులు’
►‘పింక్ టెస్టు’ సందర్భంగా బీసీసీఐ–బెంగాల్ క్రికెట్ సంఘం కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి ఈడెన్ గార్డెన్స్‌లో గంటను మోగించి మ్యాచ్ ఆరంభానికి తెర తీశారు. భారత కెప్టెన్ కోహ్లిని బంగ్లా ప్రధానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పరిచయం చేయగా... ఆ తర్వాత టీమిండియా ఇతర సభ్యులతో ఆమె కరచాలనం చేశారు. ►మ్యాచ్ మధ్యలో మాజీ కెప్టెన్లతో పాటు పలువురు భారత క్రికెట్ దిగ్గజాలు ప్రత్యేక వాహనాల్లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ స్టేడియమంతా కలియదిరిగారు. కపిల్ దేవ్, సచిన్, అజహర్, గుండప్ప విశ్వనాథ్, వెంగ్‌సర్కార్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఆడిన తొలి టెస్టులో పాల్గొన్న భారత, బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా కూడా శుక్రవారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గంగూలీకి కెపె్టన్‌గా అది తొలి టెస్టు మ్యాచ్. ►క్రికెటేతర ఆటగాళ్లు అభినవ్ బింద్రా (షూటింగ్), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), సానియా మీర్జా (టెన్నిస్), మేరీకోమ్ (బాక్సింగ్) కూడా ప్రత్యేక అతిథులుగా మ్యాచ్‌కు వచ్చారు. ►లంచ్ విరామం సమయంలో ఈడెన్ గార్డెన్స్ వేదికకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాజీ ఆటగాళ్లు ఈ మైదానంతో తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. 1993 హీరో కప్ ఫైనల్ గురించి కుంబ్లే చెప్పగా... ఆ్రస్టేలియాతో 2001 చారిత్రాత్మక టెస్టులో భాగమైన లక్ష్మణ్, ద్రవిడ్, సచిన్, హర్భజన్ నాటి ముచ్చట్లు చెప్పారు. అంతకుముందు టాస్ సమయంలో ఆర్మీ పారా ట్రూపర్లు గాల్లో చక్కర్లు కొడుతూ మైదానంలోకి వచ్చి ఇద్దరు కెపె్టన్లకు గులాబీ బంతులను అందించాలని ముందుగా అనుకున్నా... భద్రతా పరమైన కారణాలతో దానిని చివరి నిమిషంలో రద్దు చేశారు. -
క్యాబ్ పీఠంపై మళ్లీ దాదా
కోల్‌కతా: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా మరోసారి భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ శనివారం బాధ్యతలను చేపట్టాడు. అతడు మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగు తాడు. 2014లో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా క్యాబ్‌లో ఎంట్రీ ఇచ్చిన గంగూలీ... అనంతరం జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారు. అయితే 2015లో అప్పటి క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ ధాలి్మయా మృతి చెందటంతో తొలిసారి అధ్యక్షుడయ్యా -
బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా!
ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధం ఉపాధ్యక్షుడిగా గంగరాజు చెన్నైలో నేడు ఏజీఎం చెన్నై: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరోసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వాయిదా పడుతూ వస్తోన్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) చెన్నైలో నేడు (సోమవారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ పడేందుకు దాల్మియా ఒక్కరే నామినేషన్ వేశారు. ఈ పదవికి గట్టి పోటీదారుడిగా నిలిచిన మాజీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు ఈస్ట్ జోన్ నుంచి ఎవరూ మద్దతుగా నిలువలేదు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. గతంలో 2001 నుంచి 2004 వరకు దాల్మియా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు దశాబ్దకాలం అనంతరం ఆయన మరోసారి ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదు. దీంతో ఆయన తనకు అనుకూలమైన వ్యక్తిని ఈ పదవిలో కూర్చోబెట్టేందుకు వేగంగా పావులు కదిపారు. ఈ క్రమంలో ‘క్యాబ్’ అధ్యక్షుడు దాల్మియాను నిలబెట్టేందుకు తన మద్దతుదారుల్లో ఏకాభిప్రాయం సాధించారు. పోటీపడే అవకాశం లేకపోయినా ఈ ఎన్నికల్లో శ్రీనివాసన్ ఓటు వేస్తారు. 70 ఏళ్ల దాల్మియా ఈస్ట్ జోన్ నుంచి రెండు ఓట్లను ప్రభావితం చేయనున్నారు. ఈస్ట్ జోన్లో ఉన్న ఆరు యూనిట్లు శ్రీనికి అనుకూలంగా నిలిచాయి. ఆదివారం ఈ విషయంలో వారు సమావేశం కూడా జరిపారు. ప్రస్తుత కార్యదర్శి సంజయ్ పటేల్‌పై ఇదే పదవి కోసం పవార్ శిబిరం నుంచి హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పోటీ పడనున్నారు. సంయుక్త కార్యదర్శిగా అమితాబ్ చౌదరి (జార్ఖండ్), చేతన్ దేశాయ్ (గోవా) పోటీ పడుతున్నారు. కోశాధికారిగా అనిరుధ్ చౌదరి (హర్యానా), రాజీవ్ శుక్లా (యూపీ) పోటీలో ఉన్నారు. శ్రీనివాసన్ గ్రూపు నుంచి ఐదు ఉపాధ్యక్ష పదవుల కోసం ఎంఎల్ నెహ్రూ (నార్త్‌జోన్), ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు (సౌత్‌జోన్), గౌతమ్ రాయ్ (ఈస్ట్‌జోన్), సమర్జిత్ సింగ్ గైక్వాడ్ (వెస్ట్‌జోన్), సీకే ఖన్నా (సెంట్రల్) పోటీపడుతుండగా... ఇందులో తొలి ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పవార్ గ్రూపు నుంచి ఇవే పదవులకు జ్యోతిరాదిత్య సింధియా (సెంట్రల్), రవి సావంత్ (వెస్ట్) బరిలోకి దిగుతున్నారు. నార్త్ జోన్ నుంచి ఎంపీ పాండవ్ పోటీ చేసే ఆలోచన చేసినా నెహ్రూ కోసం తప్పుకున్నారు. -
బై... బై... ఈడెన్
ఇలా జరిగిందేం..? తలపట్టుకున్న క్యాబ్ కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో సచిన్ ఆడే చివరి టెస్టు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)... మూడో రోజే మ్యాచ్ అయిపోవడంతో తలపట్టుకుంది. నాలుగు, ఐదు రోజుల్లో సచిన్ సన్మానానికి భారీ ఏర్పాట్లు చేశారు. నాలుగోరోజే మ్యాచ్ ముగిసినా తమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా ప్లాన్ చేశారు. సెలబ్రిటీలందరినీ నాలుగో రోజు మ్యాచ్‌కు ఆహ్వానించారు. 199 కిలోల గులాబీ పూలు చల్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మ్యాచ్ మూడో రోజే ముగిసింది. సచిన్‌కు మమతా బెనర్జీ ‘చిత్రం’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తను గీసిన ఓ చెట్టు చిత్రాన్ని సచిన్‌కు బహూకరించారు. దీంతోపాటు సచిన్‌కు తలపాగాను అందించగా దాన్ని మాజీ కెప్టెన్ గంగూలీ అతడి తలకు అలంకరించాడు. మరోవైపు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా 199 బంగారు ఆకులతో కూడిన మర్రి చెట్టు విగ్రహాన్ని, టాస్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు నాణేన్ని సచిన్‌కు అందించారు. -
టెండూల్కర్ ‘ఫేర్వెల్’
199 కిలోల ‘పూల వర్షం’ కోల్‌కతా: ఆకాశం నుంచి పూల వర్షం... ఎటు చూసినా సచిన్ కటౌట్లు.. స్టేడియంలో ఉన్న 70 వేల మందికి మాస్టర్ మాస్క్‌లు... ఇలా సచిన్ 199వ టెస్టు కోసం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈడెన్‌లో మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మలిచే ప్రణాళికలను వెల్లడించింది. సచిన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి 199 కేజీల గులాబీ పూల వర్షాన్ని కురిపించనున్నారు. అంతేకాదు టిక్కెట్‌తో పాటు 45 పేజీల ప్రత్యేక బుక్‌లెట్‌ను కూడా అందించనుంది. ఐదు రోజుల పాటు వందలాది సచిన్ కటౌట్లను స్టేడియంలో, ఫ్లడ్ లైట్స్ టవర్స్‌పైనా పెట్టనుంది. వచ్చే నెల 6 నుంచి 10 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే 3 నుంచే కోల్‌కతా వీధుల్లో సచిన్ ప్రత్యేక విగ్రహాన్ని ఊరేగించనున్నారు. మాస్టర్ గౌరవార్థం ప్రత్యేక విందు ఇస్తున్నారు. దీనికి విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, ఆసీస్ స్పిన్ గ్రేట్ షేన్ వార్న్‌లను ఆహ్వానించారు. మ్యాచ్ ముగిశాక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ ప్రభుత్వం తరఫున మాస్టర్‌ను సన్మానించనుంది.