సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024-25 కోసం బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సుదీప్ కుమార్ ఘరామి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిగా వైట్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇండియన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ జట్టులో చోటు దక్కింది.
షమీ ఇటీవలే రంజీ ట్రోఫీ 2024-25లో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే 6 వికెట్లతో ఈ సీనియర్ బౌలర్ సత్తచాటాడు. ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు ఈ బెంగాల్ స్టార్ సిద్దమయ్యాడు.
కాగా ఈ జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్‌కు కూడా బెంగాల్ సెలక్టర్లు చోటిచ్చారు. నవంబర్ 23 నుంచి ఈ దేశవాళీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు హైదరాబాద్, మేఘాలయ, మధ్యప్రదేశ్, మిజోరాం, బీహార్, రాజస్థాన్, పంజాబ్‌లతో పాటు గ్రూప్-ఎలో ఉంది.
బెంగాల్ జట్టు: సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, రిటిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), రంజోత్ సింగ్ ఖైరా, ప్రయాస్ రే బర్మన్ (వికెట్ కీపర్), అగ్నివ్ పాన్ (వికెట్ కీపర్), ప్రదీప్త ప్రమాణిక్, సాక్షం చౌదరి, మహ్మద్ షమీ, ఇషాన్ పోరెల్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్ మరియు సౌమ్యదీప్ మండల్.
చదవండి: IPL 2025 Mega Auction:'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
Comments
Please login to add a commentAdd a comment