దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్, బరోడా- బెంగాల్, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్(క్వార్టర్ ఫైనల్-3) మ్యాచ్ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచింది. తద్వారా సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
బరోడా ఓపెనర్లు భళా
ఇక క్వార్టర్ ఫైనల్-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్లు శశ్వత్ రావత్(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు.
పాండ్యా బ్రదర్స్ విఫలం
మొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు.
శివాలిక్, విష్ణు మెరుపు ఇన్నింగ్స్
మిగతా వాళ్లలో శివాలిక్ శర్మ(17 బంతుల్లో 24), భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది.
బెంగాల్ బౌలర్లలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ మూడు వికెట్లతో మెరిశాడు.
బరోడా వర్సెస్ బెంగాల్ తుదిజట్లు
బెంగాల్
అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.
బరోడా
శశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్
చదవండి: SMAT 2024: వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment